Manchu Manoj: మంచు ఫ్యామిలీలో గత కొన్ని రోజులుగా గొడవలు తారాస్థాయికి చేరుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆస్తుల కోసమే గొడవ అని మంచు విష్ణు (Manchu Vishnu), ఆస్తుల కోసం కాదు మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) లో జరిగే అవకతవకలను అరికట్టడమే ధ్యేయం అని మంచు మనోజ్ (Manchu Manoj) ఎవరికి వారు పోరాటం చేస్తున్నారు. అటు మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) మాత్రం తన పెద్ద కొడుకు మంచు విష్ణుకి సపోర్ట్ చేస్తుండడంతో.. తనను ఒంటరి చేశారని, తన కుటుంబంతో సహా తనను రోడ్డుపైకి లాగారు అంటూ మనోజ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ఆవేదన కాదు విష్ణుకి రోజుకొక కౌంటర్ ఇస్తూ వరుస పోస్టులతో సంచలనం సృష్టిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా మంచు మనోజ్ ఒక ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టడం జరిగింది. అందులో తన తండ్రి పెదరాయుడు గెటప్లో పంచ కట్టులో చాలా హుందాగా కనిపించగా.. ఆయన పక్కనే భైరవం సినిమాలో స్టిల్ లో తాను కూడా పంచకట్టులో కనిపించారు. ఇక తండ్రి పక్కనే తాను ఉన్న ఫోటోని షేర్ చేస్తూ..”ఆయన కొడుకు వచ్చాడని చెప్పు” అంటూ మనోజ్ పోస్ట్ పెట్టగా.. ఇది విష్ణు కి కౌంటర్ గా మనోజ్ పోస్ట్ పెట్టాడని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన మరికొంతమంది నెటిజన్స్ పాపం.. తండ్రిని వదిల్లేకపోతున్నాడు… ఇది చూసైనా… ‘మంచు’ మనసు కరిగేనా..? అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
తండ్రికి దూరమై విలవిల్లాడుతున్న మనోజ్..
ఇకపోతే మంచు మనోజ్ కి తన తండ్రి మంచు మోహన్ బాబు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన మొదటి సినిమా కూడా తన తండ్రి నిర్మాణ సారధ్యంలో వచ్చిన ‘మేజర్ చంద్రకాంత్’ ద్వారానే మొదలుపెట్టారు. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆకట్టుకున్నారు. ఇకపోతే తన అన్నయ్య మంచు విష్ణు వల్లే తన తండ్రి తనకు దూరమయ్యాడని , అసలు తన తండ్రితో కూర్చొని మాట్లాడడానికి కూడా సమయం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనోజ్. ఇక ఎప్పటికైనా తన కూతుర్ని తన తండ్రి ఒడిలో కూర్చోబెట్టి, తన కుటుంబంతో కలిసి పోవాలని ఆశపడుతున్నాను అని, తన తండ్రిని కలవడానికి ప్రార్థించని దేవుడు లేడు అంటూ తండ్రికి దూరమై మనోజ్ విలవిల్లాడిపోతున్నారు. మరి ఇప్పటికైనా మంచు మోహన్ బాబు మనసు కరిగి మనోజ్ ని ఆదరిస్తారేమో చూడాలి.
మంచు మనోజ్ సినిమాలు..
మనోజ్ దాదాపు 9 ఏళ్ల తర్వాత విజయ్ కనకమేడల దర్శకత్వంలో భైరవం అనే సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ హీరోలుగా నటించగా.. కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. మరొకవైపు దివ్య పిళ్ళై , ఆనంది హీరోయిన్లుగా నటించారు. మరోవైపు హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్న తేజ నటిస్తున్న మరో చిత్రం మిరాయ్. ఇందులో మనోజ్ మొదటిసారి విలన్ గా నటిస్తున్నారు.
ALSO READ:Gaddar Awards : గద్దర్ అవార్డ్ విన్నర్స్ బిగ్ సర్ప్రైజ్.. ఇచ్చేది ఒక్క అవార్డు కాదండోయ్.
Ayyana Koduku Vachadu ani chepu 💥🔥 pic.twitter.com/UMumguQqru
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) May 30, 2025