Manchu Lakshmi : తెలుగు చిత్రపరిశ్రమలో మంచు మోహన్ బాబు ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది.. విలక్షణ నటుడు గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ఆయన నటనకు ఎన్నో అవార్డులు దక్కాయి. ఆ కుటుంబం నుంచి ముగ్గురు వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో ఆయన ముద్దుల కూతురు మంచు లక్ష్మీ కూడా ఉన్నారు. మంచు వారసురాలు గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా తన టాలెంట్ తో ఒక్కో సినిమా చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. ఈమధ్య మంచు లక్ష్మీ పలు టీవీ ఛానెల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ వస్తుంది. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ తన లైఫ్ లో ముఖ్యమైన వ్యక్తి గురించి ఎన్నో విషయాలను పంచుకొని ఎమోషనల్ అయ్యింది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
నా లైఫ్ లో ఏడ్పించిన వ్యక్తి అతనే..
మంచు లక్ష్మీ గురించి, ఆమె చేసిన సినిమాలు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒక్క సినిమాలో ఒక్కో యాంగిల్ లో కనిపిస్తూ తనలోని నటనను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది.ఎన్నో అవార్డులను, రివార్డులను కూడా అందుకుంది. సినిమాలు మాత్రమే కాదు సామాజిక కార్యక్రమాలు కూడా చేయడంలో మంచు లక్ష్మి ముందు ఉంటుంది.. పలు చానల్స్ కి, యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ వస్తున్న మంచు లక్ష్మి తాజాగా తనకు ఎంతో ముఖ్యమైన వ్యక్తి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన లైఫ్ లో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అంటే దాసరి నారాయణరావు గారు.. మా నాన్న తర్వాత ఆ స్థానాన్ని నాకు ఆయన భర్తీ చేశారు. తన సొంత కూతురు లాగా నన్ను కూడా చూసుకోవడం, నేను ఆయనతో అలాగే ఉండడంతో మా ఇద్దరి మధ్య బాండింగ్ చాలా బలంగా మారింది. ఆయన చనిపోయిన తర్వాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేకపోయారు. ఆయనతో నాకంత అనుబంధం ఉంది అంటూ లైవ్ లోని మంచు లక్ష్మి ఏడ్చేశారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మంచు లక్ష్మీ సినిమాలు..
మంచు లక్ష్మి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి నుంచి ఇప్పటివరకు పలు సినిమాల్లో నటించింది.. హీరోయిన్ గా, నటిగా, సింగర్ గా, యాంకర్ గా ఇండస్ట్రీలో రాణించింది. ఈ మధ్య రేడియోలో కూడా ఆమె గొంతును వినిపిస్తుంది. ఫ్యామిలీలో ఈమధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.. మంచు మనోజ్ మోహన్ బాబు మధ్య పెద్ద వార్ నడుస్తుంది. అయితే తన కుటుంబంలో ఇలాంటి వివాదాలు జరుగుతున్న కూడా మంచు లక్ష్మి ఎక్కడ వాటి గురించి మాట్లాడలేదు.. ఇటీవల ఓ షోలో మంచు లక్ష్మి మాట్లాడుతూ..నా జీవితంలో ఒక ఇరిటేటింగ్ క్యారెక్టర్ మంచు మనోజ్ ది అంటూ నవ్వుతూ తన తమ్ముడితో ఉన్న బంధాన్ని సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ ఫైనల్ షో లో చెప్పింది. అయితే దీనికి సంబంధించిన ప్రోమోలో మంచు లక్ష్మి మాటలు వైరల్ గా నిలిచాయి. ఈమధ్య ముంబైకి మకాం మార్చిన మంచు లక్ష్మి అక్కడ సినిమాలు చేసేందుకు ఆసక్తి కనపరుస్తుంది. అలాగే సోషల్ మీడియాలో ఈమె గ్లామర డోసు పెంచుతూ ఫోటోలతో యువతని ఆకట్టుకుంటుంది. ఈమె పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతాయో చూస్తూనే ఉన్నాం.. ఇక సినిమాల విషయానికొస్తే ఓ భారీ ప్రాజెక్టులో నటించబోతుందంటూ వార్తలు. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..