BigTV English

Mallika Sherawat: నా నడుము అతడికి ఓ ఆయుధం.. చపాతీ పిండి అంటూ సౌత్ డైరెక్టర్‌పై మల్లికా బోల్డ్ కామెంట్స్..!

Mallika Sherawat: నా నడుము అతడికి ఓ ఆయుధం.. చపాతీ పిండి అంటూ సౌత్ డైరెక్టర్‌పై మల్లికా బోల్డ్ కామెంట్స్..!

Mallika Sherawat.. ప్రముఖ బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మల్లికా షెరావత్ (Mallika Sherawat) తన అందచందాలతో గ్లామర్ తో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోందనడంలో సందేహం లేదు. హాట్ డోస్ పెంచేసి యువతను తన వశం చేసుకోవడంలో ఈమె తర్వాతే ఎవరైనా.. అంతలా బోల్డ్ బ్యూటీగా పేరు దక్కించుకుంది. ముఖ్యంగా భాషతో సంబంధం లేకుండా పాత్ర సరైనది దొరికితే నిర్మొహమాటంగా నటిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. హిందీ తో పాటు కొన్ని దక్షిణాది సినిమాలలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయింది. ముఖ్యంగా కమల్ హాసన్ హీరోగా నటించిన దశావతారం సినిమాతో పాటు మరికొన్ని సౌత్ సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేసి అందరిని ఆకట్టుకుంది.


12 ఏళ్ల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన మల్లికా..

కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే 2012లో సడన్ గా ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా “విక్కీ విద్యా క ఓ వాలా వీడియో” అనే సినిమాతో మళ్లీ వెండితెరపై రీఎంట్రీ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న మల్లికా షెరావత్ గతంలో ఒక సౌత్ డైరెక్టర్ తనపై చేసిన కామెంట్లకు రియాక్ట్ అవుతూ ఈ విధంగా సమాధానం తెలిపింది. సౌత్ ఇండియన్ మూవీ డైరెక్టర్ పై ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నాయి.


ఆ సౌత్ డైరెక్టర్ కి నా నడుము ఒక ఆయుధం..

ఇంతకీ మల్లికా షెరావత్ ఏం మాట్లాడింది అనే విషయానికొస్తే.. ఒక సౌత్ డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి ఒక సినిమాలో హాట్ ఐటమ్ సాంగ్ ఉంది ,చేయాలని చెప్పారు. ఇది ఎలా ఉండాలంటే చూసే ఆడియన్స్ కి మీరు ఎంత హాట్ గా ఉన్నారు అనేది అర్థం అవ్వాలి అంటూ ఆయన తెలిపారు. అప్పుడు నేను ఓకే చెప్పాను. ఆ తర్వాత ఇంతకు నన్ను ఎలా చూపిస్తారు అని కూడా ప్రశ్నిస్తే.. ఆయన మీ నడుం మీద చపాతీలు వేడి చేస్తాను అని చెప్పాడు. అది వినడానికి ఫన్నీగా ఉన్నా .. నేను మాత్రం ఆశ్చర్యపోయి వెంటనే ఆ పాట చేయను అని చెప్పేసాను. అంతే ఇక ఆ సినిమాలో నాకు అవకాశం లభించలేదు. ఆ తర్వాత మళ్లీ అలాంటి సందర్భం కూడా ఎదురు కాలేదు అంటూ తెలిపింది మల్లికా షెరావత్. అతడు నా నడుమును తన ఆయుధంగా మార్చుకోవాలని చూశాడు. అందుకే నా నడుముని హైలెట్ చేస్తూ పాట చిత్రీకరించాలని చూసాడు. దానికి నేను అంగీకరించలేదు అంటూ తెలిపింది మల్లికా. ఇకపోతే ఆ సౌత్ డైరెక్టర్ ఎవరు అన్న విషయాన్ని మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు.

ఇక మల్లికా షెరావత్ కెరియర్..

2012లో ఇండస్ట్రీకి దూరమైన ఈమె ఆ తర్వాత చాలాకాలం బ్రేక్ తీసుకొని మళ్లీ ఇప్పుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది .దాదాపు 12 ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరమైన ఈమె రీ ఎంట్రీ లో సక్సెస్ అవుతుందా? లేదా? అనే విషయం అభిమానులలో ప్రశ్నార్ధకంగా మారింది. ఒకప్పుడు బోల్డ్ బ్యూటీగా పేరు దక్కించుకున్న మల్లికా ఇప్పుడు ఎలాంటి పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×