BigTV English

Vijay 69: భగవంత్ కేసరీలో ఆ ఒక్క సీన్‌‌కే కోట్లు పెట్టిన విజయ్… అయితే మూవీ మొత్తం రీమేక్ కాదా..?

Vijay 69: భగవంత్ కేసరీలో ఆ ఒక్క సీన్‌‌కే కోట్లు పెట్టిన విజయ్… అయితే మూవీ మొత్తం రీమేక్ కాదా..?

Vijay 69: స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన తెలుగు ప్రేక్షకులు కూడా సుపరిచితమే. తెలుగులో ఈయన నటించిన సినిమాలు రిలీజ్ అవ్వడంతో ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉంది.. విజయ్ ఇప్పటికే తెలుగు సినిమాలను చాలా వరకు రీమేక్ చేశారు. ఇప్పుడు మరోసారి రీమేక్ చేయబోతున్నారంటూ వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలు పై క్లారిటీ వచ్చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలయ్య నటించిన సినిమాలోని ఓ సీన్ ను సినిమాల్లో వాడుకోబోతున్నారు.. నిజానికి విజయ్ దళపతి గతంలో చాలా సినిమాలను రీమేక్ చేశారు. మరి ఆ సీన్ కోసం మేకర్స్ ఎన్ని కోట్లు చెల్లించారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


బాలయ్య భగవంత్ కేసరి..

బాలయ్య గతేడాది నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం భగవంత్ కేసరి.. ఈ మూవీలో శ్రీ లీల బాలయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. తండ్రి కూతుర్ల మధ్య ఎమోషనల్ సన్నివేశాలను ఈ సినిమాలో చూపించారు. మాస్ డైలాగులు, యాక్షన్ ఫైట్లతో పాటు తండ్రీ కూతుర్ల మధ్య ప్రేమ ఎలా ఉంటుందని ఈ సినిమాలో అనిల్ రావిపూడి చూపించారు.. మొదట యాక్షన్ తో మొదలైన ఈ సినిమా క్లైమాక్స్లోకి వచ్చేలోగా కన్నీళ్లు అని పెట్టించింది. ఈ మూవీలోని ఒక సీన్ ని తమిళ స్టార్ హీరో విజయ్ తమ సినిమాలో వాడేందుకు హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.


Also Read : చిరంజీవి మెంటాలిటీ ఇదే.. అందుకే సినిమా క్యాన్సిల్.. తప్పు ఎవరిది..?

ఒక్క సీన్ కోసం కోట్లు ఖర్చు..

బాలయ్య నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం భగవంత్ కేసరి.. ఈ మూవీ రీమేక్‌లో ఇళయతలపతి షూటింగ్ చేస్తున్నట్లు బలమైన పుకార్లు ఉన్నాయి. సినిమా ఒరిజినల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వారిని సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి. కానీ అతను రీమేక్ వార్తలను ధృవీకరించలేదు. విజయ్ తన చివరి సినిమా జననాయకన్ షూటింగ్ లో ఉన్నాడు. రాజకీయాలు, సాంఘిక నాటకాల కలయికతో రూపొందిన ఈ చిత్రం సమాజానికి బలమైన సందేశాన్ని అందజేస్తుంది.. ఈ క్రమంలో భగవంత్ కేసరి మూవీలోని గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే ఎమోషనల్ సీన్ ను విజయ్ సినిమా లో రీమేక్ చేయబోతున్నారట.. గత కొద్దిరోజులుగా ఈ రీమేక్ పై వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తల పై టీమ్ క్లారిటీ ఇచ్చేసింది. ఆ ఒక్క సీన్ రీమేక్ హక్కులను రూ. 4.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మూవీకి హెచ్‌వినోత్‌ దర్శకుడు కాగా, కెవిఎన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మాతలు.. జన నాయకన్ 2026 సంక్రాంతి కి విడుదల కానుంది.. ఈ సినిమా విడుదలైన తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాల్లోనే ఉండిపోతాడని తెలుస్తుంది.. బాలయ్య సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను కాంబినేషన్లో అఖండ 2 సినిమా చేస్తున్నారు.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే థియేటర్లోకి రాబోతుంది..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×