Intinti Ramayanam Today Episode December 12th : నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ ని చైర్మన్గా చేస్తున్నారని అవని, పల్లవిలు ఆఫీస్ కి వస్తారు. ఇక అందరి ముందు రాజేంద్రప్రసాద్ తన కొడుకుని వారసుడుగా చేసుకున్నానని తన కంపెనీలన్నీ తనే బాధ్యతగా చూసుకుంటాడని చెప్తాడు. పవర్ ఆఫ్ పట్టా ఆకులని అక్షయకి ఇస్తున్నానని రాజేంద్రప్రసాద్ చెప్తాడు. పల్లవి పోలీసులకు రాజేంద్రప్రసాద్ ఆఫీస్ లో మాదకద్రవ్యాలు ఉన్నాయని మెసేజ్ చేస్తుంది. రాజేంద్రప్రసాద్ తాను ఎంప్లాయిస్ కి రెండు గుడ్ న్యూస్ చెప్తానని చెప్పాడు. అక్షయ్ తన వారసుడుగా ప్రకటిస్తున్నట్టు బిజినెస్ లు అన్నిటికీ చైర్మన్గా తనని నియమిస్తున్నట్లు ప్రకటిస్తాడు.. అక్షయ్ నీ బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు సైన్ చేయమని చెప్తాడు. అప్పుడే అక్కడికి పోలీసులు ఎంట్రీ ఇస్తారు. కమల్ గదిలో ట్రక్స్ ప్యాకెట్స్ దొరకడంతో ఎస్సై సీఐకిస్తాడు. కమల్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇక పల్లవి చక్రధర్ కు ఫోన్ చేసి తిడుతుంది. కమల్ ను కాపాడటానికి అక్షయ్ ఆ తప్పు చేసింది నేనే నేను చాలా ఏళ్లుగా వాటిని వాడుతున్నాను చెప్తాడు. రాజేంద్రప్రసాద్ నమ్మడు. ఇక కమల్ వదిలిపెట్టి అక్షయ్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పార్వతీ భానుమతి కమల్ అరెస్టు అవడంపై టెన్షన్ పడుతూంటారు. ఇంకా కోమలి వినోదులు కూడా అమలుకు సిగరెట్ కాల్చడమే రాదు అలాంటిది మత్తు పదార్థాలు ఎలా వాడింటాడు అనేసి ఇద్దరు మాట్లాడుకుంటుంటారు.. అప్పుడే కమల్ రాజేంద్రప్రసాద్, అవని పల్లవిలు ఇంటికొస్తారు. కమల్ బయటికి రావడంతో సంతోషంగా ఉంటుంది.. కమ్మలు తప్పులేదని తెలుసుకొని ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడతారు. ఇక అక్షయ్ని పార్వతి అడుగుతుంది. అవని పార్వతి దగ్గరికి వెళ్లి మీ అబ్బాయిని పోలీసులు మత్తు పదార్థాల కేసులు అరెస్ట్ చేశారు అత్తయ్య అనగానే అందరు షాక్ అవుతారు. వాడి తప్పేం లేదమ్మా వాడి నిర్దోషి అని అనగానే అందరూ అదే అంటారు. పోలీసులు తప్పుంది అరెస్ట్ చేశారు త్వరలోనే తప్పు తెలుసుకుని వదిలేస్తారని అవని కూడా ధైర్యం చెబుతుంది. ఇక రాజేంద్రప్రసాద్ మన ఇంట్లో ఎవరో తెలిసిన వాళ్ళే అక్షయ్ అంటే పడని వల్లే ఇవన్నీ కావాలని ఇరికిస్తున్నారనేసి అంటాడు. ఒక అమ్మాయి మర్డర్ కేసులు ఇరిగించాలని చూశారు ఇప్పుడు మళ్లీ డ్రగ్ కేసులో ఇరికించాలని చూశారు అనేసి అంటాడు.
ఇక పల్లవి చక్రధర్ కు ఫోన్ చేసి ఏంటమ్మా అక్షయ్ అరెస్టు అయ్యారు కదా ఇంట్లో ఎలా ఉంది అనగానే మన విషయం బయటపడకుండా చూసుకోవాలి డాడ్ అనేసి అంటుంది. నువ్వేం భయపడకు మన విషయం బయటకు రాదు అనేసి అంటాడు. పార్వతి బాధపడుతూ ఉంటుంటే అవని ధైర్యం చెబుతుంది. ఇక పల్లవి అక్కడికి వెళ్లి అవునత్తయ్య అవని అక్క తలుచుకుంటే ఏమైనా చేస్తుందనేసి పల్లవి అంటుంది. అవునత్తయ్య అక్షయ్ నువ్వు కావాలని ఇరికించిన వాళ్ళు ఎవరో నేను తెలుసుకుంటాను అనేసి పల్లవి అంటుంది. ఈ కంగారు పడుతుంది. ఆరాధ్య నాన్న రాలేదు ఏంటమ్మా అనేసి అడుగుతుంది. ఆఫీస్ పని మీద వేరే చోటికి వెళ్లడమ్మా అయ్యాక వస్తాడు అనేసి అవని అంటుంది. అయితే నాన్నకు ఫోన్ చెయ్ అమ్మ ఒకసారి మాట్లాడాలి అనేసి ఆరాధ్య అవనీని అడుగుతుంది. నేను చాలా ముఖ్యమైన పని మీద ఉన్నాను నువ్వు నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయొద్దు అనేసి నాన్న చెప్పాడమ్మా రేపటికి వస్తాడులే అనేసి అబద్దం చెప్తుంది.
