BigTV English

Manchu Family Issue: మోహన్ బాబు కడుపున మనోజ్ చెడపుట్టాడు.. నటుడి కామెంట్స్

Manchu Family Issue: మోహన్ బాబు కడుపున మనోజ్ చెడపుట్టాడు.. నటుడి కామెంట్స్

Manchu Family Issue: మంచు ఫ్యామిలీ సమస్య ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది. వారి ఇంట్లో జరిగిన గొడవ బయటికి రావడంతో ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఆ కుటుంబంలో ఏం జరిగింది, దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి అని ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నారు. ఈ విషయం ఇంత వైరల్ అవ్వడంతో ఇండస్ట్రీలోని పలువురు కూడా దీనిపై స్పందించక తప్పలేదు. ఇప్పటికే ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఈ వివాదంపై తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా నటుడు చిట్టిబాబు కూడా హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పాల్గొని ఈ విషయంలో మనోజ్‌దే తప్పుగా అన్నట్టుగా మోహన్ బాబును సపోర్ట్ చేస్తూ మాట్లాడారు.


ప్రెస్ తప్పు లేదు

‘‘ఒక దారితప్పిన, తప్పు మార్గంలో వెళ్తున్న బిడ్డను సరైన మార్గంలో తెచ్చుకోవడానికి తండ్రి చేసే ప్రయత్నమే ఇది. దానికోసం ఏ తండ్రి అయినా తపన పడతాడు, ఆలోచిస్తాడు. అలా మోహన్ బాబు కూడా సామ దాన భేద దండోపాయాల్లో అన్ని రకాలుగా ప్రయత్నించాడు. అయినా బిడ్డ దారికి రాకపోయేసరికి గట్టిగా మందలించాల్సి వచ్చింది. ఆ విషయంలో నాలుగు గోడల మధ్య కాకుండా బహిర్గతంగా జరిగితే ప్రెస్ ఎంటర్ అవుతారు. దానికి మిమ్మల్ని తప్పుపట్టడం లేదు. కానీ కొందరు మాత్రం అనాలోచితంగా, విషయాలు తెలియకుండా రాసేస్తున్నారు. మనోజ్ తాండూరు నుండి రౌడీలను పిలిపించి విష్ణు ఇంటిపై దాడికి ప్రయత్నిస్తున్నాడంటే ఎంత దారుణమైన విషయం’’ అంటూ మనోజ్‌ను తిట్టారు చిట్టిబాబు.


Also Read: పీస్ కోసం మంచు లక్ష్మి కష్టాలు.. ఇన్‌స్టాలో పోస్ట్ వైరల్

అలాంటి వ్యక్తి కాదు

‘‘తాండూరు నుండి మనోజ్ రౌడీలను పిలిపిస్తే విష్ణు, మోహన్ బాబు (Mohan Babu) తెప్పించలేరా? ఆ దిశగా మనోజ్ వెళ్లడమే దారుణం. మోహన్ బాబు మైక్ లాక్కున్నాడని కూడా అంటున్నారు. మీడియాకు ఎంత స్వాతంత్ర్యం ఉన్నా, కలం, దళం ఎంత గట్టిగా ఉన్న అర్థరాత్రి పర్మిషన్ లేకుండా వచ్చేసి మొహం మీద మైక్ పెట్టి అడ్డదిడ్డమైన ప్రశ్నలు అడిగితే మనిషికి కోపం రాదా? అందుకే మైక్ లాగేశాడు. దానికే మీడియాపై విరుచుకుపడ్డారని అంటున్నారు. ఆయనది అలాంటి వ్యక్తి కాదు. చీకటిలో ఒక వ్యక్తి మొహం మీద మైక్ పెట్టేసరికి చిరాకు వచ్చి లాగాడు. కళ్లకు పొడుచుకునేలా మైక్ పెట్టేసరికి తీసుకొని విసిరేశాడు’’ అని మోహన్ బాబు ప్రవర్తనను సమర్ధించారు చిట్టిబాబు.

కుటుంబ సమస్యలు సహజం

‘‘తాండూరు నుండి రౌడీలను పిలిపిస్తున్నాడంటే ఆ పిల్లోడు ఎంత చెడిపోయాడు? పచ్చిగా చెప్పాలంటే.. తండ్రి కడుపున చెడపుట్టిన బిడ్డ అనాలా, దారితప్పిన బిడ్డా అనాలా, విజ్ఞానం నశించిన బిడ్డ అనాలా, సంస్కారం కోల్పోయిన బిడ్డ అనాలా.. ఎలాంటి బిడ్డ అనాలి? ఆస్తుల విషయంలో గొడవలు పడుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇది సాధారణం. దానిని పెద్ద వివాదం చేసి రౌడీలను పిలిపించడం దుర్మార్గం. దయజేసి అందరూ ఈ విషయాలు తెలుసుకొని రాయండి. మోహన్ బాబు ఆరోగ్యంగానే ఉన్నాడు. తాండూరు రౌడీల విషయం చెప్పడానికే ప్రెస్ ముందుకు వచ్చాను’’ అని తెలిపారు చిట్టిబాబు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×