Mumbai Tour: మహారాష్ట్ర రాజధాని ముంబై. దీనిని భారతదేశ వాణిజ్య రాజధాని అని కూడా పిలుస్తారు. ఇక్కడ అత్యంత ధనవంతులతో పాటు అత్యంత నిరుపేదలు కూడా నివసిస్తారు. అనేక పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కూడా ఇక్కడ ఉంటాయి. ఈ మాయా నగరాన్ని చూడటానికి దేశం నలుమూలల నుండి , విదేశాల నుండి టూరిస్టులు వస్తారు. ఈ నగరం ఎప్పుడూ నిద్రపోదు ఎందుకంటే ఇక్కడి మార్కెట్లు పగటిపూట లాగే రాత్రిపూట కూడా నడుస్తున్నట్లు అనిపిస్తుంది. బాలీవుడ్, మరాఠీ సినిమాలకు కేంద్రంగా ఉండటంతో..దీనిని భారతదేశ వినోద నగరం అని కూడా పిలుస్తారు. ముంబైని గతంలో బొంబాయి అని పిలిచేవారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ముంబైలో తప్పకుండా చూడాల్సిన 5 ప్రదేశాల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మెరైన్ డ్రైవ్ క్వీన్స్ నెక్లెస్:
ప్రపంచవ్యాప్తంగా క్వీన్స్ నెక్లెస్ గా పిలువబడే మెరైన్ డ్రైవ్, ముంబైలోని చాలా అందమైన ప్రదేశం. ఇక్కడి వచ్చి చాలా మంది సమయాన్ని గడపాలని కోరుకుంటారు. దక్షిణ ముంబైలోని అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న ఈ సి-ఆకారపు ప్రాంతం చాలా అందమైన ప్రదేశం. ఇక్కడ సూర్యాస్తమయం చాలా బాగుంటుంది. మీరు బీచ్‌లో నడుస్తూ.. బహిరంగ ప్రదేశాలను ఆస్వాదించాలనుకుంటే.. ఈ ప్రదేశం సరైనది. ఇక్కడికి వచ్చినప్పుడు, మనసుకు ఒక రకమైన ప్రశాంతత లభిస్తుంది. సముద్రంలో ఎగసిపడే అలలు కూడా మీకు ఏదో చెప్పాలనుకుంటున్నట్లుగా.. అస్తమించే సూర్యుడి నారింజ రంగుతో ఈ ప్రదేశం అందం మరింత పెరుగుతుంది.
గేట్‌వే ఆఫ్ ఇండియా:
జార్జ్ V , అతని భార్య కోసం నిర్మించిన ఈ గొప్ప ద్వారం ప్రత్యేక చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. బ్రిటిష్ పాలనలో.. దీనిని భారత్ నుండి ఇతర ప్రదేశాలకు వెళ్లడానికి, దేశంలోకి ప్రవేశించడానికి అభివృద్ధి చేశారు. నేటికీ ఈ అందమైన ద్వారం చూడటానికి నిత్యం వేల సంఖ్యలో జనం ఇక్కడికి వస్తారు. ముంబై వెళ్తే మాత్రం గేట్‌వే ఆఫ్ ఇండియాను తప్పక చూడాలి. ఈ ప్రదేశానికి వెళ్లడం ద్వారా మీరు చరిత్ర యొక్క భిన్నమైన సంస్కృతిని చూస్తారు.
కొలాబా కాజ్‌వే:
ఈ దేశానికి ముంబై ప్రాణం అయితే.. ముంబై గుండె కొలాబా కాజ్‌వేలో ఉంటుందని చెబుతారు. బ్రిటిష్ కాలంలో ఒక పెద్ద మార్కెట్‌గా నిర్మించబడిన ఈ ప్రాంతం ఇప్పటికీ ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్. మీరు ఇక్కడ ప్రతి తక్కవ ధరలకు షాపింగ్ చేయవచ్చు. ఎంత సేపు ఇక్కడ ఉన్న కూడా ఈ ప్లేస్ అస్సలు బోర్ కొట్టదు. మీరు ఇక్కడ ముంబై స్పెషల్ వడ పావ్ కూడా రుచి చూడవచ్చు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్:
ఒకప్పుడు విక్టోరియా టెర్మినల్ అని పిలువబడే ఈ అద్భుతమైన ప్రదేశం నేడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరుతో పిలువబడుతోంది. నిజానికి.. మూడు వేర్వేరు నిర్మాణ శైలులలో నిర్మించిన ఛత్రపతి శివాజీ టెర్మినస్ భవనం చాలా అందంగా ఉంటుంది. రాజభవనంలా కనిపించే ఈ ప్రదేశాన్ని ఒక్కసారైనా చూడాలి. మీరు దీనిని దగ్గరగా చూస్తే.. మీరు జీవితంలో ఎప్పటికీ దీనిని మరచిపోలేరు.
Also Read: నేచర్ లవర్స్‌కి బెస్ట్ ప్లేస్.. సమ్మర్‌లో వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు !
జుహు బీచ్:
ముంబైలోని అత్యంత హై-ఫై ప్రాంతాలలో జుహు బీచ్ కూడా ఒకటి. జుహులోని నీలిరంగు బీచ్ చాలా అందంగా ఉంటుంది. దీనిని జుహు చౌపట్టి అని కూడా పిలుస్తారు. ఇది ముంబైలోని అత్యంత ప్రత్యేకమైన, పొడవైన బీచ్. ఈ అద్భుతమైన సముద్ర తీరం, ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ చాలా ప్రత్యేక అనుభూతిని మీకు అందిస్తాయి. అంతే కాకుండా ఈ బీచ్ చాలా అద్భుతంగా ఉంటుంది. దాదాపు 6 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ బీచ్ లో సమయాన్ని గడపడానికి వివిధ ప్రదేశాల నుండి చాలా మంది ఇక్కడికి వస్తారు.