Manchu Manoj: మంచు మనోజ్ (Manchu Manoj)బాల నటుడిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే మనోజ్ వ్యక్తిగత కారణాలవల్ల కొంతకాలం పాటు సినిమాకు దూరంగా ఉన్నారు. ఏకంగా తొమ్మిది సంవత్సరాలు పాటు సినిమా ఇండస్ట్రీకి మనోజ్ దూరం కావడంతో ఇకపై మనోజ్ ను వెండితెరపై చూడలేమేమో అనే భావన అభిమానులలో కూడా కలిగింది. ఇలా వ్యక్తిగత విషయాల వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మనోజ్ తిరిగి ఇండస్ట్రీలోకి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారని చెప్పాలి. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
అర్జున్ రెడ్డి…
తాజాగా మంచు మనోజ్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో నటించిన భైరవం(Bhairavam) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ద్వారా మనోజ్ మరోసారి తనని తాను నిరూపించుకున్నారు. ఈ సినిమా తర్వాత మనోజ్ ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవ్వడమే కాకుండా తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తాను తన సినీ కెరియర్ లో మిస్ చేసుకున్న సినిమాల గురించి మాట్లాడారు. తాను మిస్ చేసుకున్న సినిమాలలో అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమా ఒకటని మనోజ్ తెలిపారు.
వ్యక్తిగత కారణాలు….
డైరెక్టర్ సందీప్ రెడ్డి(Sandeep Reddy) వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ఈ చిత్రం అప్పట్లో సంచలనాలను సృష్టించింది. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాని మంచు మనోజ్ మిస్ చేసుకున్నారనే విషయం తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా ఈ సినిమా చేసి ఉంటే బాగుండేది అంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అయితే ఈ సినిమాని రిజెక్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలను మనోజ్ బయట పెట్టారు. అర్జున్ రెడ్డి సినిమాకు ముందు తానే హీరోగా ఓకే అయ్యాను కొన్ని నెలలపాటు సందీప్ రెడ్డి వంగతో కలిసి జర్నీ చేశానని మనోజ్ తెలిపారు. ఇలా కొన్ని నెలల షూటింగ్ పూర్తి అయిన తర్వాత నా వ్యక్తిగత కారణాలవల్ల సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
న్యాయం చేయలేకపోయే వాడిని…
ఇలా సినిమా నుంచి తప్పుకున్న తర్వాత విజయ్ దేవరకొండ ఈ సినిమాలో భాగమయ్యారు. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత సినిమా చూసి నేను ఒక్కటే అనుకున్నాను. ఈ సినిమాలో మనం చేయకపోవడమే మంచిది అయింది. ఒకవేళ నేను చేసి ఉంటే కనుక ఈ సినిమాకి ఇంత న్యాయం చేసి ఉండేవాడిని కాదని, విజయ్ దేవరకొండ ఈ సినిమాకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. అతనే ఈ సినిమాకు కరెక్ట్ అంటూ మనోజ్ తెలిపారు. సినిమా విడుదలయ్యి మంచి టాక్ తెచ్చుకున్న తర్వాత చేసి ఉంటే బాగుండేది అనిపించింది కానీ సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయం మారిపోయిందని మనోజ్ తెలిపారు. ఇక ప్రస్తుతం మనోజ్ త్వరలోనే మిరాయ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అయిన మనోజ్ కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నారు.