BigTV English

Venkatesh: పుష్ప 2 పై వెంకటేష్ రివ్యూ.. అదిరిపోయిందంతే

Venkatesh: పుష్ప 2 పై వెంకటేష్ రివ్యూ.. అదిరిపోయిందంతే

Venkatesh: విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ హీరోగా ఆయనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇంకా  చెప్పాలంటే ఇండస్ట్రీలో ఇప్పటివరకు విమర్శలు లేని హీరో అంటే వెంకీ మామనే అని చెప్పాలి. సినిమా, ఫ్యామిలీ, క్రికెట్   ఇవి తప్ప వెంకీమామకు ఏమి తెలియదు. చాలా రేర్ గా పార్టీస్ లో కనిపిస్తూ ఉంటాడు.


ఇక సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువగా కనిపిస్తాడు.   ఒకప్పుడు ఫేస్ బుక్ లో రోజు ఒక కొటేషన్ పెడుతూ వచ్చేవాడు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో గుడ్ మార్నింగ్ కొటేషన్స్ తో తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు.  ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన వెంకీ మామ.. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమతో బిజీగా ఉన్నాడు.

Manchu Family Issue: పీస్ కోసం మంచు లక్ష్మి కష్టాలు.. ఇన్‌స్టాలో పోస్ట్ వైరల్


అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. సినిమాల విషయం పక్కన పెడితే.. వెంకీ మామ చాలా రేర్ గా  కొత్త సినిమాలను చూసి రివ్యూలు ఇస్తూ ఉంటాడు.  తాజాగా  పుష్ప 2 ను వీక్షించిన వెంకటేష్.. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

” అల్లు అర్జున్ అద్భుతమైన, మర్చిపోలేని నటన. స్క్రీన్ మీద నీ నటనను చూసి కళ్లు తిప్పుకోలేకపోయాను. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సినిమాను జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రష్మిక మీరు ఫినామినల్. పుష్ప 2 ఇంత ఘన విజయం అందుకున్నందుకు చిత్రబృందానికి, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కు, డైరెక్టర్ సుకుమార్ కు  శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అస్సలు తగ్గేదేలే” అంటూ  రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Rashi Singh: కొంటెచూపుతో కుర్రకారు మనసు దోచేస్తున్న రాశి సింగ్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2  డిసెంబర్  5 న రిలీజ్ అయ్యి  మంచి విజయాన్ని అందుకుంది.  పుష్ప గా అల్లు అర్జున్ నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పాలి. మొదట మిక్స్డ్  టాక్ ను అందుకున్నా బన్నీ నటన చూసి ఫ్యాన్స్ సినిమాకు క్యూ కట్టారు. 5 రోజుల్లో ఈ సినిమా రూ. 900 కోట్లు రాబట్టి రికార్డులు తిరగరాసింది.

కేవలం తెలుగులోనే కాదు హిందీలో కూడా పుష్ప తన సత్తా చాటింది.  అందుతున్న సమాచారం ప్రకారం .. మరో రెండు రోజుల్లో పుష్ప 2 రూ. వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుంది. బన్నీ కెరీర్ లోనే  బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా పుష్ప 2 రికార్డ్ క్రియేట్ చేసింది. మరి ముందు ముందు ఈ సినిమాఇంకెన్ని  రికార్డులు సృష్టిస్తుందో  చూడాలి. 

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×