Manchu Lakshmi: రెండు రోజులుగా ఫిలిం ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీలో గొడవలు ఉద్రిక్తతకు దారితీసాయి. ముఖ్యంగా అన్నదమ్ములు, తండ్రీ కొడుకుల మధ్య గొడవలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. గతంలో మంచు విష్ణు(Manchu Vishnu), మంచు మనోజ్(Manchu Manoj)మధ్య గొడవలు మొదలవడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకుంటున్న మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu)కొడుకు పై దాడి చేశారంటూ వస్తున్న వార్తలకు సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇందులో మోహన్ బాబు ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో తెలియదు కానీ.. దీనికి తోడు మోహన్ బాబు ప్రధాన అధికారి వినయ్(Vinay) మనోజ్ పై దాడి చేయడం, మనోజ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడంతో సోషల్ మీడియాలో కూడా ఈ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.
మనోజ్ పై దాడి.. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్..
మోహన్ బాబు విద్యానికేతన్ విద్యాసంస్థలలో కీలకంగా పని చేసే వినయ్ తన తండ్రి ఆదేశాల మేరకే తనపై దాడి చేశాడని, డయల్ 100 కి మంచు మనోజ్ ఫోన్ చేసినట్లు సమాచారం. దీనికి తోడు ఆయన తన భార్య మౌనిక రెడ్డి(Mounika Reddy)తో కలిసి హాస్పిటల్ కి రావడంతో.. ఈ విషయాలు కాస్తా గొడవల వార్తలకు మరింత బలం చేకూర్చాయి. నిన్నటి వరకు ఈ వార్త ఇలా ముగియగా ఇప్పుడు మరో వార్త తెరపైకి వచ్చింది. హాస్పిటల్ నుంచి హైదరాబాదులో ఉన్న జల్ పల్లిలో ఉన్న తన నివాసానికి చేరుకున్నారు. అయితే మరోవైపు మోహన్ బాబు ఇంటిదగ్గర మంచు విష్ణు(Manchu Vishnu)40 మంది బౌన్సర్లను ఏర్పాటు చేయగా, వీరికి పోటీగా మంచు మనోజ్ కూడా 30 మంది బౌన్సర్లను ఏర్పాటు చేశారని సమాచారం. అయితే మోహన్ బాబు ఇంటిలోకి ఆయన ఇంటి దగ్గర ఉన్న సెక్యూరిటీ.. మనోజ్ బౌన్సర్లను అనుమతించలేదని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
మనోజ్ ఇంటికి చేరుకున్న మంచు లక్ష్మీ..
ఇలాంటి సమయంలో మంచు విష్ణు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని, మరి కాసేపట్లో ఇండియాకు చేరుకొని గొడవల గురించి చర్చించబోతున్నారని, అందుకే ఆ సమయంలో గొడవ కూడా జరిగే అవకాశాలున్నట్లు వార్తలు రాగా.. మంచు మనోజ్ అక్క మంచు లక్ష్మీ (Manchu Lakshmi)హుటాహుటిన ముంబై నుంచి వీరి ఇంటికి చేరుకున్న విజువల్స్ కూడా మనం చూడవచ్చు. వాస్తవానికి మంచు మనోజ్ తన అక్క మంచు లక్ష్మితో అన్ని విషయాలు చర్చిస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమ్ముడిని ఈ గొడవల నుంచి కాస్త దూరంగా ఉంచాలని ప్రయత్నం చేసిందట మంచి లక్ష్మి. అందులో భాగంగానే తన తమ్ముడు ఇంటికి వచ్చి గొడవలు వద్దు అని, దయచేసి ఇక్కడితో ఆపేయాలని తమ్ముడితో చెప్పినట్లు వార్తలు వినిపించాయి. వెంటనే మంచు లక్ష్మీ కూడా వెనుతిరిగి వెళ్ళిపోయారు. మరి అక్క చెప్పిన మాటకు మంచు మనోజ్ వెనక్కి తగ్గుతారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరొకవైపు మంచు మనోజ్ చాలా సీరియస్ గా ఫోన్ మాట్లాడుతున్నట్లుగా కూడా ఆ వీడియోలో మనం చూడవచ్చు. అయితే మంచు మనోజ్ ఎవరితో మాట్లాడుతున్నారు.? ఈ గొడవ గురించే చర్చిస్తున్నారా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ విషయాలు కాస్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.