BigTV English

Ganta Vs Avanthi: పొలిటికల్ కెరీర్‌లో తొలిసారి.. వెనుక ఏం జరిగింది?

Ganta Vs Avanthi: పొలిటికల్ కెరీర్‌లో తొలిసారి.. వెనుక ఏం జరిగింది?
Tdp Ganta srinivasarao vs ysrcp Avanthi srinivasarao
Bhimili political fight on Tdp Ganta srinivasarao vs ysrcp Avanthi srinivasarao

Ganta Vs Avanthi(Andhra pradesh political news today): ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అందర్నీ ఆకట్టుకుంటున్న నియోజకవర్గం భీమిలి. ఇందులో ప్రత్యేక ఏముందిలే అనుకోవద్దు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గురుశిష్యుల మధ్య గట్టి పోటీ నెలకొంది.


భీమిలి పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది.. దేశంలో రెండో పురాతన మున్సిపాల్టీ. ఈసారి ఎన్నికల్లో ఇక్కడ గురుశిష్యుల మధ్య పోటీ నెలకొంది. దీంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. వాళ్లు ఎవరోకాదు.. ఒకరు టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు.. మరొకరు అవంతి శ్రీనివాసరావు. అవంతికి గురువు గంటా అని పొలిటికల్ సర్కిల్స్‌లో చెబుతారు. గత ఎన్నికల్లో వీరిద్దరి మధ్య మాటల వార్ సాగింది. ఛాలెంజ్‌లు కూడా విసురుకున్నారు. అదంతా గతం.. ప్రస్తుతంలోకి వచ్చేద్దాం.

ఎన్నికలు వచ్చిన ప్రతీసారి గంటా తన నియోజకవర్గాన్ని మార్చుకుంటారు. ఆయన పొలిటికల్ కెరీర్‌లో రెండోసారి పోటీ చేసిన సందర్భాలు లేవు. తొలిసారి అందుకు భీమిలి వేదికైంది. 2014లో ఇదే నియోజకవర్గం నుంచి గంటా గెలవడం, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలాగే అవంతి కూడా గెలిచి జగన్ కేబినెట్‌లో మంత్రి అయ్యారు. తర్వాత పరిణామాల నేపథ్యంలో కేబినెట్ నుంచి హైకమాండ్ తప్పించింది.


ఈసారి తనకు భీమిలి టికెట్ కావాలని భీష్మించుకున్నారు గంటా శ్రీనివాసరావు. చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని చంద్రబాబు చెప్పినప్పటికీ.. తనకు భీమిలి కావాల్సిందేనని పట్టుబట్టారు.. టికెట్ దక్కంచు కున్నారు. ఒకసారి పోటీ చేసిన చోట నుంచి మరోసారి చేయరన్న విమర్శను తొలగించుకునేందుకు పట్టు బట్టి భీమిలి ఎంచుకున్నారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. అంతేకాదు గత ఎన్నికల్లో గంటాను ఛాలెంజ్ చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు. దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు గంటా.

రెండుసార్లు గెలుపొందిన అవంతిపై అక్కడి ప్రజలు గుర్రుగా ఉన్నారు. పేరుకు ఎమ్మెల్యేగానీ నియోజక వర్గాన్ని పట్టించుకోలేదన్న ముద్ర కూడా ఆయనపై ఉంది. ఇవన్నీ గమనించిన గంటా.. శిష్యుడికి ఝలక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ నేతలు ఒకే సామాజికవర్గానికి చెందినవారే! అంతేకాదు ఏపీలో కాపు సామాజికవర్గానికి అత్యధిక ఓటర్లన్న నియోజకవర్గాల్లో భీమిలి కూడా ఒకటి. దీంతో ఇక్కడ ఫైట్ ఆసక్తికరంగా మారింది.

ALSO READ:కలియుగం.. కౌంటర్ ఎటాక్, అసలేం జరిగింది?

భీమిలిలో యాదవ, మత్య్సకార ఓటర్లు ఉన్నారు. అభ్యర్థి గెలుపులో ఆయా కులాలే ఓట్లు కీలకంగా మారనున్నాయి. పొత్తులోభాగంగా జనసేన ఓట్లు తమకు కలిసి వస్తాయన్న భావన గంటాలో ఉన్నారు. గతంలో భీమిలి నియోజవర్గాన్ని అభివృద్ధి చేశారు కూడా. ఈ క్రమంలో తన గెలుపు నల్లేరు మీద నడగానే చెబుతున్నారు.

ఇక అవంతి విషయానికొస్తే.. నియోజకవర్గం ఓటర్లను పట్టించుకోరనే భావన అక్కడి ప్రజల్లో ఉంది. ఎప్పుడు చూసినా విశాఖలోనే ఉంటారని, కనీస సదుపాయాలు తమకు కల్పించలేదని పలుమార్లు అవంతి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు ప్రజలు. అయితే గతం మాదిరిగానే ఈసారీ వైసీపీ గాలి తన వైపు వీస్తుందనే నమ్మకంతో ఉన్నారు అవంతి. మరి ఈ పోరులో గెలుపెవరిదో చూడాలి.

Tags

Related News

CM Chandrababu: వరదలపై హై అలర్ట్.. సీఎం చంద్రబాబు డైరెక్ట్ ఆర్డర్స్.. అంతా అప్రమత్తం!

Bus accident: రాత్రి వేళ బస్సు బోల్తా… క్షణాల్లో కేకలు, అరుపులు.. ఎక్కడంటే?

Balakrishna warns: బాలకృష్ణ మాస్ వార్నింగ్… వేదికే కదిలిపోయింది!

Vijayawada beautification: విజయవాడకు కొత్త లుక్.. ఏపీ ప్రభుత్వం ప్లాన్ ఇదే!

Trolling On Jagan: కేంద్ర బలగాలతో ఎన్నికలు.. జగన్ ని కామెడీ పీస్ చేసేశారుగా?

Heavy rain alert: 48 గంటల పాటు దంచుడే.. ఏపీలోని ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన!

Big Stories

×