Manchu Family Issue : మంచు కుటుంబం (Manchu Family) లో గొడవలు రోడ్డుకెక్కడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మంచు కుటుంబ సభ్యులు గొడవ పడుతుండడంతో హీరోయిన్ సౌందర్య(Heroine Soundarya)పేరు ప్రథమంగా వినిపిస్తోంది. సౌందర్య ఆస్తి గురించి వీరు గొడవ పడుతున్నారంటూ కామెంట్లు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, అసలు మంచు వివాదానికి, సౌందర్య ఆస్తికి అసలు సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలు అభిమానులలో కూడా తలెత్తుతున్నాయి.
సౌందర్య ఇంటి కోసమే అసలు గొడవ..
నాలుగు గోడల మధ్య సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన సమస్య ఇప్పుడు నలుగురిలోకి రావడంతో మంచు ఫ్యామిలీకి ఉన్న పరువు కాస్త పోయింది. అసలు వీరి గొడవ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియడం లేదు. దీనికి తోడు మోహన్ బాబు (Mohan Babu) కోపంలో మీడియా ప్రతినిధిని గాయపరచడంతో ఇది మరింత వివాదంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు మోహన్ బాబు పై మండిపడుతున్నాయి. అటు మీడియా ప్రతినిధి అయ్యప్పమాలలో ఉండడంతో అయ్యప్ప భక్తులు కూడా మోహన్ బాబుని శిక్షించాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఇలా మొత్తానికైతే ఈ వివాదం కాస్త చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలోనే సౌందర్య ఇంటివల్లే వీరు గొడవ పడుతున్నారు అంటూ వార్తలు రాగా అసలు 20 ఏళ్ల క్రితం మరణించిన సౌందర్యకు, ఈ వివాదానికి సంబంధం ఏమిటి? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..
సౌందర్య మరణం తర్వాత ఆ స్థలాన్ని కొనుగోలు చేసిన మోహన్ బాబు..
అసలు విషయంలోకి వెళ్తే.. హైదరాబాదులోని శంషాబాద్ శివారు ప్రాంతంలో వున్న జల్ పల్లిలో భారీ బంగ్లాలో మోహన్ బాబు తన భార్య నిర్మలాదేవితో కలిసి ఉంటున్నారు. ఇప్పుడు మనోజ్ ఫ్యామిలీ అంతా కూడా అక్కడే ఉంటోంది. అయితే ఈ బంగ్లా కట్టిన ప్లేస్ మాత్రం హీరోయిన్ సౌందర్య దని, ఆమె మరణం తర్వాత అతి తక్కువ ధరకే మోహన్ బాబు వారి ఫ్యామిలీ నుండి ఈ స్థలాన్ని కొనుగోలు చేశారని సమాచారం. సౌందర్య హీరోయిన్గా బిజీగా ఉన్న సమయంలోనే ఎంతో సంపాదించింది. ఆ సంపాదనతోనే ఇక్కడ ఉన్న భూమి కొనుగోలు చేసింది. ఇక్కడ బంగ్లా కూడా కట్టింది అని, కానీ దానిని మోహన్ బాబు ఇంకా పెద్దదిగా కట్టించారని కొంతమంది చెబుతున్నారు.
అంతేకాదు ప్రస్తుతం ఈ ఆస్తి విలువ రూ.100 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. మరి ఇందులో ఎంత నిజాలు ఉన్నాయో తెలియదు కానీ ఇప్పుడు ఈ బంగ్లా కోసమే మంచు మోహన్ బాబు కొడుకులు గొడవ పడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఇంకొంతమంది ఈ స్థలం మోహన్ బాబు సౌందర్య ఫ్యామిలీ నుంచి లాక్కున్నారు అని కామెంట్లు చేసే వారు కూడా లేకపోలేదు మరి అసలు వాస్తవం ఏంటి అనేది వారికే తెలియాలి.
రహస్యాలు బయట పెడతానన్నా మనోజ్..
ఇక మంచు కుటుంబంలో గొడవలు విషయానికొస్తే.. ఈ అతిపెద్ద విలాసవంతమైన బంగ్లా చుట్టూనే ఈ వివాదం కాస్త రాజుకుంది అని సమాచారం. ఆస్తుల పంపకాలు జరిగితే ఈ ప్లేస్ తో పాటు బంగ్లా కూడా తనకే కావాలని మనోజ్ అంటున్నారట. రెండో పెళ్లి అందులోనూ మౌనిక అంటే నచ్చని మోహన్ బాబు, విష్ణు మనోజ్ కి ఈ బంగ్లాని ఇవ్వడానికి నిరాకరించినట్లు సమాచారం. దీనికి తోడు మౌనిక (Mounika) మొదటి భర్త సంతానమైన అబ్బాయి కూడా మనోజ్ తోనే ఉండడంతో మంచు ఫ్యామిలీకి ఇక అస్సలు ఇష్టం లేదని తెలుస్తోంది. అందుకే మనోజ్ ని వీరు దూరం పెడుతున్నారట. దీనికి తోడు విష్ణు దుబాయ్ వ్యాపారాలకు, మంచు వారి విద్యాసంస్థలకు సంబంధించి రహస్యాలను మనోజ్ బయట పెడతానన్నట్లు ప్రచారం జరిగింది. ఇలా సౌందర్య ఇంటి కోసం ఈ మంచు ఫ్యామిలీలో గొడవలు రోడ్డుకి ఎక్కాయి. మరి దీనిని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.