Mohan Babu:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ గా మారిపోయిన అంశం మంచు ఫ్యామిలీలో గొడవలు. గత రెండు రోజులుగా గొడవలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం జల్పల్లిలో మోహన్ బాబు(Mohan Babu) ఇంటి దగ్గర తండ్రీ కొడుకుల మధ్య వివాదం జరిగింది. ముఖ్యంగా మంచు విష్ణు(Manchu Vishnu)40 మంది బౌన్సర్లను దింపగా, మనోజ్ 30 మంది బౌన్సర్లను దింపారు. ఈ క్రమంలోనే మనోజ్ బౌన్సర్లను పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఇక పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అధికారులను కలిసి మనోజ్ ఇంటికి వచ్చిన సమయంలో మోహన్ బాబు ఇంటి సెక్యూరిటీ ఆయనను లోపలకు అనుమతించలేదు. అక్కడ ఘర్షణ చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా తండ్రీ కొడుకుల మధ్య జరిగిన వివాదంలో మోహన్ బాబు తన లైసెన్స్డ్ గన్ బయటకు తీయడంతో పహాడీ షరీఫ్ పోలీసులు ఆయన గన్ లైసెన్స్ ను రద్దు చేసి సీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే రాచకొండ పోలీసులు ఈరోజు ఉదయం 10:30 గంటలకు విచారణకు హాజరు కావాల్సి ఉందని కోరగా మోహన్ బాబు అనారోగ్య సమస్యల వల్ల వెళ్లలేక పోయారు.
హైకోర్టులో మోహన్ బాబుకు ఊరట..
ఈ నేపథ్యంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందున విచారణకు సమయం కావాలని మోహన్ బాబు విజ్ఞప్తితో పిటిషన్ వేయగా.. ఆయన విజ్ఞప్తిని కోర్టు ఏకీభవించింది. ఇప్పుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. పోలీసుల ముందు విచారణకు మినహాయింపు ఇస్తూ న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో మోహన్ బాబుకు కాస్త ఊరాట కలిగింది అని చెప్పవచ్చు. ఇకపోతే తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
హైబీపీతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మోహన్ బాబు..
రెండు రోజుల క్రితం మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మోహన్ బాబుకు చెందిన పదిమంది అనుచరులు మంచు మనోజ్ పై దాడి చేయడంతో ఆయన గాయాల పాలయ్యారు. దీంతో ఇద్దరు కూడా ఒకరి నుంచి మరొకరికి ప్రాణహాని ఉందంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఇక ఆ మరుసటి రోజు మంచు విష్ణు వ్యాపార భాగస్వామి అయిన విజయ్.. మనోజ్ భార్య బిడ్డపై దాడి చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మనోజ్ తన భార్య బిడ్డలను కాపాడుకోవడానికి, తన కుటుంబం నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ భార్యతో వెళ్లి.. డీజీపీ, డీజీలను కలిశారు. ఇక తర్వాత ఇంటికి రాగా మనోజ్ దంపతులను మోహన్ బాబు సెక్యూరిటీ లోపలికి అనుమతించలేదు. లోపల 7 నెలల పాప ఉందని, కొడుకు ఉన్నాడని, వారిని కలవాలని మంచు మనోజ్ మొరపెట్టుకున్నా.. సిబ్బంది వినకపోవడంతో మనోజ్ గేట్లను బద్దలు కొట్టి లోపలికి వెళ్ళిపోయారు. ఇక ఆ సమయంలో మోహన్ బాబు మీడియా దగ్గరికి రాగా మోహన్ బాబు గారు ఏం జరిగిందో చెప్పండి అని మీడియా అడుగుతుండగానే కోపంతో ఊగిపోయిన మోహన్ బాబు.. వారి దగ్గర ఉన్న మైకు తీసుకొని వారి బుర్రలు పగలగొట్టారు. అనంతరం హై బీపీ తో స్పృహ తప్పి పడిపోయారు. ఇక అక్కడే దగ్గరలో ఉన్న కాంటినెంటల్ హాస్పిటల్ లో చేర్పించారు మంచు విష్ణు.. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు మోహన్ బాబు.