BigTV English

GN Saibaba: గాంధీ ఆసుపత్రికి ప్రొఫెసర్ సాయిబాబా శరీరం అప్పగింత

GN Saibaba: గాంధీ ఆసుపత్రికి ప్రొఫెసర్ సాయిబాబా శరీరం అప్పగింత

Ex Professor GN Saibaba body:  ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, మానవ హక్కుల కార్యకర్త జీఎన్ సాయిబాబా కోరుకున్నట్లుగానే జరుగుతోంది. తన మరణం తర్వాత కళ్లను, శరీరాన్ని దానం చేయాలని కోరుకున్నారు. ఆయన చెప్పిన విధంగా ఫ్యామిలీ సభ్యులు చేస్తున్నారు.


హైదరాబాద్‌లోని ఎల్పీప్రసాద్ ఆసుపత్రికి సాయిబాబా కళ్లను దానం చేశారు. సోమవారం సాయంత్రం ప్రొఫెసర్ సాయిబాబా మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి అప్పగించనున్నారు కుటుంబ సభ్యులు.

ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా శనివారం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యం కారనంగా గత నెల 19న ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. గాల్ బ్లాడర్‌లో రాళ్లను గుర్తించిన వైద్యులు, వాటిని తొలగించారు. ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటుండగా, ఆయన ఆరోగ్యం క్షీణించింది.


దసరా రోజు రాత్రి ఎనిమిది గంటల సమయంలో చనిపోయారు సాయిబాబా. ఆయన కోరిక మేరకు కళ్లను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి, శరీరాన్ని గాంధీ ఆసుపత్రికి దానం చేయనున్నారు. ప్రొఫెసర్ మృతదేహాన్ని సోమవారం ఉదయం గన్ పార్క్ వద్దకు తీసుకెళ్లారు.

ALSO READ:  గ్రూప్ -1 అభ్యర్థులకు అలర్ట్.. నేటి నుంచే హాల్ టికెట్లు.. డౌన్‌లోడ్ చేసుకోండిలా!

అక్కడి నుంచి మౌలాలిలోని ఆయన నివాసానికి తరలించారు. సన్నిహితుల దర్శనార్థం సాయంత్రం వరకు అక్కడే ఉండనున్నారు. సాయంత్రం గాంధీ ఆసుపత్రికి సాయిబాబా మృతదేహాన్ని అప్పగించనున్నారు ఫ్యామిలీ సభ్యులు.

సాయిబాబా సొంతూరు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. చిన్న వయస్సులోనే ఆయనకు పోలియో సోకింది. రెండు కాళ్లు దెబ్బతిన్నా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఎం.ఫిల్ చేశారు. 2013లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు.

మానవ హక్కుల ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారు ప్రొఫెసర్ సాయిబాబా.  అయితే ఉపా కేసు నేపథ్యంలో ఆయనను ఢిల్లీ యూనివర్సిటీ మూడేళ్ల కిందట ఉద్యోగం నుంచి తొలగించింది. అంతకుముందు అంటే పదేళ్ల కిందట సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

ముఖ్యంగా మావోయిస్టులకు చెందినవారిలో రివల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్ తరపున సమావేశం ఏర్పాటు చేశారన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో ముంబై హైకోర్టు తీర్పుతో జైలు నుంచి విడుదలయ్యారు. అప్పటినుంచి హైదరాబాద్‌లో భార్య, పిల్లలతో కలిసి ఉంటున్నారు ప్రొఫెసర్ సాయిబాబా.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×