BigTV English

Premalu Movie: వంద కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఓటీటీ వాయిదా.. రాజమౌళి కారణమా?

Premalu Movie: వంద కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఓటీటీ వాయిదా.. రాజమౌళి కారణమా?
premalu movie ott telugu
Premalu Movie

Premalu movie ott release update(Telugu film news): కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమాని అయినా.. ఏ భాష సినిమాని అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఎంతో మంది సినీ ప్రముఖులు సైతం ఈ సూత్రాన్ని నమ్ముతారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో వేరే భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న కొన్ని సినిమాలు టాలీవుడ్‌లోకి వచ్చి మంచి రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే.


అయితే ఈ కోవలోకి ఇటీవలే ఓ మలయాళ మూవీ వచ్చి చేరింది. ఆ మూవీ మరేదో కాదండి ‘ప్రేమలు’ మూవీనే. ఒక చిన్న సినిమాగా.. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని కైవసం చేసుకుంది.

నస్లెన్ కె గఫూర్, మమితా బైజు జంటగా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని గిరీష్ ఏడీ రూపొందించారు. ఇక ఈ మూవీ యూఎస్‌ఏ ప్రీమియర్స్ నుంచి సూపర్ డూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఈ కారణంగా మలయాళంలో ఫస్ట్ షో నుంచే థియేటర్లు ఫిల్ అయిపోయాయి.


Also Read: నితిన్ బర్త్‌డే స్పెషల్.. పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్‌తో కొత్త సినిమా పోస్టర్ రిలీజ్

అంచలంచలుగా ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుని కోట్లలో కలెక్షన్లు రాబట్టింది. దాదాపు రూ.100 కోట్ల వరకు కలెక్షన్స్ నమోదు చేసి మలయాళ బ్లాక్ బస్టర్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక అక్కడ బాక్సాఫీసు బద్దలు కొట్టిన ఈ చిత్రాన్ని తెలుగులోకి రిలీజ్ చేశారు.

ప్రముఖ దిగ్గజ దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ చిత్రాన్ని మార్చి 8న తెలుగులో రిలీజ్ చేశాడు. అయితే తెలుగులో కూడా ఈ మూవీ అద్భుతమైన రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఇక్కడ కూడా దాదాపు రూ.20 కోట్ల వరకు గ్రాస్ వసూళు చేసి దుమ్ము దులిపేసింది. దీంతో ఈ మూవీ ద్వారా కార్తికేయకు లాభాల పంట పండింది.

అయితే థియేటర్లలో సూపర్ డూపర్ హిట్‌తో దూసుకుపోతున్న క్రమంలో ఓటీటీ ప్రియులు ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీప్లస్ హాట్ స్టార్ భారీ ధరకు సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రాన్ని మార్చి 29న స్ట్రీమింగ్ చేసేందుకు అంతా సిద్ధం చేసుకుంది.

Also Read: టిల్లుగాని కోట్ల ఊచకోత.. తుక్కు తుక్కుగా డీజే కొట్టాడుగా..!

అయితే ఈ మూవీ మార్చి 29న స్ట్రీమింగ్‌కు రాలేదు. దీంతో ఈ మూవీ కోసం ఎదురుచూసిన ప్రేక్షకులు నిరాశ చెందారు. తాజా సమచారం ప్రకారం.. ఈ మూవీ ఏప్రిల్ 5 లేదా 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి కారణం కూడా ఉందని అంటున్నారు.

ఈ మూవీ ఇంకా తెలుగు, తమిళంలో థియేటర్లలో సక్సెస్‌ఫుల్ రన్ అవుతుందని అందువల్లనే స్ట్రీమింగ్ తేదీలో మార్పులు జరిగాయని కొందరు అంటున్నారు. మరికొందరేమో రాజమౌళి రిక్వస్ట్ చేయడం వల్లనే ఈ సినిమా స్ట్రీమింగ్ వాయిదా పడిందని చెప్పుకొస్తున్నారు. ఇక ఏది ఏమైనా ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే వాయిదా పడింది.

Tags

Related News

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Big Stories

×