Mohan Babu Health Condition : మంచు ఫ్యామిలీ వివాదం నిమిషానికో మలుపు తిరుగుతోంది. జల్పల్లి నివాసం వద్ద మనోజ్ తో జరిగిన ఘర్షణ నేపథ్యంలో మోహన్ బాబు తలకు గాయమైంది అంటూ హాస్పిటల్ లో జాయిన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా డాక్టర్లు మోహన్ బాబు (Mohan Babu) హెల్త్ బులిటెన్ ను రిలీజ్ చేశారు.
ఆ హెల్త్ బులిటెన్ ప్రకారం “మోహన్ బాబు మానసిక వేదనలో ఉన్నారు. యాంగ్జైటి ఎక్కువైంది. అసలేం జరుగుతుందో అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నిన్న రాత్రి మోహన్ బాబుని పరీక్షించే టైంకి లెఫ్ట్ కంటి కింద బాగా కమిలినట్టుగా గాయాలు ఉన్నాయి. ఎక్స్టర్నల్ ఇంజురీస్ ఏమీ లేవు. కానీ కంటి దగ్గర మాత్రం గాయమైంది. నిన్న రాత్రి మొత్తం ఆయన జనరల్ కండిషన్ ని స్టెబిలైజ్ చేశాము. ఈరోజు ఫేస్ సీటీ స్కాన్ తీయబోతున్నాము. అక్కడ ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా? అనేది తెలుసుకోబోతున్నాము. దాని తర్వాత వచ్చే రిపోర్ట్ లను బట్టి ఏం చేయాలో డిసైడ్ అవుతాము. ఆయన నిన్న రాత్రి హాస్పిటల్ లో చేరే సమయానికి బీపీ చాలా ఎక్కువగా ఉంది. మోహన్ బాబుకు ఆల్రెడీ హైబీపీ ఉంది. ఈరోజు కూడా ఇంకా ఎక్కువగానే ఉంది. ఇప్పటికైతే టాబ్లెట్స్ ఇస్తున్నాము. మోహన్ బాబు (Mohan Babu) కు ఇప్పటికే చాలా ఆపరేషన్లు జరిగాయి. ఆయనకు మెడ, చెయ్యి, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి” అని చెప్పుకొచ్చారు డాక్టర్లు. అంతేకాకుండా ఆయన రెండ్రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని వెల్లడించారు. మొత్తానికి అసలు ఆయన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారు మోహన్ బాబు అంటూ డాక్టర్లు తేల్చి చెప్పారు.
కానీ మరోవైపు మంచు మనోజ్(Manchu Manoj) తనకు తండ్రి అంటే ప్రాణం అని, ఆయన ఇంతకుముందులా లేరంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. పోలీసుల విచారణకు హాజరుతున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన మంచు మనోజ్ తనపై లేనిపోని నిందలు వేస్తున్నారని, ఇన్నాళ్లు భరించాను కానీ ఇప్పుడు భరించబోనని వెల్లడించారు. దీని అంతటికి కారణం మంచు విష్ణు, వినయ్ అని, భార్య వచ్చాక తను మారిపోయాను అనడం కరెక్ట్ కాదని వెల్లడించారు. అంతేకాకుండా సాయంత్రం 5 గంటలకు ప్రూఫ్ తో సహా అన్ని విషయాలను బయట పెడతానని మంచు మనోజ్ చెప్పడం సంచలనగా మారింది. మరోవైపు మోహన్ బాబు నిన్న రాత్రి జరిగిన వాగ్వాదం నేపథ్యంలో జర్నలిస్ట్ పై దాడి చేయడం తెలిసిందే. దీంతో పలు జర్నలిస్ట్ సంఘాలు మోహన్ బాబు సారీ చెప్పాలంటూ ధర్నాకు దిగాయి. మొత్తానికి ప్రస్తుతం టాలీవుడ్లో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. అంతేకాకుండా మంచు మనోజ్ జర్నలిస్ట్ సంఘాలకు సపోర్ట్ చేశారు. నిన్న తన సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారికి ఇలా జరగడం గురించి మాట్లాడుతూ క్షమాపణలు చెప్పారు మంచు మనోజ్. అంతేకాకుండా తన తండ్రి ముందే తనను కొట్టారని, తల్లిని తన దగ్గర రాకుండా దూరంగా ఉంచుతున్నారని, ఈ వివాదంలోకి తన భార్యతో పాటు ఏడు నెలల కూతుర్ని కూడా లాగుతున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. ఇక మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు మంచి ఫ్యామిలీ పై ఫైర్ అవుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.