IND vs Eng T20i: టీమిండియా ( India ) మరో సిరీస్ కోసం సిద్ధం అవుతోంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య T20లు జరుగనున్నాయి. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జనవరి 22న T20I సిరీస్ ప్రారంభం కానుంది. T20I సిరీస్ లో ఇంగ్లాండ్ ను ( England ) ఓడించేందుకు సిద్ధం అవుతోంది టీమిండియా. ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ( ICC Champions Trophy 2025 ) కంటే ముందు ఐదు T20Iలు ఆ తర్వాత మూడు ODIలలో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడతాయి.
Also Read: Rinku Singh Father: తండ్రికి రూ.3.19 లక్షల విలువైన బైక్ గిఫ్ట్ ఇచ్చిన రింకూ !
చివరగా T20 ప్రపంచ కప్ 2024 ( World Cup 2024)సెమీ-ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి చివరికి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు. అలాగే సెమీ ఫైనల్‌లో భారత్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించిన ఇంగ్లాండ్ 2022లో టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఇక అటు 2023 ODI ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన అనుభవజ్ఞుడైన పేసర్ మహమ్మద్ షమీ ( Mohammed Shami ) రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) నేతృత్వంలోని టీమిండియా….ఇంగ్లండ్ తో T20I సిరీస్ లో పాల్గొంటుంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య T20లు సాయంత్రం 7:00 PM ప్రారంభం అవుతాయి. అంటే ఐపీఎల్ తరహాలోనే భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య T20లు జరుగుతాయి. అయితే UK లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య T20లు 1:30 PMకి ప్రారంభమవుతాయి. ఇండియా vs ఇంగ్లండ్ T20I సిరీస్ లైవ్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ టీవీ ఛానెల్‌లలో చూడవచ్చు. అలాగే డిస్నీ+ హాట్‌స్టార్ వెబ్‌సైట్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు.
Also Read: MS Dhoni: ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ కోసం రెడీ అవుతున్న ధోని !
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టీ20 సిరీస్ పూర్తి షెడ్యూల్
1వ IT20: భారత్ v ఇంగ్లాండ్, బుధవారం 22 జనవరి, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
2వ IT20: భారత్ v ఇంగ్లాండ్, జనవరి 25 శనివారం, MA చిదంబరం స్టేడియం, చెన్నై
3వ IT20: భారత్ v ఇంగ్లాండ్, మంగళవారం 28 జనవరి, నిరంజన్ షా స్టేడియం, రాజ్‌కోట్
4వ IT20: భారత్ v ఇంగ్లాండ్, శుక్రవారం 31 జనవరి, MCA స్టేడియం, పూణె
5వ IT20: ఇండియా v ఇంగ్లాండ్, ఆదివారం 2 ఫిబ్రవరి, వాంఖడే స్టేడియం, ముంబై
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టీ20 సిరీస్ జట్లు
భారత్: సూర్యకుమార్ యాదవ్ (సి), సంజు శాంసన్ (వికె), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ (విసి), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ , వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (wk).
ఇంగ్లండ్: జోస్ బట్లర్ (సి), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.