ఇక తర్వాత రోజు ఉదయం రాజేంద్రప్రసాద్ అవనీలు ఆఫీస్ కి వెళ్తారు. అక్కడ ఇక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను చెక్ చేస్తారు. మొన్నటి రికార్డు కనిపించదు. దాంతో అవని రాజేంద్రప్రసాద్ లు అనుమానిస్తారు. ఎవరో కావాలనే ఇలా చేశారు సీసీటీవీ ని ఆఫ్ చేసి ప్లాన్ చేశారు అనేసి అవని అంటుంది. బయటికి రాగానే మన సిసి టీవీ కెమెరాలు పనిచేయకపోయిన ఎదురుగా ఉన్న ఏటీఎం సెంటర్లో సీసీటీవీ కెమెరాలు పనిచేస్తాయి కదా మామయ్య దాని గురించి మనం తెలుసుకుంటే అసలు దొంగ ఎవరో తెలుసుకోవచ్చు అని అంటుంది అవని.. ఆ బ్యాంకు మేనేజర్ వాళ్ళ అన్నయ్య మనం ఆఫీసు బోర్డు మెంబర్ నేను అడిగి తెలుసుకుంటాను అనేసి అంటాడు. ఇక ఇంట్లో పార్వతి భానుమతి కమ్మలు టెన్షన్ పడుతుంటారు. టెన్షన్ పడుతుంటే నేను ఇలా కూల్ గా ఉంటే నా మీద అనుమానం వస్తుందని పల్లవి కూడా టెన్షన్ పడుతున్నట్టు నటిస్తుంది. అవని వదిన నాన్న ఉదయం అనగా వెళ్లారు అసలు దొంగ దొరికాడో లేదో అనేసి కంగారు పడుతుంటాడు. ఇక కమల్ అవనికి ఫోన్ చేసి ఏమైంది వదిన ఏమైనా తెలిసిందా అనేసి అడుగుతాడు. దానికి అవని అసలు దొంగ ఎవరో తెలిసిపోయింది కన్నయ్య మేము పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నాం. నేను మావయ్య ఆ పనిలోనే ఉన్నాము అనేసి అనగానే ఇంట్లో వాళ్ళందరికీ ఆ విషయాన్ని కమల్ చెప్తాడు. ఇప్పుడు నా గుండె నిదానంగా కొట్టుకుంటుంది అనేసి అంటుంది. నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఈ విషయాన్ని అన్నయ్య చెప్తాను అనే కమల్ వెళ్తాడు. అసలు అవని ప్లాన్ ఏంటో తెలియట్లేదే నేను కూడా వెళ్లాలని బావ నేను వస్తానని పల్లవి అంటుంది.
కమల్ పల్లవి పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్షయ్ కి గుడ్ న్యూస్ అని చెప్తాడు. అవని వదిన నాన్న వెళ్లారు ఆ దొంగ ఎవరు దొరికారు అంట కాసేపట్లో ఇక్కడ తీసుకొని వస్తారంట అనేసి అంటాడు. ఇప్పుడే పోలీసులు ఆఫీస్ బాయ్ ని తీసుకొని వస్తారు. వాన్ని చూసిన పల్లవి షాక్ అవుతుంది. వీణ్ణి తీసుకొచ్చారేంటి సార్ వీడు మా ఆఫీస్ బాయ్ అనగానే ఆఫీస్ బయలుదేరే క్రైమ్ చేయకూడదా అనేసి ఎస్ఐ అంటాడు. వీడే అదంతా చేశాడని తెలిసిపోయింది అలాగే నిజం చెప్పించండి ఎస్ఐ గారు అనేసి అవని అంటుంది. దానికి కమల్ అతనిపై కోపంతో రగిలిపోతూ చేయి చేసుకుంటాడు. పోలీసులే నిజం చెప్పిస్తారు అసలు ఇతని వెనకాల ఉన్న ఎవరో ఇప్పుడు తెలిసిపోతుంది అనేసి అవని అంటుంది. పల్లవి టెన్షన్ పడిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..