Keerthy Suresh : టాలీవుడ్ లో ‘మహానటి’గా మెప్పించిన హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) మరికొన్ని గంటల్లో తన ప్రియుడు ఆంటోని (Antony Thattil)తో మూడు ముళ్ళ బంధంలోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పెళ్లి కోసం కీర్తి సురేష్ అంబానీలు పాటించిన రూల్ ను ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ జంట పెళ్ళికి వెళ్లాలంటే చేతులకి ఆ బ్యాండ్ ఉండి తీరాల్సిందేననే వార్త, దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
డిసెంబర్ 12న అంటే ఈరోజు కీర్తి సురేష్ (Keerthy Suresh) పెళ్లి ఆమె ప్రియుడు ఆంటోని తట్టిల్ తో అంగరంగ వైభవంగా జరగబోతోంది. గోవాలోని ఒక ప్రముఖ రీసార్ట్ లో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు గోవాకి చేరుకొని, పెళ్లి ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. అయితే ఇందులో భాగంగా తమ పెళ్ళికి వచ్చే అతిధులు అందరికీ ‘KA’ అని రాసి ఉన్న ప్రత్యేకమైన హ్యాండ్ బ్యాండ్స్ ను ఇచ్చారట. వాటిని వేసుకున్న వాళ్లకు మాత్రమే పెళ్లిలో ఎంట్రీ ఇవ్వడానికి అనుమతి ఉంటుందని తెలుస్తోంది.
గతంలో అంబానీ తనయుడు అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ ల పెళ్లిలో కూడా ఇలాంటి రూల్ నే పాటించారు. సెలబ్రిటీలకు వాళ్ళ స్టేటస్ ని బట్టి ఒక్కో కలర్ బ్యాండ్ ని ఇచ్చారు. ఆ బ్యాండ్ లను బట్టి సెక్యూరిటీ వాళ్ళ ఎంట్రీ, ఎక్కడ కూర్చోవాలి అనే విషయాలను అతిథులకు తెలియజేశారు. పైగా అప్పుడు ఆ బ్యాండ్ లు సెక్యూరిటీలో భాగం అని కూడా అన్నారు. ఇక ఇప్పుడు కీర్తి సురేష్ కూడా ఇదే రూల్ ని పాటించడం తో ఆ బ్యాండ్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అలాగే అతిథులు ఉండే గదిలో వాళ్లకి బోర్ కొట్టకుండా ఉండడానికి ‘వెల్కమ్ టు ది వెడ్డింగ్ మ్యాడ్నెస్’ అనే మ్యాగజైన్ ని పెట్టారట. ఇందులో కీర్తి సురేష్ తో పాటు ఆమెకు కాబోయే భర్త ఆంటోనీకి సంబంధించిన స్టోరీ ఉండబోతుందని తెలుస్తోంది. అలాగే ఈ మ్యాగజైన్లో కీర్తి సురేష్ – ఆంటోనీల ఫోటోలు కూడా ఉన్నాయి అని అంటున్నారు.
ఇక ‘వెడ్డింగ్ వర్డ్ సెర్చ్’ అనే పత్రికలో కీర్తి సురేష్ (Keerthy Suresh) – ఆంటోనీ (Antony Thattil) ఇష్టాయిష్టాలు, వీరి పెళ్లికి సంబంధించిన విశేషాలను కనుక్కునేలా కొన్ని హింట్స్ ఇచ్చారట. గెస్ట్ లు ను హింట్స్ ను బట్టి వాటిని కనిపెట్టేలా ప్లాన్ చేశారట. ఇక ఈరోజు కీర్తి సురేష్ హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో రెండుసార్లు పెళ్లి చేసుకోబోతోంది. ఉదయాన్నే హిందూ సంప్రదాయంలో, సాయంత్రం క్రిస్టియన్ చేసుకోబోతోంది. కాగా కేరళలోని కొచ్చి ఆంటోనీ సొంత ఊరు. దుబాయ్ లో ఆంటోనీకి చాలా బిజినెస్ లు ఉన్నట్టుగా తెలుస్తోంది. కీర్తి సురేష్ – ఆంటోనీలు ఇద్దరూ స్కూల్లో చదివే టైం నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు ఏడడుగులు వేయబోతోంది.