BigTV English

Manoj VS Mohan Babu: ఖబడ్దార్… నేను ఒక్కడిని చాలు మీకు… మోహన్ బాబుకి మనోజ్ వార్నింగ్..!

Manoj VS Mohan Babu: ఖబడ్దార్… నేను ఒక్కడిని చాలు మీకు… మోహన్ బాబుకి మనోజ్ వార్నింగ్..!

Manoj VS Mohan Babu: గత కొన్ని నెలలుగా మంచు కుటుంబంలో వివాదాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.సినీ ఇండస్ట్రీలో అతిపెద్ద కుటుంబంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ కుటుంబంలో ఆస్తుల కలహాలు పరువు పోయేలా ఉన్నాయని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. గత ఏడాది ఎండింగ్ మొత్తం వీరి గురించే చర్చలు జరిగాయి. ఇకపోతే జర్నలిస్టుల దాడిలో బెయిల్ కోసం మోహన్ బాబు (Mohan Babu) హైకోర్టులో పిటిషన్ వేస్తే.. హైకోర్టు కొట్టి వేసింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబుకు నాలుగు వారాల పాటూ విచారణను వాయిదా వేస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు మోహన్ బాబు.


మనోజ్ కి నోటీసులు ఇచ్చిన పోలీసులు..

అయితే తాజాగా సంక్రాంతి సందర్భంగా మోహన్ బాబు, తన కుటుంబంతో కలిసి తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీలో ఘనంగా సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నా…ఈరోజు తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద అనూహ్యంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అసలు విషయంలోకి వెళ్తే.. మంచు మనోజ్ (Manchu Manoj) తన భార్య మౌనిక (Mounika Reddy)తో కలిసి ర్యాలీ నిర్వహించుకుంటూ రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి మోహన్ బాబు యూనివర్సిటీకి రాబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే మంచు మనోజ్ కూడా మొదట నారావారి పల్లెలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇంటికి వెళ్లి, ఆయనను కలిసి ఆ తర్వాత మంత్రి లోకేష్ (Lokesh)ను కలిసి తిరిగి యూనివర్సిటీ వద్దకు బయల్దేరారు. దీంతో మోహన్ బాబు వద్దకు మనోజ్ రాబోతుండడంతో అప్రమత్తమైన పోలీసులు ఏకంగా 100 మంది మోహన్ బాబు నివాసం వద్ద అలాగే యూనివర్సిటీ వద్ద మోహరించారు. ఏ సమయంలో అయినా గొడవ జరగవచ్చని భావించిన పోలీసులు ముందుగానే మనోజ్ కి నోటీసులు పంపించారు. మోహన్ బాబు యూనివర్సిటీకి రావడానికి అనుమతులను నిరాకరిస్తూ నోటీసులు ఇవ్వడం జరిగింది.


మోహన్ బాబుకు మాస్ వార్నింగ్ ఇచ్చిన మంచు మనోజ్..

దీంతో యూనివర్సిటీ వరకు వచ్చిన మంచు మనోజ్ బయటే.. తనకు కావాల్సిన వారితో ఆలింగనం చేసి ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి మోహన్ బాబుని ఉద్దేశిస్తూ.. “ఖబడ్దార్.. నేనొక్కడినే చాలు” అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే, తాజాగా మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. “మా అన్న మంచు ప్రసాద్ సమాధికి దండం పెట్టుకొని, మనసులో వారిని ప్రార్థించుకొని, అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? అని నాకు నేనే ప్రశ్నించుకున్నాను. నాకు సమాధానం దొరికే వరకు నేను దీనిని వదిలిపెట్టను. ఈ కాలేజీలో చదువుకుంటున్న స్టూడెంట్స్ కోసం, లోకల్ ప్రజల కోసం అలాగే ఈ ప్రైవేట్ హాస్టల్స్ మీద జరుగుతున్న అన్యాయాలను ఎదిరిస్తూ ఒక మెసేజ్ చేశాను. అయితే దీనికి విరుద్ధంగా హైదరాబాద్లో ఉన్న నాపై, నా పిల్లలపై దాడి చేయడం, అలాగే మా అమ్మ పుట్టినరోజు నాడు వచ్చి చక్కెర పోయడం, ఆ తర్వాత నేను ఆళ్లగడ్డకు వెళ్ళిన తర్వాత మా అమ్మ బ్రెయిన్ వాష్ చేసి సైన్ పెట్టించుకోవడం ఇలా అన్నీ చేశారు. ముఖ్యంగా ఆమెకు ఏం తెలుస్తుంది? ఆవిడ చాలా మంచి వ్యక్తి. ఏదైనా పట్టుకొని వెళ్లి సాయం చేయమంటే పాపం చేసేస్తారు. ఇలా వరుసగా నాపై దాడులు చేస్తున్నారు. ఇది ఎంతవరకు దిగజారింది అంటే, ఫ్యాన్స్ ఎంతో కష్టపడి, భారీ ఖర్చు పెట్టి మా ఫొటోస్ పెట్టుకుని వెల్కమ్ చెబుతుంటే.. దాడి జరిగిందని వారు నాకు 13వ తేదీ రాత్రి ఫోన్ చేసి చెప్పారు. దాంతో నేను గొడవ ఎందుకు.. మనవాళ్లే కదా సర్దుకు పోదామని చెప్పాను. పండుగ పూట అందరూ సంతోషంగా ఉండండి అని కూడా చెప్పాను. మళ్లీ మరుసటి రోజు మేము వస్తున్నామని తెలియడంతో ఫోటోలు వేశారు. ఈరోజు ఒక ట్రాక్టర్ పెట్టుకొని దాదాపు 40 మంది ఎక్కడెక్కడో ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు. అయితే వారంతా నన్ను చూసి పారిపోయారు. పోలీస్ లాఠీలను రౌడీలు పట్టుకొని రోడ్డుపైన వెళ్తున్నారు. కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి కదా.. ముఖ్యంగా యూనివర్సిటీకి గొప్ప గొప్ప సెక్యూరిటీ ఉంది.ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు. వీళ్లంతా కాకుండా రౌడీలు ఎందుకు అక్కడ ఉన్నారు. ఈరోజు పోలీస్ శాఖ వారు చెప్పారు కాబట్టి మర్యాదపూర్వకంగా వెనక్కి వెళ్తున్నాను. అంతేకాదు ఆ బౌన్సర్స్ ని, రౌడీలని ఎదుర్కోవడానికి నేను ఒక్కడిని చాలు.. రమ్మనండి.. ఇప్పటికైనా అర్థమయిందా..నేను ఇక్కడికి గొడవకు రాలేదు.. తక్షణమే వారిని తీసేయండి” అంటూ మోహన్ బాబుకు మాస్ వార్నింగ్ ఇచ్చారు మంచు మనోజ్.

 

Related News

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Big Stories

×