BigTV English

Pooja Hegde: మరో ఐటెంసాంగ్ లో బుట్టబొమ్మ.. ఈసారి ఆ స్టార్ హీరోతో రొమాన్స్.. ?

Pooja Hegde: మరో ఐటెంసాంగ్ లో బుట్టబొమ్మ.. ఈసారి ఆ స్టార్ హీరోతో రొమాన్స్.. ?

Pooja Hegde: ఈమధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్..  పేరు వచ్చేది దేన్నీ వదలడం లేదు. హీరోయిన్ గా మాత్రమే కాకుండా క్యామియో అయినా.. ఐటెంసాంగ్ అయినా.. సపోర్టింగ్ రోల్ అయినా.. తమకు పేరు వస్తుంది అనుకుంటే  నిర్మొహమాటంగా చేసేస్తున్నారు. ఇక ఈ మధ్య ఐటెంసాంగ్స్ అన్ని స్టార్ హీరోయిన్సే చేస్తున్నారు. గతేడాది రిలీజ్ అయిన పుష్ప 2 సినిమాలో కిస్సిక్ అంటూ తన డ్యాన్స్ తో కుర్రాళ్లను కిర్రెక్కించింది శ్రీలీల. ఇక తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐటెంసాంగ్ అంటే తమన్నా ముందు ఉంటుంది. సినిమాలతో ఈ చిన్నది హిట్స్ అందుకోలేకపోయినా.. ఐటెంసాంగ్స్ తో మాత్రం ట్రెండింగ్ లో నిలుస్తుంది.


ఇక ఇప్పుడు టాలీవుడ్ ను ఏలుతున్న స్టార్స్ అందరూ కూడా స్టార్ హీరోల సినిమాలో ఐటెంసాంగ్స్ చేసినవారే. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే మరోసారి ఐటెంసాంగ్ లో చేయడానికి సై అందని టాక్ నడుస్తోంది.  ఇప్పటికే పూజా హెగ్డే.. రంగస్థలం సినిమా లో జిల్ జిల్ జిగేలు రాణి అంటూ ఓ రేంజ్ ఐటెంసాంగ్ లో ఆడిపాడింది. రామ్ చరణ్ – సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. పూజాకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత వెంకీ, వరుణ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఎఫ్ 3 లో కూడా అమ్మడు అదిరిపోయే సాంగ్ చేసి మెప్పించింది.

గత ఏడాది మొత్తం ఖాళీగా ఉన్న పూజా ఈ ఏడాది  వరుస సినిమాలను లైన్లో పెట్టింది. అవి కూడా పాన్ ఇండియా సినిమాలు. సూర్య సరసన రెట్రోలో నటిస్తోంది. ఇది కాకుండా విజయ్ నటిస్తున్న జన నాయగన్ లో హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసింది. ఇప్పటికీ విజయ్ – పూజా కాంబోలో బీస్ట్ వచ్చింది. ఈ సినిమా కూడా పరాజయాన్ని అందుకుంది. కానీ, ఈసారి వీరి కాంబో మాత్రం అస్సలు డిజప్పాయింట్ చేయదని  టాక్ నడుస్తోంది.


Pawan Kalyan: మహాకుంభమేళాలో పవన్ పవిత్ర స్నానం.. భార్య, కొడుకుతో కలిసి

ఇక ఈ నేపథ్యంలోనే పూజా గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ చిన్నది మరొకసారి ఐటెంభామగా మారనుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న చిత్రాల్లో కూలీ ఒకటి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతి హాసన్, అక్కినేని నాగార్జున కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా  ఈ ఏడాదిలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం కూలీలో పూజా హెగ్డే  ఐటెంసాంగ్ లో ఆడిపాడనుందని తెలుస్తోంది.

శృతి హాసన్ ఉన్నా కూడా ఆమె పాత్ర కీలకం కాబట్టి.. ఆమెతో కాకుండా యంగ్ బ్యూటీతో  ఐటెంసాంగ్ చేయించాలని అనుకున్నారట. ఆ సమయంలోనే పూజా అయితే బావుంటుంది అనుకోని ఆమెను సంప్రదించగా.. ఆమె కు ఓకే చెప్పిందని సమాచారం. అనిరుధ్ – రజినీ కాంబోలో సాంగ్స్, మ్యూజిక్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జైలర్ లో రజినీ స్టైల్ .. తమన్నా  అందాలు.. అనిరుధ్ మ్యూజిక్ వెరసి నువ్వు  కావాలయ్యా  సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అందుకుందో అందరికీ తెల్సిందే.

ఇక ఇప్పుడు కూలీ  కోసం పూజాపాపను రంగంలోకి దించాడు లోకేష్.  ఈ సాంగ్ లో కేవలం రజినీ మాత్రమే కాకుండా నాగార్జున, ఉపేంద్ర.. అందరూ  కనిపిస్తారట. అందుకే ఈ సాంగ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది  తెలియాలంటే అధికారికంగా  ప్రకటించేవరకు ఆగాల్సిందే.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×