Pawan Kalyan:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాజాగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా.. అనూహ్యంగా ఆయన తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ (Jyoti Krishna)రంగంలోకి దిగారు. ఇప్పటికే దాదాపు 13 సార్లు విడుదల వాయిదా పడిన ఈ సినిమా.. ఎట్టకేలకు జూన్ 12వ తేదీన విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక 2020లోనే ఈ సినిమా ప్రకటించారు. కానీ దాదాపు 5 ఏళ్లుగా ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడిగా కనిపిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ (Nidhi Agarwal)హీరోయిన్ గా నటిస్తోంది. మొదట ఈ సినిమాను మార్చి 28న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండడం వల్ల ఆయన డేట్స్ ఇవ్వడానికి కుదరలేదు. దీంతో సినిమా షూటింగ్ పెండింగ్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది.
జూన్ 12న హరిహర వీరమల్లు సినిమా విడుదల..
ఇక మే 30వ తేదీన సినిమా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ రోజున చాలా సినిమాలు పోటీపడుతున్న నేపథ్యంలో ఈ రోజు కూడా వాయిదా వేశారు. ఇక ఇప్పుడు జూన్ 12వ తేదీన ఎట్టకేలకు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అంతేకాదు ఒక సెంటిమెంటును కూడా తెరపైకి తీసుకొచ్చారు. అదేంటంటే.. దాదాపు పదేళ్లుగా పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ప్రజల కోసం పోరాడుతుండగా.. 2024 జూన్ 12వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా ఎట్టకేలకు ప్రమాణస్వీకారం చేశారు. ఇక తనకు అదృష్టాన్ని తీసుకొచ్చిన రోజు కావడంతో అదే రోజున సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు అంటూ వార్తలు వినిపించాయి. దీంతో జూన్ 12న విడుదల చేస్తామని ప్రకటించడంతో అభిమానులు కూడా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.
ఎగ్జిబిటర్ల నిర్ణయంతో వాయిదా పడినట్లేనా..?
అయితే ఇప్పుడు ఈ విడుదలకు కొత్త చిక్కు ఏర్పడింది. తాజా సమస్యల కారణంగా ఈ సినిమా జూన్ 12 అయిన విడుదలవుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని తెలుగు రాష్ట్రాల సినీ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రాతిపాదికన సినిమాలను ప్రదర్శించలేమని, పర్సంటేజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్లు తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఇక జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలి అని మేకర్స్ నిర్ణయించుకుంటే.. హరిహర వీరమల్లు మళ్ళీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే హరిహర వీరమల్లుతోపాటు కన్నప్ప, కుబేర, కింగ్డమ్, థగ్ లైఫ్ వంటి చిత్రాల విడుదల కూడా ఆగిపోవడం ఖాయమని నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు. మరి జూన్ 1 నుంచి సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు బంద్ అయితే ఆ ప్రభావం వీటిపై భారీగా పడనుంది అని చెప్పవచ్చు.
ALSO READ:Jr. NTR: జూనియర్ ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా..?