Nagarjuna:సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ నటీనటులుగా పేరు తెచ్చుకున్న చాలామంది సెలబ్రిటీలు తెర ముందు ఉన్నంత హ్యాపీగా తెర వెనక ఉండలేరు. సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్నో రకాల కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులకు ఓర్చుకొని అంత పెద్ద పొజిషన్లోకి వెళ్లారు. అలా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది స్టార్ హీరోలు కూడా స్టార్డం సంపాదించుకోవడానికి, అవకాశాలు అందుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. చివరికి సక్సెస్ అందుకున్నారు. అలాంటి వారిలో దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageshwar Rao) కూడా ఒకరు.
అయితే అక్కినేని నాగేశ్వరరావు తన జీవితంలో జరిగిన కష్టా నష్టాలను బ్రతికున్నంత వరకూ ఎవరికీ చెప్పలేదట. నాగేశ్వరరావు తన కడుపున పుట్టిన పిల్లలకు కూడా తన కష్టాలను చెప్పుకునే వాడు కాదట.అయితే ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నాగార్జున (Nagarjuna), ఆయన సోదరి నాగ సుశీల(Naga Susheela) బయట పెట్టారు.అయితే తన పిల్లలకు చెప్పక పోయినప్పటికీ తన మనవళ్లిద్దరికీ మాత్రం అక్కినేని నాగేశ్వరరావు తన జీవితంలో పడ్డ కష్టాలను చెప్పారట. మరి అక్కినేని నాగేశ్వరరావు సినిమాల్లోకి వచ్చే ముందు ఎన్ని కష్టాలు పడ్డారు అనేది ఇప్పుడు చూద్దాం..
జీవిత రహస్యాలను కడుపులతో పంచుకొని ఏఎన్ఆర్..
అక్కినేని నాగేశ్వరరావు సినిమాల్లోకి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారట. ఒక్క సినిమాలో ఛాన్స్ కోసం కాళ్లరిగేలా తిరిగారట.ఇక తినడానికి తిండి లేక ఇంట్లో ఎన్నో ఇబ్బందులు పడేవారట. అంతేకాదు ఇంట్లో తినడానికి రాగులు, సజ్జలు మాత్రమే ఉండేవని, అన్నం వండితే అక్కినేని నాగేశ్వరరావు ఇంట్లో ఆరోజు పండగ వాతావరణం నెలకొనేదట. అయితే ఈ విషయాన్ని ఓ సందర్భంలో ఏఎన్ఆర్ (ANR) స్వయంగా చెప్పారు. అయితే ఏఎన్ఆర్ ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా తన పిల్లలకి మాత్రం ఈ ఇబ్బందులు తెలియకుండా పెంచారట. తాను పడ్డ కష్టాలు తన పిల్లలకు తెలియకూడదని, ఒక్కసారి కూడా తన కష్టాలను పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టి చెప్పేవాడు కాదట. అయితే అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో చెప్పిన విషయాలను బట్టే తండ్రి ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసుకున్నారట ఆయన సంతానం.
మనవళ్లకు మాత్రమే ఆ రహస్యం చెప్పిన ఏఎన్ఆర్..
అలా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున(Nagarjuna), నాగ సుశీల మాట్లాడుతూ..” మా నాన్న ఎన్నో ఇబ్బందులు పడి సినిమాల్లోకి వచ్చారు. కానీ ఆయన కష్టాల్ని మాకు ఏ రోజు చెప్పలేదు. కనీసం మా పిల్లలకైనా మా నాన్న పడ్డ కష్టాలు తెలియాలని నాగచైతన్య (Naga Chaitanya) అఖిల్ (Akhil) ని నాన్నగారి దగ్గరికి తీసుకువెళ్లి మీ లైఫ్ సీక్రెట్స్ , మీ కష్టాలు ఏంటో మాకు తెలియదు. కనీసం నా పిల్లలకన్నా చెప్పండి అని అన్నాను. ఆరోజు నాన్నగారు తాను సినిమాల్లోకి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారు ? లైఫ్ లో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అనే విషయాన్ని పూసగుచ్చినట్టు అఖిల్, నాగచైతన్యలకు తెలిపారు. ఇక ఇండస్ట్రీలో ఈరోజు మా కుటుంబం ఇంత గొప్ప స్థాయిలో ఉందంటే అది కేవలం నాన్నగారి కష్టం మాత్రమే” అంటూ నాగార్జున ఆ ఇంటర్వ్యూలో తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
ALSO READ:Mrunal Thakur: ఆ స్టార్ హీరో ప్రేమలో మృణాల్..మనసులో కోరికపై నెటిజన్స్ ట్రోల్స్!