Manchu Manoj : మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లకొండ సాయి శ్రీనివాస్ కలిసి నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ‘భైరవం’ (Bhairavam). ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకుడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం టీజర్ (Bhairavam Teaser)ను లాంఛ్ చేసింది. ఈ వేడుకలో మంచు మనోజ్ నారా రోహిత్ తో తన అనుబంధాన్ని పంచుకున్నారు.
‘భైరవం’ (Bhairavam) సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సైతం ప్రేక్షకుని ఆకట్టుకుంది. ఇందులో వర్షంలో తడుస్తూ పవర్ ఫుల్ లుక్ లో మనోజ్ కనిపించారు. ఇక ఈ నేపథ్యంలో చిత్ర బృందం సోమవారం టీజర్ ను విడుదల చేసింది. ‘రాత్రి నాకో కల వచ్చింది..’ అంటూ జయసుధ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్ ఎంతో ఆసక్తికరంగా కొనసాగింది. ‘ఆ రామలక్ష్మణులను సముద్రం దాటించేందుకు ఆంజనేయుడు ఉంటే.. ఈ రామలక్ష్మణులకు ఏ కష్టం రాకుండా చూసుకునేందుకు ఈ శ్రీనుగాడు ఉన్నాడు..’ అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ డైలాగ్ పవర్‌ఫుల్‌గా అనిపించింది.
ALSO READ : VD12 మూవీ రిలీజ్ ఫిక్స్
‘భైరవం’ సినిమా ముగ్గురు సోదరుల అనుబంధం ఇతివృత్తంగా తెరకెక్కుతున్నట్లు ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా సందడి చేయనున్నారు. ఇక ఈ ఈవెంట్ కు హాజరైన మంచు మనోజ్… నారా రోహిత్ తో తనకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉందని తెలిపారు. రోహిత్ వాయిస్ సినిమాకే స్పెషల్ ఎట్రాక్షన్ గా మారనుందని తెలిపారు. ప్రతీ సినిమాలో వాయిస్ అద్భుతంగా ఉంటుందన్నారు. ఇక రోహిత్ తన ఒక్కడే మిగిలాడు సినిమాకు సైతం వాయిస్ ఓవర్ ఇచ్చాడని తెలిపిన మనోజ్.. ఎన్నో ఏళ్ల నుంచి అతనితో సినిమా చేద్దామనుకుంటున్నా కుదరలేదని ఇప్పటికి ఆ కల నేరవేరిందని తెలిపారు. ఇక ఈ సినిమా మంచి విజయం సాధింస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.
ఇక వారాహి గుడి, ఒక ఊరు నేపథ్యంలో యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా రాబోతున్నట్లు టీజర్ బట్టి అర్ధమవుతుంది. ఈ ముగ్గురు హీరోల పక్కన దివ్య పిళ్ళై, అదితి శంకర్, ఆనంది కథానాయికలుగా కనిపించనున్నారు. జయసుధ, ప్రియమణి కీలక పాత్రల్లో నటించనున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై KK రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు.