KTR: తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ రేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో ఎలాంటి నిబంధనలు పాటించకుండా రూ.55కోట్లు ఎలా బదలీ చేస్తారనే ఆరోపణలు ప్రధానంగా ఆయన ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు.
ఈ-కార్ రేసింగ్ లో వివాదాస్పదంగా మారిన విదేశీ సంస్థకు నగదు చెల్లింపులపై ప్రధానంగా దర్యాప్తు జరగనుంది. హెచ్ఎండీఏ బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐ అనుమతి లేకుండానే రూ.55కోట్లు చెల్లింపులు ఎలా జరిగాయనేది ప్రధానం అంశం. ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్‌పై ఒప్పందం 2022 అక్టోబర్ 25న ఒప్పందం కుదిరింది. ఫార్ములా-ఈ ఆపరేషన్స్, ఏస్ నెక్ట్స్ జెన్, పురపాలక శాఖలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 9,10,11,12వ సీజన్ల కార్ రేస్ లు హైదరాబాద్ లో నిర్వహించేలా ఒప్పందం జరిగింది. 2023 ఫిబ్రవరి 10,11 తేదీల్లో నెక్లెస్ రోడ్డులో తొమ్మిదో సీజన్ నిర్వహించిన విషయం తెలిసిందే.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులోని వివరాలను ఏసీబీ ఇప్పటికే ఈడీ అందజేసింది. ఈ కేసుకు సంబంధించి ఆర్థికశాఖ రికార్డులు, హెచ్ఎండీఏ చెల్లింపుల వివరాలు, హెచ్ఎండీఏ చేసుకున్న ఒప్పంద పత్రాలతో పాటు ఎఫ్ఐఆర్‌ను ఈడీకి ఏసీబీ అందజేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్‌ను జనవరి 9న విచారించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన ఏసీబీ తన విచారణలో నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ-కారు రేసింగ్‌కు నిధుల చెల్లింపునకు అనుమతులు ఎవరు ఇచ్చారు..? నిధులు ఎక్కడికి చేరాయి..? ఎవరెవరి చేతులు మారాయో? అన్న కోణంలో కేటీఆర్ విచారించినట్లు తెలుస్తోంది.
అయితే దీనికి కేటీఆర్ మాత్రం.. స్పందిస్తూ ఈ కారు రేసులో ఎలాంటి కుంభకోణం జరగలేదని.. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. నిజాయితీగా ఉన్నానని చెప్పుకొచ్చారు. కేటీఆర్ రేపు ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఈ నెల 16న రెండోసారి విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ పాటించుకుండా రూ.55 కోట్ల బదిలీలు జరిగినట్లు ఏసీబీ పేర్కొంది.
ఇప్పటికే ఏ2గా ఉన్న అరవింద్ కుమార్, ఏ3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది. వారిద్దరి స్టేట్ మెంట్ ఆధారంగా రేపు ఈడీ కేటీఆర్‌ను విచారించనుంది. కేటీఆర్ ఆదేశాలతోనే నగదు బదిలీ చేశామని వీరు ఈడీ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రేపు కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు.
రూల్స్ పాటించకుండా నగదు ఎలా బదిలీ చేస్తారని కేటీఆర్‌ను ముఖ్యంగా ఈడీ ప్రశ్నించనుంది. గురువారం ఉదయం 10:30 గంటలకు బషీర్ బాగ్‌లో ఈడీ కార్యాలయంలో కేటీఆర్ విచారించనున్నారు.
Also Read: Entrance Exams: స్టూడెంట్స్‌కు ఇది బిగ్ అలర్ట్.. ప్రవేశ పరీక్ష తేదీల షెడ్యూల్ రిలీజ్
హెచ్ఎండీఏ బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐ అనుమతి లేకుండానే రూ.55కోట్లు చెల్లింపులు ఎలా బదిలీ చేశారని అనే ప్రశ్నలను ముఖ్యంగా ఈడీ అధికారులు అడగనున్నారు. ఫెమా, మనీలాండరింగ్ గురించి కూడా కేటీఆర్ ఈడీ అధికారులు నిలదీయనున్నారు. అయితే ