Dominic And The Ladies Purse : ఇటీవల కాలంలో పైరసీ భూతం కొత్త సినిమాలను పట్టి పీడిస్తోంది. సినిమాలు ఇలా థియేటర్లలోకి వస్తున్నాయో లేదో అలా లీక్ అవుతూ, నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. చిన్న సినిమాల నుంచి పాన్ ఇండియా సినిమాలు, ఓటీటీ సినిమాలు ఇలా ఒక్క మూవీని కూడా వదలట్లేదు లీకు రాయుళ్ళు. తాజాగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ (Dominic And The Ladies Purse) అనే కొత్త సినిమా HD వెర్షన్ లీక్ అవ్వడం ఆందోళనకరంగా మారింది.
‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ HD ప్రింట్ లీక్
మమ్ముట్టి ప్రధాన పాత్రను పోషించిన లేటెస్ట్ మలయాళ మూవీ ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ (Dominic And The Ladies Purse). జనవరి 23న ఈ థ్రిల్లర్ మూవీ థియేటర్లలోకి వచ్చింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన గంటల వ్యవధిలోనే పలు పైరసీ వెబ్‌సైట్లలో లీక్ అయింది.
‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ చిత్రం ఇప్పుడు 123మూవీస్, రెడ్డిట్ వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. అంతేకాదు Filmyzilla వంటి ఇతర లీక్ సైట్లలో ఈ మూవీ HD, 1080p, 720p, 480pతో రిజల్యూషన్‌లలో డౌన్‌లోడ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. మరి ఈ లీక్ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ (Dominic And The Ladies Purse) చిత్రానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. నీరజ్ రాజన్ కథను రూపొందించగా, మమ్ముట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. మమ్ముట్టి నిర్మాతగా, హీరోగా చేసిన ఈ చిత్రంలో గోకుల్ సురేష్, సుస్మిత భట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దర్బుక శివ సంగీతం సమకుర్చారు.
రీసెంట్ గా లీక్ అయిన సినిమాలు
ఇటీవల పలు సౌత్ ఇండియన్ సినిమాలు పైరసీ బారిన పడ్డాయి. భాషతో, బడ్జెట్ తో సంబంధం లేకుండా… పుష్ప 2, గేమ్ ఛేంజర్, రేఖచిత్రం, ప్రవింకూడు షాప్పు, కాదలిక్క నేరమిళ్లై, సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ విడుదలైన వారంలోనే స్థానిక టీవీ ఛానెల్‌లో ప్రసారం కావడం కలకలం సృష్టించింది. అయితే విచారణ అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
ఈ విషయంపై ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) నిర్మాత స్పందిస్తూ “4-5 రోజుల క్రితం విడుదలైన చిత్రం స్థానిక కేబుల్ ఛానెల్‌లు, బస్సులలో ప్రసారం కావడం తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తుంది. సినిమా కేవలం హీరో, దర్శకుడు లేదా నిర్మాతలకు మాత్రమే సంబంధించినది కాదు. ఇది 3-4 సంవత్సరాల కృషి, అంకితభావం, వేలాది మంది కలల ఫలితం” అంటూ ఆవేదనని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ పైరసీ భూతానికి నిర్మాతలు ఎలా చెక్ పెడతారో ?