Parasuram: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న కమర్షియల్ డైరెక్టర్స్ లో పరుశురాం ఒకరు. యువత సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు పరశురాం. నిఖిల్ హీరోగా చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత పరశురాం దర్శకత్వం వహించిన సోలో సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయింది అంటే చాలామంది అప్పటినుంచి పరశురాం వర్క్ ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మంచి రచయిత మరియు దర్శకుడు దొరికాడు అని అనిపించుకున్నాడు ఆ సినిమాతో. ఇక విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలియనిది కాదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక్కడితో పరుశురాం కాస్త స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.
మహేష్ బాబు తో సూపర్ హిట్
ఇక పరశురాం దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సినిమా సర్కారు వారి పాట. మహేష్ బాబు లోని మిస్సయిన ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని ఈ సినిమాతో మరోసారి బయటకు తీసాడు పరుశురాం. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ బాబు టైమింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అంతేకాకుండా మహేష్ బాబు అభిమానులు ఎక్స్పెక్ట్ చేసే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా బాగానే ఈ సినిమాల్లో ప్రెసెంట్ చేశాడు. ఈ సినిమా తర్వాత నాగచైతన్య హీరోగా సినిమా మొదలవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా అలానే ఆగిపోయింది. ఈ విషయంపై నాగచైతన్య కూడా స్పందిస్తూ ఆయన నా టైం వేస్ట్ చేశాడు అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. పరశురాం నుంచి చివరగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.
కార్తీతో సినిమా
ఇకపోతే పరుశురాం నటుడు కార్తీతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పేరుకు తమిళనాడు అయినా కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కార్తీ కూడా పలు సందర్భాల్లో నాకు తెలుగు ప్రేక్షకులు ఇష్టమని చెబుతూ వచ్చాడు. అయితే పరుశురాం కార్తీకి కథను వినిపించారట. ఈ కథ కూడా కార్తీకు నచ్చింది అని సమాచారం వినిపిస్తుంది. కానీ కార్తీ ఇంకా పరశురాం కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీని గురించి పూర్తి సమాచారం త్వరలో రావాల్సి ఉంది. అలానే ఈ సినిమాను కూడా అధికారికంగా ప్రకటించనున్నారు.
Also Read : Ram Jagadeesh : నాని అవకాశం మాత్రమే కాదు, కారు కూడా గిఫ్ట్ ఇచ్చారు