Manchu Manoj :గత కొన్ని రోజులుగా కుటుంబ వివాదాలతో నటుడు మంచు మోహన్ బాబు(Manchu Mohan babu)కుటుంబం వార్తల్లో నిలుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే కలెక్టర్ రంగారెడ్డిని నటుడు మంచు మనోజ్ (Manchu Manoj ) కలిసి పలు విషయాలను కలెక్టర్ తో చర్చించారు. తన ఆస్తుల్లో ఉంటున్న వారిని కాళీ చేయించాలని కోరుతూ మోహన్ బాబు కొన్ని రోజుల క్రితం జిల్లా మేజిస్ట్రేట్ ను ఆశ్రయించారు. ముఖ్యంగా జల్ పల్లి లోని తన నివాసాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారని తన ఫిర్యాదులో తెలిపారు. ఈ మేరకు మంచు మనోజ్ కు జిల్లా కలెక్టర్ నోటీసులు పంపించగా.. అందులో భాగంగానే మంచు మనోజ్ తాజాగా కలెక్టర్ ను కలిసినట్లు తెలుస్తోంది.ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతతోంది.
తన ఆస్తులను అక్రమంగా దోచుకున్నారంటూ ఫిర్యాదు చేసిన మోహన్ బాబు..
గత ఏడాది నుండి మంచు కుటుంబంలో వివాదాలు తారస్థాయికి చేరిపోయాయి. ముఖ్యంగా మంచు విష్ణు దుబాయ్ లో ఫ్యామిలీతో కలిసి సెటిల్ అవడంతో ఇక్కడ జల్పల్లిలో ఉన్న ఫామ్ హౌస్ లో మంచు మోహన్ బాబు ఆయన భార్య నిర్మల దేవి మాత్రమే నివాసం వుంటున్నారు. అయితే ఈ వయసులో వారికి అండగా నిలవాలి అని.. కొంతమంది సన్నిహితులు మంచు మనోజ్ కి తెలియజేయడంతో ఆయన తన భార్య మౌనిక తో కలిసి ఇద్దరు పిల్లలతో అదే ఇంట్లో ఉంటున్నారు. ఇక అక్కడితోనే మోహన్ బాబు, మనోజ్ మధ్య గొడవలు మొదలయ్యాయని సమాచారం. ఈ నేపథ్యంలోనే మనోజ్ ను తన ఇంటి నుంచి ఖాళీ చేయించాలని మోహన్ బాబు కోర్ట్ ను ఆశ్రయించారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులు తనకు మాత్రమే చెందే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కూడా మోహన్ బాబు కోరారు. జల్ పల్లి నివాసంతో పాటు తన ఆస్తులలో ఉన్న ప్రతి ఒకరిని కూడా వెకేట్ చేయించాలి అని జిల్లా కోర్టులో మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. తాను సొంతంగా కష్టపడి ఆస్తులు కూడబెట్టుకుంటే వాటిని కొంతమంది కావాలని కబ్జా చేశారని, వాళ్ళని వెంటనే వెకేట్ చేయించి తన ఆస్తులు తనకు అప్పగించాలని మోహన్ బాబు కోరారు. అంతేకాదు తన ఇంట్లో వేరే వాళ్ళు ఉండడం వల్లే తాను తిరుపతిలో ఉంటున్నాను అని కూడా తెలిపారు.
స్పందించిన జిల్లా కలెక్టర్..
జల్పల్లిలో మోహన్ బాబు ఇంట్లో మంచు మనోజ్,తన భార్య, పిల్లలతో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలోనే తన కొడుకుని ఖాళీ చేయించమని చెప్పకుండా ఇతరులు అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే మోహన్ బాబు ఫిర్యాదు పై స్పందించిన జిల్లా కలెక్టర్ మనోజ్ కి నోటీసులు ఇవ్వగా మనోజ్ ఆ నోటీసుల నిమిత్తం కలెక్టర్ రంగారెడ్డిని కలిశారు. మరి ఆయన ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూడాలి. ఏది ఏమైనా మంచు కుటుంబంలో గొడవలు రోజుకు ఒకటి బయటపడడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.