BigTV English

Gaddar Awards : గద్దర్ అవార్డ్ విన్నర్స్ బిగ్ సర్ప్రైజ్.. ఇచ్చేది ఒక్క అవార్డు కాదండోయ్.

Gaddar Awards : గద్దర్ అవార్డ్ విన్నర్స్ బిగ్ సర్ప్రైజ్.. ఇచ్చేది ఒక్క అవార్డు కాదండోయ్.

Gaddar Awards: దాదాపు 14 ఏళ్ల ప్రయత్నం తర్వాత మళ్లీ తెలంగాణలో అవార్డుల పండుగ మొదలైంది. 2014 జూన్ 2 నుండి 2023 డిసెంబర్ 31 వరకు ఎంపిక చేసిన ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటీనటుల జాబితాను జ్యూరీ మెంబర్స్ ప్రకటిస్తున్నారు. అందులో భాగంగానే నిన్న ఉత్తమ నటీనటులు , ఉత్తమ టెక్నీషియన్స్ ను జ్యూరీ మెంబర్ జయసుధ (Jayasudha)ప్రకటించగా.. ఈరోజు 2014 నుండి 2023 వరకు సెన్సార్ పూర్తిచేసుకుని విడుదలైన చిత్రాలలో ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలను జ్యూరీ మెంబర్ మురళీమోహన్(Murali Mohan) తాజాగా వెల్లడించారు. అలా ఒక్కో ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయడం జరిగింది. అయితే ఉత్తమ చిత్రాలే కాదు ఒక్కో చిత్రానికి మరో నాలుగు ఉత్తమ అవార్డులు కూడా ఇవ్వనున్నట్లు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు (Dilraju ) తెలిపారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయగా.. ఆ ఒక్కో ఉత్తమ చిత్రం నుండి ఉత్తమ హీరోయిన్, ఉత్తమ హీరో, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ నిర్మాత ఇలా నాలుగు విభాగాలలో గద్దర్ అవార్డ్స్ ఇవ్వనున్నట్లు తాజాగా దిల్ రాజు ప్రకటించారు. ఇక ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఉత్తమ చిత్రాల జాబితాను విడుదల చేయగా.. ఇప్పుడు ఆ చిత్రాలలో నటించిన హీరో, హీరోయిన్లకు, ఆ చిత్రాన్ని దర్శకత్వం వహించిన డైరెక్టర్ కి , నిర్మించిన నిర్మాతకు కూడా ఇప్పుడు గద్దర్ అవార్డులు రాబోతున్నాయి.


గద్దర్ అవార్డ్స్ ఉత్తమ చిత్రాలు..

ఇకపోతే గద్దర్ అవార్డ్స్ లో భాగంగా జ్యూరీ మెంబర్స్ 2014 నుండి 2023 డిసెంబర్ వరకు సెన్సార్ పూర్తిచేసుకుని విజేతగా నిలిచిన సినిమాల జాబితాని విడుదల చేశారు. అందులో ఒక్కో ఏడాదికి 3 చిత్రాలు చొప్పున మొత్తం 9 సంవత్సరాలకు గానూ 27 చిత్రాలను ఎంపిక చేయడం జరిగింది. ఇకపోతే ఉత్తమ చిత్రాలుగా నిలిచిన సినిమా జాబితా విషయానికి వస్తే..


2014 :
మొదటి ఉత్తమ చిత్రం – రన్ రాజా రన్
రెండవ ఉత్తమ చిత్రం – పాఠశాల
మూడవ ఉత్తమ చిత్రం – అల్లుడు శ్రీను

2015 :
మొదటి ఉత్తమ చిత్రం – రుద్రమదేవి
రెండవ ఉత్తమ చిత్రం – కంచె
మూడవ ఉత్తమ చిత్రం – శ్రీమంతుడు

2016 :
మొదటి ఉత్తమ చిత్రం – శతమానంభవతి
రెండవ ఉత్తమ చిత్రం – పెళ్ళిచూపులు
మూడవ ఉత్తమ చిత్రం – జనతా గ్యారేజ్

2017:
మొదటి ఉత్తమ చిత్రం – బాహుబలి 2
రెండవ ఉత్తమ చిత్రం – ఫిదా
మూడవ ఉత్తమ చిత్రం – ఘాజీ

2018:
మొదటి ఉత్తమ చిత్రం – మహానటి
రెండవ ఉత్తమ చిత్రం – రంగస్థలం
మూడవ ఉత్తమ చిత్రం – కంచరపాలెం

2019:
మొదటి ఉత్తమ చిత్రం – మహర్షి
రెండవ ఉత్తమ చిత్రం – జెర్సీ
మూడవ ఉత్తమ చిత్రం – మల్లేశం

2020:
మొదటి ఉత్తమ చిత్రం – అలా వైకుంఠపురంలో
రెండవ ఉత్తమ చిత్రం – కలర్ ఫోటో
మూడవ ఉత్తమ చిత్రం – మిడిల్ క్లాస్ మెలోడీస్

2021:
మొదటి ఉత్తమ చిత్రం – ఆర్ ఆర్ ఆర్
రెండవ ఉత్తమ చిత్రం – అఖండ
మూడవ ఉత్తమ చిత్రం – ఉప్పెన

2022 :
మొదటి ఉత్తమ చిత్రం – సీతారామం
రెండవ ఉత్తమ చిత్రం – కార్తికేయ 2
మూడవ ఉత్తమ చిత్రం – మేజర్

2023:
మొదటి ఉత్తమ చిత్రం – బలగం
రెండవ ఉత్తమ చిత్రం – హనుమాన్
మూడవ ఉత్తమ చిత్రం – భగవంత్ కేసరి

ఇప్పుడు ఈ చిత్రాలలో నటించిన హీరో, హీరోయిన్లకు, ఈ చిత్రాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్లకు, నిర్మించిన నిర్మాతలకు కూడా గద్దర్ అవార్డ్స్ ఇవ్వనున్నట్లు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ప్రకటించారు..

 

ALSO READ:Thug Life Kamal Haasan : కమల్ నోటి దూల..తప్పదు మూల్యం.. ఎన్ని కోట్ల నష్టమంటే..?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×