BigTV English

OTT Movie : బ్యాచిలర్ గా మారే భర్త… స్నేహితుడికి దగ్గరయ్యే భార్య

OTT Movie : బ్యాచిలర్ గా మారే భర్త… స్నేహితుడికి దగ్గరయ్యే భార్య

OTT Movie : జీవితం అనేది పెళ్లి తర్వాత, పెళ్లి ముందు అనే విధంగా తయ్యారయింది. పెళ్లికి ముందు జీవితం ఎలా ఉన్నా, పెళ్లి తర్వాత కాస్త బుర్ర వాడాలి. లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో పెళ్లి జరిగినా, శోభనం జరగదు దానికి కారణం స్టోరీలో తెలుసుకుందాం. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో

ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘మీనాక్షి సుందరేశ్వర్’ (Meenakshi sundareshwar). 2021లో విడుదలైన ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాకి వివేక్ సోని దర్శకత్వం వహించారు. ధర్మాటిక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సోమెన్ మెహతా ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాలో  సన్యా మల్హోత్రా, అభిమన్యు దాసాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2021 నవంబరు 5 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది.


స్టోరీ లోకి వెళితే

మీనాక్షి ఒక మంచి సంప్రదాయ కుటుంబంలో ఉంటుంది. అయితే ఆమెకు రజనీ కాంత్ అంటే చాలా ఇష్టం. ఆమెను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తారు. పెళ్లి కొడుకు సుందరేశ్వర్ బీటెక్ చదివి, ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటాడు. పెళ్లి చూపుల్లో మీనాక్షిని చూసి ఇష్టపడతాడు. మీనాక్షి కూడా సుందరేశ్వర్ ను ఇష్టపడుతుంది. అయితే పెళ్లి చూపులకు వేరే ఇంటికి వెళ్లబోయి మీనాక్షి ఇంటికి వస్తాడు సుందరేశ్వర్. పొరపాటు గ్రహించి మళ్ళీ వెళ్ళిపోతున్నా, మీనాక్షిని వదిలి వెళ్ళలేకపోతాడు. అయితే ఇద్దరి జంట బాగుండటంతో, పెద్దలు వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు. ఫస్ట్ నైట్ రోజు సుందరేశ్వర్ కి ఇంటర్వ్యూ ఉందని మెయిల్ వస్తుంది. మరుసటి రోజు ఇంటర్వ్యూ కావడంతో, భార్యతో గడపలేక పోతాడు. రాత్రి శోభనం చేసుకోకుండా, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతాడు.  అక్కడినుంచి సిటీకి వెళ్లి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాడు. బ్యాచిలర్గా ఉంటేనే అందులో జాబ్ వస్తుందని తెలియడంతో, అక్కడ ఉన్నవాళ్ళకి పెళ్లి కాలేదని చెప్పి జాబ్ చేస్తుంటాడు.

ఒక సంవత్సరం పాటు సుందరేశ్వర్ అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ విషయం మీనాక్షికి కూడా చెప్తాడు. ఆమె కూడా సరేనని ఒప్పుకుంటుంది. ఒక రోజు సుందరేశ్వర్ పుట్టిన రోజు కావడంతో, సర్ప్రైజ్ ఇవ్వాలని అతని దగ్గరకు వెళ్తుంది. అక్కడికి మీనాక్షి వెళ్ళాక సుందరేశ్వర్ కి పెళ్లి అయిందని తెలిసిపోతుంది. ఆ తరువాత ఇంటికి తిరిగి వస్తుంది. అయితే ఈమెకు ఒక స్నేహితుడు కూడా ఉంటాడు. భర్త లేకపోవడంతో అతనితో మీనాక్షి క్లోజ్ గానే ఉంటుంది. ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలిసి, ఆమెతో అనుమానం వచ్చే విధంగా మాట్లాడతారు. ఆమె బాధతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది. చివరికి మీనాక్షి భర్తతో కాపురం చేస్తుందా? ఫ్రెండ్ తో వెళ్ళిపోతుందా? ఈ విషయాలు తెలియాలంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘మీనాక్షి సుందరేశ్వర్’ (Meenakshi sundareshwar) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×