Kannappa : ప్రస్తుతం వార్తల్లో ఎక్కడ చూసిన కూడా ఒక్కటే మాట వినిపిస్తుంది. తారా స్థాయికి చేరుకున్న మంచు ఫ్యామిలీ గొడవలు.. ఆస్తుల పంపకాల విషయంలో వీధికెక్కిన మంచు వారసులు.. మంచు ఫ్యామిలీ ఇష్యు కాస్త ఇటు సోషల్ మీడియాలోను, అటు మీడియాలోను, అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ లను హాట్ టాపిక్ గా మారింది. ఆస్తులు కోసం అంతగా గొడవపడాలని జనాల నుంచి ప్రశ్నలు మొదలయ్యాయి. గత మూడు రోజుల నుంచి మంచు వివాదం కాస్త ముదురుతుంది. వీళ్ళు గొడవల మధ్య పోలీసులు ఏం చేయలేమని చేతులెత్తేశారు. ఇక ఇద్దరినీ రాజీకి తీసుకురావాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.. ఈ క్రమంలో ఈరోజు ఉదయం మంచు విష్ణును మంచు, మనోజ్ ను సిపి కార్యాలయానికి రావాలని నోటీసులు జారీ చేశారు. ఈ వివాదం కాస్త సినిమాలపై ఎఫెక్ట్ పడినట్టు తెలుస్తుంది. తాజాగా మంచు విష్ణు నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప పోస్టుపోన్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
మంచు ఫ్యామిలీ ఆస్తి వివాదం..
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మంచు విష్ణు ఫ్యామిలీ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తండ్రి కొడుకులు, మంచు మోహన్ బాబు, మనోజ్ ల మధ్య ఆస్తి వివాదం నెలకొనగా, ఇరువురిపై కేసులు పెట్టేదాకా వెళ్ళింది వివాదం.. ఇద్దరు ఒకరిపై మరొకరు మాటల దాడి చేసుకోవడం మాత్రమే కాదు. కేసులు కూడా పెట్టుకున్నారు. తన తండ్రి వల్ల తన కుటుంబానికి హాని కలుగుతుందని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కొడుకు మంచు మనోజ్ వల్ల తనకు ప్రాణహాని ఉందని తన ఆస్తులకు హాని కలుగుతుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు మంచు మోహన్ బాబు.. ఆదివారం నుంచి ఈ గొడవ జరుగుతూనే ఉంది. మంచు విష్ణు, మంచు మనోజ్ ఇద్దరూ పర్సనల్గా బాడీగార్డ్లను కూడా పెట్టుకున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం జల్పల్లి లోని మోహన్ బాబు ఇంట్లో ఈ వివాదంపై రాజీ కుదిర్చే ప్రయత్నం జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు మంచు విష్ణు ఫ్యూచర్లో దుబాయ్ లో సెటిల్ కాబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
మంచు వివాదం కన్నప్ప పై ఎఫెక్ట్..
మంచు విష్ణు ప్రస్తుతం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ షూటింగ్లో భాగంగా విదేశాల్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో కొంచెం తేడా కొట్టిన కూడా సినిమా మొదటికే మోసం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాను జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ బిజినెస్ పరంగా అయిన సక్సెస్ పరంగా అయిన కూడా మంచు విష్ణు సూపర్ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమాలో భారీ కాస్టింగ్ ఉన్న నేపధ్యంలో సినిమా మీద భారీ హైప్ ను క్రియేట్ చేసుకుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాంతో సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. సినిమా రిలీజ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ వాయిదా పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మంచు ఫ్యామిలీలో మొదలైన గొడవల కారణంగా అవి సర్దుమణిగిన తర్వాతే సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. అంటే వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ అవ్వొచ్చు అని ఓ వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తుంది. దీనిపై మంచు విష్ణు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.