BigTV English

Mamitha Baiju: ప్రేమలు బ్యూటీ.. కొట్టిందిరా మళ్లీ జాక్ పాట్.. ?

Mamitha Baiju: ప్రేమలు బ్యూటీ.. కొట్టిందిరా మళ్లీ జాక్ పాట్.. ?

Mamitha Baiju: ప్రేమలు సినిమాతో ఇండస్ట్రీ మొత్తం తనవైపుకు తిప్పుకుంది మలయాళ బ్యూటీ మమితా బైజు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ.. ప్రేమలు సినిమాతో ఒక్కసారిగా స్టార్ గా మారింది. మలయాళంలోనే కాదు తెలుగులో కూడా ప్రేమలు భారీ విజయాన్ని అందుకుంది. ఇక తెలుగు కుర్రాళ్లకు అయితే క్యూట్ మమితా తెగ నచ్చేసింది. అప్పట్లో ఈ చిన్నదాన్ని క్రష్ లిస్ట్ లో కూడా యాడ్ చేశారు కూడా.


ఇక ఈ సినిమా తరువాత మమితా పంట పండింది. మలయాళంలో వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా మారింది. తెలుగులో కూడా అమ్మడు స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ లు అందుకుంటుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు తెలుగులో మమితా అధికారికంగా ఒక్క ప్రాజెక్ట్ ను కూడా ఓకే చేయకపోవడంతో ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ఇక తెలుగు గురించి పక్కన పెడితే ఈ ప్రేమలో బ్యూటీ తమిళ్ లో పెద్ద జాక్ పాట్ నే కొట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి.

దళపతి విజయ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. సినిమాలకు గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లో చేరడానికి విజయ్ సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే. ఇక దీంతో విజయ్ కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేస్తున్నాడు. ఇప్పటికే వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గోట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇది కాకుండా విజయ్ చివరి సినిమాగా దళపతి 69 తెరకెకెక్కుతుంది. హెచ్. వినోత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.


ఇప్పటికే ఈ చిత్రంలో విజయ్ సరసన సమంత నటిస్తుందని వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా ఈ చిత్రంలో మమితా కూడా నటిస్తుందని టాక్ నడుస్తోంది. ఇందులో విజయ్ చెల్లెలి పాత్ర కోసం మమితాను సెలెక్ట్ చేశారని సమాచార. చెల్లి పాత్ర అని తీసిపారేయడానికి కూడా లేదు. అన్నాచెల్లెలి సెంటిమెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని టాక్. దీంతో మమితా మంచి లక్కీ ఛాన్స్ నే పట్టిందని చెప్పాలి. ఇదే కనుక నిజమైతే అమ్మడు కోలీవుడ్ ఎంట్రీ ఘనంగా జరిగినట్టే. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×