Malayalam Director : మలయాళం ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని ఇండస్ట్రీకి వరుస హిట్లను అందించిన స్టార్ డైరెక్టర్ షఫీ కన్నుముశారు.. కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన డైరెక్టర్ షఫీ.. తన చిత్రాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. అనేక సినిమాలు ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేశాయి. కొన్నాళ్లుగా షఫీ క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నారు. ఈనెల 16 తీవ్ర తలనొప్పితో ఆసుపత్రిలో చేరారు.. కొన్నాళ్ల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త విని ఇండస్ట్రీలోని ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. ఆయన మృతి పై సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు..
డైరెక్టర్ షఫీ ఈనెల 16న తీవ్రమైన తలనొప్పితో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అంతర్గత రక్తస్రావం కావడంతో అత్యవసర శస్త్రచికిత్స చేశారు. కొన్నాళ్లుగా షఫీ క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. ఈయన గత కొన్ని రోజులుగా కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో ఆయనను వెంటిలేటర్ పై ఉంచారు వైద్యులు. వెంటిలేటర్ సాయంతో అతడి ప్రాణాలను కాపాడారు. గత ఐదారు రోజులుగా ఎర్నాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 12.25 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు.. ఇక ఇవాళ మధ్యాహ్నం మనపట్టిపరం కొచ్చిన్ సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆడిటోరియంలో ప్రజల సందర్శనార్థం షఫీ పార్థీవదేహం ఉంచనున్నారు. సినీ ప్రముఖుల సందర్శనార్థం తర్వాత ఈరోజు సాయంత్రం 4 గంటలకు కారుకప్పిల్లి జుమా మసీదు ఖబర్‌స్థాన్‌లో అంత్యక్రియలు జరగనున్నాయని సమాచారం.. ఇప్పటికే అయిన పార్థివ దేహాన్ని పలువురు సినీ ప్రముఖులు సందర్శించారు..
మలయాళ ఇండస్ట్రీలో తన సినిమాలతో ఎన్నో సంచనాన్ని సృష్టించిన డైరెక్టర్ షఫీ ఫిబ్రవరి 1968లో జన్మించారు. మలయాళ చిత్రసీమలో ప్రముఖ దర్శకుల్లో షఫీ ఒకరు. ప్రముఖ దర్శకుడు, కథా రచయిత రఫీ ఈయనకు అన్న. అసోసియేట్ డైరెక్టర్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు.. అసిస్టెంట్ డైరెక్టర్గా ఎన్నో సినిమాలకు పని చేశాడు. ఇక 2001లో వన్ మ్యాన్ షో సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు షఫీ. కళ్యాణరామన్, పులివల్ కళ్యాణం, తొమ్మనుమ్ మక్కలుమ్, మాయావి, చట్టంబినాడు, చాక్లెట్, మేరిక్కుండోరో కుంజాడు, మేకప్ మ్యాన్, టూ కంట్రీస్ మరియు షెర్లాక్ టామ్స్ లాంటి సినిమాలు తీసారు.. ఆయన తీసిన సినిమాలు సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మలయాళ ఇండస్ట్రీలో ప్రముఖ డైరెక్టర్ చనిపోవడం ఆ ఇండస్ట్రీకి తీరని ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు..