BigTV English

Adventure Thriller OTT: నిధి కోసం అన్వేషణ.. ఇంట్రెస్టింగ్ గా ట్విస్ట్.. ప్రతి సీన్ హైలెటే..

Adventure Thriller OTT: నిధి కోసం అన్వేషణ.. ఇంట్రెస్టింగ్ గా ట్విస్ట్.. ప్రతి సీన్ హైలెటే..

Adventure Thriller OTT: థియేటర్లలో కన్నా ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలకు క్రేజ్ ఎక్కువే. ఈమధ్య కొత్త కంటెంట్లతో ఓటీటీలోకి సరికొత్త స్టోరీలతో సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి.. థ్రిల్లర్ మూవీస్ కి జనాల నుంచి మంచి స్పందన లభిస్తుంది. థ్రిల్లర్ కథతో వచ్చినా ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవడం చూస్తూనే ఉన్నాము. కేవలం సినిమాలు మాత్రమే కాదు వెబ్ సిరీస్ కూడా ఓటీటీలో బాగానే టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. ప్రతివారం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా ఓటీడీలో రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది.. అ వెబ్ సిరీస్ పేరేంటో? స్టోరీ ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


వెబ్ సిరీస్ & ఓటీటీ.. 

ఆ వెబ్ సీరీస్ పేరు దిసీక్రెట్ ఆఫ్ ది శీలేదార్స్.. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ నిధి కోసం అన్వేషణ.. అలాగే ఆ నిధిని కాపాడడం కోసం ఎలాంటి సవాలను ఎదుర్కొన్నారు ఈ కథలోని క్రిష్ ఏంటో ఈ సిరీస్ లో చూపించారు. కేవలం నిధి సంరక్షణ గురించే ఈ సిరీస్ స్టోరీ లైన్ ఉంటుంది.. సాయి తంహనకర్, రాజీవ్ ఖండేవాల్ ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ సిరీస్‍లో లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సిరీస్ ట్రైలర్ ను నేడు రిలీజ్ చేశారు మేకర్స్. జనాల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలుస్తుంది.


ట్రైలర్ లో.. నిధిని చేరే క్రమంలో వారికి సవాళ్లు, ట్విస్టులు ఎదురవుతాయి. చిక్కుముడులను వివ్పుతూ నిధికి చేరేందుకు ప్రయత్నిస్తారు. ట్రైలర్ లోని ప్రతి సన్నివేశం ఉత్కంఠ భరితంగా ఉంటుంది. నిధిని వెతికే పనిలో ఎదుర్కొనే సవాళ్ల గురించి ఈ ట్రైలర్ లో చూపించారు. కొన్ని సీన్స్ మాత్రం అతి భయంకరంగా ఉంటాయని ట్రైలర్ ని చూస్తే అర్థమవుతుంది.. నిధి వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈ కాలం శిలేదార్స్ అక్కడికి చేరుకొని సంరక్షించారా? ఆ నిధిని చేజిక్కుంచునేందుకు ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరు ? అనే అంశాల చుట్టూ ఈ సిరీస్ సాగుతుందనేలా ట్రైలర్ ఉంది..

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్..? 

ఇది వెబ్ సిరీస్ ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. జనవరి 31వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఆ విషయాన్ని హాట్‍స్టార్ ఇప్పటికే అధికారికంగా అనౌన్స్ చేసింది. ఆదిత్య సర్పోర్ట్‌దార్ దర్శకత్వం వహించారు. గతేడాది ఆదిత్య తెరకెక్కించిన హారర్ మూవీ ముంజ్య భారీ బ్లాక్‍బస్టర్ అయింది. దీంతో ఆయన బాగా పాపులర్ అయ్యారు.. ఆయన నుంచి వెబ్ సిరీస్ రావడంతో ఆసక్తి కాస్త ఎక్కువగానే ఉంది.ఈ సిరీస్‍లో రాజీవ్, సాయి తంహనకర్ సహా ఆశిష్ విద్యార్థి, గౌరవ్ అమ్లానీ కీరోల్స్ చేశారు. ది సీక్రెట్ ఆఫ్ ది శీలేదార్స్ సిరీస్‍ను ధనలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై నితిన్ వైద్య ప్రొడ్యూజ్ చేశారు. మరాఠీ నవల ప్రతిపశ్చంద్ర నవల ఆధారంగా ఈ సిరీస్‍ను తెరకెక్కించారు. ట్రైలర్ అయితే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి..

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×