VD12 : టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘VD12’. ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది. కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను చిత్రబృందం ప్రకటించింది.
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పేస్తూ ‘VD12’ రిలీజ్ డేట్ ను చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాను మే 30న రిలీజ్ చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపింది. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా పోస్టర్ ఇప్పటికే అభిమానుల్ని ఆకట్టుకుంది.
గౌతమ్ తిమ్మనూరి దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం వీడి 12. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ పోలీస్ అధికార పాత్రలో కనిపించరున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల కేరళలో షెడ్యూల్ సైతం పూర్తి చేసుకుంది. సినిమాకు సంబంధించిన ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలను కేరళలో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 28న రిలీజ్ అవుతుందని చిత్ర బృందం గతంలో అనౌన్స్ చేసింది. అయితే సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వస్తున్న మరో మూవీ మ్యాడ్ స్క్వేర్ ను మార్చి 29న రిలీజ్ చేస్తుండటంతో వీడి 12 వాయిదా పడింది. ఈ సినిమాను మార్చి 30న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది.
ALSO READ : ‘భైరవం’ టీజర్ వచ్చేసిందోచ్… హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొట్టిన ముగ్గురు హీరోలు