School student Jumps From Window For Love| కాలేజీ కుర్రాళ్లు మంచి ఉడుకు రక్తంతో ఉంటారు. టీనేజ్ లో ఉన్నప్పుడు ఆ జోష్ అలాంటిది మరి. కానీ కొన్ని సార్లు ఆ ఆవేశం వల్ల జీవితాలే నాశనమవుతాయి. తాజాగా అలాంటిదే ఒక ఘటన జరిగింది. కాలేజీలో ఒక యువకుడు ఒక యువతిని ప్రేమించాడు. కానీ ఆమె అతడి ప్రేమకు పూర్తిగా అంగీకరించలేదు. అంతే నా ప్రేమనే అనుమానిస్తావా అంటూ ఆపుతున్నా వినకుండా ‘నేను దూకేస్తా’ అంటూ కిటికీ పగలగొట్టుకొని మరీ కిందకు దూకేశాడు ఆ యువకుడు. సోషల్ మీడియా దీనికి సంబంధించి ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలోని దృశ్యాలు చైనా దేశానికి చెందినవి. అక్కడ జియాంగ్ సు రాష్ట్రంలో ఇటీవల ఒక యువకుడు మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ యువకుడు బతికేఉన్నాడా? లేక మరణించాడా? అనేది స్పష్టం కాలేదు. కొందరు నెటిజెన్లు అతను బతికే ఉన్నాడని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెబుతుండగా.. మరి కొందరు అనుమానమే అతను బతికే చాన్స్ లేదు అని అంటున్నారు.
ట్విట్టర్ ఎక్స్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై ఆ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఓ యువకుడు ఎదురుగా ఉన్న ఒక యువతితో వాగ్వాదం చేస్తున్నాడు. కాసేపటికి అతను పక్కనే ఉన్న కిటికీ నుంచి దూకేస్తానని బెదరించాడు. చెప్పినట్లుగానే కిటికీ నుంచి దూకాలని ప్రయత్నించినా దాని గ్లాస్ డోర్ ఉండడం కారణంగా అతని కేమీ కాలేదు. దీంతో అతను మరోసారి ప్రయత్నిస్తానని దూరంగా వెనక్కి వెళ్లి కిటీకీ వైపు పరుగులు తీస్తుండగా.. ఆ యువతి అతడిని ఆపాలని అడ్డుపడింది. అయినా ఆ యువకుడు అమెను అడ్డుతొలగించుకొని కిటికీ డోర్ పగల గొట్టేసి కిందికి దూకేశాడు.
అసలు కారణమేంటి?
చాలా మంది ఈ వీడియో చూసి ఆ అమ్మాయితో లవ్ కారణంగా యువకుడు కిటికీ నుంచి దూకేశాడని చెబుతుండగా.. మరికొందరు అతను చదువు ఒత్తిడి వల్ల సూసైడ్ చేసుకున్నాడని చెబుతున్నారు. ఒక యూజర్ అయితే అతను లవ్ ఫెయిల్యూర్ కారణంగానే దూకేశాడని భావించి.. “నిజమైన ప్రేమంటే అందరికీ ఆదర్శంగా నిలవాలి. కానీ వినాశానం సూచించకూడదు.” అని కామెంట్ చేశాడు.
ఇలాంటి కేసులు చైనాలో ఎక్కువగా జరుగుతున్నాయని అక్కడి స్థానిక మీడియా సంస్థ కథనం ప్రచురించింది. 2020లో చాలా మంది టీనేజ్ పిల్లలు తల్లిదండ్రులు వారిని మందలించారని లేదా గొడవ పడ్డారనే కారణంగా ఆత్మ హత్యలు చేసుకున్నారు.
Also Read: ఒక అరటి పండు రూ.500 పైనే.. అక్కడికి వెళితే డబ్బులున్నా ఆహారం కొనలేం
ఇలాంటి సమస్యలకు మానసిక నిపుణులు కొన్ని పరిష్కారాలు సూచిస్తున్నారు. పాఠశాలలో కౌన్సిలింగ్ ప్రొగ్రామ్స్ నిర్వహించాలని.. మానసికంగా కుంగిపోతున్న పిల్లలను పాజిటివ్ దృక్పథంతో తీర్చి దిద్దాలని చెబుతున్నారు. పిల్లలక కాదు వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ చాలా అవసరమని అంటున్నారు. టీనేజ్ పిల్లల మానసిక స్థితి తెలుసుకొని వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
A high school student in China jumps out of building to express his true love pic.twitter.com/m96l96VcbG
— Crazy Clips (@crazyclipsonly) April 21, 2025