Watch: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… ఎలిమినేటర్ మ్యాచ్ ఇవాళ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్లో రెండు జట్లు కూడా సమఉజ్జీవులుగా ఆడుతున్నాయి. కానీ గుజరాత్ జట్టుకు సంబంధించిన కుసాల్ మెండిస్
ఆటతీరే ఇప్పుడు ఆ జట్టుకు ప్రమాదకరంగా మారింది. వికెట్ కీపింగ్ అలాగే బ్యాటింగ్లో అత్యంత దారుణంగా విఫలమయ్యాడు మెండిస్.
Also Read: Stoinis Partner : కోహ్లీ ఇజ్జత్ తీసిన స్టోయినిస్ వైఫ్… బండ బూతులు తిడుతూ
Hit వికెట్ అయిన కుసాల్ మెండిస్
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది. ఇందులో ఓడిపోయిన జట్టు కచ్చితంగా ఇంటికి వెళ్లడం ఖాయం. ఇలాంటి నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు కుసాల్ మెండిస్ అత్యంత దారుణంగా ఆడుతున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు అమ్ముడుపోయినట్లుగానే వ్యవహరిస్తున్నాడు. వికెట్ కీపింగ్ లో రెండు క్యాచ్ లు మిస్ చేసిన కుసాల్ మెండిస్…. ఇప్పుడు బ్యాటింగ్ లోను దారుణంగా అవుట్ అయ్యాడు. పది బంతుల్లో 20 పరుగులు చేసిన కుసాల్ మెండిస్… రెండు సిక్సర్లు, ఒక బౌండరీ కొట్టాడు. అనంతరం ముంబై స్పిన్నర్ శాంట్నర్ బౌలింగ్లో హిట్ వికెట్ అయ్యాడు కుసాల్ మెండిస్. వికెట్ల దగ్గర కాళ్లు పెట్టి బ్యాటింగ్ చేసిన కుసాల్ మెండిస్.. బంతి వచ్చేలోపు కాస్త టెంప్ట్ అవుట్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముంబై ఇండియన్స్ కు అమ్ముడుపోయిన కుసాల్ మెండిస్
గుజరాత్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య బిగ్ ఫైట్ నేపథ్యంలో హిట్ వికెట్ అయిన కుసాల్ మెండిస్ పై సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్ వస్తున్నాయి. ముంబై జట్టుకు అమ్ముడుపోయాడని కుసాల్ మెండిస్ పై ట్రోలింగ్ చేస్తున్నారు. అంబానీ ఇచ్చిన డబ్బులకు ఆశపడి…కుసాల్ మెండిస్ ఇలా ఆడుతున్నాడని ఫైర్ అవుతున్నారు గుజరాత్ టైటాన్స్ అభిమానులు. ఇలాంటి ప్లేయర్ కుసాల్ మెండిస్ ను ఎందుకు తీసుకువచ్చారు…? ఇంటికి పంపించండి అంటూ నిప్పులు జరుగుతున్నారు. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆడాల్సిన ఆట ఇది కాదు అంటూ ఫైర్ అవుతున్నారు. అటు వికెట్ కీపింగ్ లో కూడా అత్యంత దారుణంగా విఫలమవుతున్నాడని… మండిపడుతున్నారు. వెంటనే జట్టులో నుంచి ఇతన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
దుమ్ము లేపుతున్న గుజరాత్ ఆటగాళ్లు
ఇక ముంబై పైన చేజింగ్ చేసే నేపథ్యంలో గుజరాత్ ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. గుజరాత్ జట్టు కెప్టెన్ గిల్ ఒకే ఒక్క పరుగు చేసినప్పటికీ మిగతా ఆటగాళ్లు దుమ్ము లేపుతున్నారు. సాయి సుదర్శన్ 80 పరుగులు చేయగా మెండిస్ 20 పరుగులు.. చేయడం జరిగింది. వాషింగ్టన్ సుందర్ 24 బంతుల్లోనే 48 పరుగులు చేసి రఫ్పాడించాడు. ప్రస్తుతం రూథర్ ఫోర్డ్ జట్టును ముందుకు తీసుకు వెళ్తున్నాడు.
Also Read: PBKS Fans : తెల్లటి డ్రెస్సుల్లో అందాల భామలు..రాం రాజ్ కాటన్ అంటూ ట్రోలింగ్
Unreal Fixing from Umpire Indians 🤣
Kushal Mendis first Dropped lot of catches while Keepering and then got out on hit wicket while batting. I don't think there is any bigger proof than this to expose the umpire Indians.#MIvsGT #Eliminator #IPL25 #MumbaiIndians https://t.co/q3corPwxWD— Cricket Freak 🏏 (@Cric_Freak01) May 30, 2025
Well played Kushal Mendis 👏#MIvGT pic.twitter.com/KIquUedfIo
— 𝗦𝗵𝗿𝗲𝘆𝗶 ᵀᵒˣᶦᶜ ¹⁹ ⁰³ ²⁶ (@NameIsShreyash) May 30, 2025