BigTV English

Pushpa 2 : హిందీలో ‘పుష్ప 2’ ర్యాంపేజ్… ఆ 7 రికార్డులను తిరగరాసిన పుష్ప రాజ్

Pushpa 2 : హిందీలో ‘పుష్ప 2’ ర్యాంపేజ్… ఆ 7 రికార్డులను తిరగరాసిన పుష్ప రాజ్

Pushpa 2 : అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2: ది రూల్’ రికార్డుల ఊచకోత కోస్తోంది. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే రూ.800 కోట్ల క్లబ్‌లో చేరింది. అయితే నిజానికి ఇది తెలుగు సినిమా. కానీ నార్త్ ఆడియన్స్ కు ‘పుష్ప 2’ (Pushpa 2) పూనకాలు తెప్పిస్తోంది. ఫలితంగా ఈ మూవీ హిందీ వెర్షన్ వరుసగా రికార్డులను తిరగరాస్తోంది. ఈ సీక్వెల్ ఒరిజినల్ హిందీ ఫిల్మ్స్ అయిన షారుఖ్ ఖాన్ ‘జవాన్’, ‘పఠాన్’, రణబీర్ కపూర్ ‘యానిమల్’, సన్నీ డియోల్ ‘గదర్ 2’ల రికార్డులను గల్లంతు చేసింది. ఒక్క హిందీలోనే అత్యంత వేగంగా రూ.300 కోట్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది.


‘పుష్ప 2: ది రూల్’ నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే అందులో హిందీ వెర్షన్ మాత్రమే ఇండియాలో రూ.300 కోట్లకు పైగా వసూలు చేసిందని తెలుస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో ఈ చిత్రం విడుదలైనప్పటి నుండి మొదలు పెట్టిన రికార్డుల ఊచకోత ఇంకా నడుస్తోంది. ఫస్ట్ వీకెండ్ లోనే ‘పుష్ప 2’ (Pushpa 2) 7 రికార్డులను బద్దలు కొట్టింది. మరి హిందీలో ‘పుష్ప 2’ బ్రేక్ చేసిన ఆ 7 బాక్సాఫీస్ రికార్డులు ఏంటో చూసేద్దాం పదండి.

హయ్యెస్ట్ ఓపెనింగ్ డే : ‘పుష్ప 2’ (Pushpa 2) హిందీ వెర్షన్ మొదటి రోజే భారతదేశంలో రూ. 72 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద అప్పటికే రూ.64 కోట్ల వసూళ్లను రాబట్టి, ఇండియాలోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా నిలిచిన షారుఖ్ ఖాన్ ‘జవాన్’ చిత్రాన్ని ‘పుష్ప 2’ (Pushpa 2) బీట్ చేసింది.


హయ్యెస్ట్ నాన్-హాలిడే ఓపెనింగ్ : ‘పుష్ప 2’ (Pushpa 2) డిసెంబర్ 5న అంటే గురువారం థియేటర్లలోకి వచ్చింది. సెలవు రోజుల్లో విడుదల కాకపోయినప్పటికీ ఈ సినిమా బెస్ట్ ఓపెనింగ్ ను రాబట్టి ఈ ప్రత్యేక మైలురాయిని సాధించింది.

హయ్యెస్ట్ నాన్-ఫెస్టివల్ ఓపెనింగ్ : ‘పుష్ప 2’ (Pushpa 2) డిసెంబర్ 5న విడుదల కావడానికి ముందు చాలాసార్లు వాయిదా పడింది. ఈ చిత్రం పండుగ సందర్భంగా విడుదల కాలేదు. అయినప్పటికీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టగలిగింది.

హయ్యెస్ట్ ఆల్-టైమ్ హై : డిసెంబర్ 8న అంటే ఆదివారం, ‘పుష్ప 2’ హిందీ వెర్షన్ ఇండియాలో ఏకంగా రూ. 86 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.

ఫాస్టెస్ట్ రూ. 250 కోట్లు వసూలు చేసిన చిత్రం : భారతదేశంలో అత్యంత వేగంగా రూ. 250 కోట్ల మార్కును అధిగమించిన చిత్రంగా ‘పుష్ప 2’ (Pushpa 2) నిలిచింది. డిసెంబర్ 8 ఆదివారం నాడు ఈ మైలురాయిని సాధించింది.

ఫాస్టెస్ట్ రూ. 300 కోట్ల సినిమా : ‘పుష్ప 2’ (Pushpa 2) డిసెంబర్ 9 న భారతదేశంలో రూ. 300 కోట్ల మార్క్ (నెట్)ను అతి వేగంగా దాటేసిన చిత్రంగా నిలిచింది. అంటే కేవలం రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ఈ అరుదైన రికార్డును క్రియేట్ చేయడం విశేషం.

హయ్యెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ : ‘పుష్ప 2’ (Pushpa 2) హిందీ వెర్షన్ నాలుగు రోజుల్లోనే రూ. 291 కోట్లు వసూలు చేసింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×