BigTV English

Vaibhav Suryavanshi : టెస్ట్ సిరీస్ కంటే ముందు… ఇంగ్లాండ్ ను వణికిస్తున్న 14 ఏళ్ల కుర్రాడు

Vaibhav Suryavanshi : టెస్ట్ సిరీస్ కంటే ముందు… ఇంగ్లాండ్ ను వణికిస్తున్న 14 ఏళ్ల కుర్రాడు

Vaibhav Suryavanshi :  రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఈ ఐపీఎల్ సీజన్ లో వైభవ్ సూర్యవంశీ ఆరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇతను ఓపెనర్ గా వచ్చాడు. మొదటి బంతినే సిక్స్ గా మలచడం విశేషం. దీంతో వైభవ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే వైభవ్ గురించి  ఇంగ్లాండ్ అండర్-19 జట్టు గజ గజ వణికిపోవడం విశేషం. ఇతను ఐపీఎల్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆఢటంతో ఇంగ్లండ్ జట్టు పై ఏవిధంగా ఆడుతాడోనని ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ఒక్కసారిగా భయం పట్టుకోవడం విశేషం. వైభవ్ ఇన్నింగ్స్ ఇలాగే కొనసాగితే.. టీమిండియాకి అన్ని టీమ్స్ కచ్చితంగా భయపడాల్సిందే.


Also Read :  Ravichandran Ashwin : అశ్విన్ కు ఇంత బలుపా.. గ్లౌజులు తీసి రచ్చ రచ్చ

భారత క్రికెట్ భవిష్యత్ గా పిలుచుకునే 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నారు. 35 బంతుల్లోనే సెంచరీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరపున అరంగేట్రం చేసిన ఈ యువ ఎడమ చేతి వాటం ఓపెనర్ ఇప్పుడు ఇంగ్లండ్ టూర్ కి ముందు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో జరుగుతున్న అండర్ -19 క్యాంపులో బౌలర్లను చిత్తు చేస్తున్నాడు. ఇంగ్లండ్ లో జరుగనున్న సిరీస్ లో కూడా బౌలర్ల పై విపరీతంగా దాడి చేయబోతున్నాడని అద్భుతమైన ఫామ్ ను బట్టి స్పష్టమైంది. ఐపీఎల్ లో తన పేలవ బ్యాటింగ్ తో అందరి హృదయాలను గెలుచుకున్నాడు వైభవ్.. ప్రస్తుతం అండర్-19 జట్టులో కూడా చేరాడు. ప్రస్తుతం భఆరత అండర్ -19 జట్టు శిబిరం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో జరుగుతుంది. మొత్తం జట్టు రాబోయే ఇంగ్లాండ్ పర్యటన కోసం ప్రాక్టీస్ లో నిమగ్నమై ఉంది.


ఇంగ్లండ్ అండర్ 19 జట్టుతో 5 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సిన భారత అండర్ -19 జట్టు ఈ నెలాఖరులోపు ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరనుంది.  ఈ సిరీస్ లో తొలి వన్డే మ్యాచ్ జూన్ 27న హోవ్ లోని కౌంటీ గ్రౌండ్ లో జరుగనుంది. ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోలో వైభవ్ భారీ సిక్స్ లు కొట్టడం విశేషం. అతను ఇంగ్లాండ్  టూర్ కి పూర్తిగా సిద్ధం అయ్యాడని రుజువు అయింది. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ ఆరంగేట్రం చేశాడు. ఏప్రిల్ 19 2025న జైపూర్ లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ కి వ్యతిరేకంగా చేశాడు. ఈ మ్యాచ్ లో తొలి బంతికే సిక్స్ కొట్టి తన ఐపీఎల్ కెరీర్ ను ప్రారంభించాడు. అలాగే ఏప్రిల్ 28న సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. టీ-20 చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన భారత బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఇన్నింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ కేవలం 15.5 ఓవర్లలోనే 210 పరుగల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున 206.55 స్ట్రైక్ రేట్ తో వైభవ్ 7 మ్యాచ్ ల్లో మొత్తం 252 పరుగులు చేశాడు. వైభవ్ కి సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కూడా లభించడం విశేషం.

 

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×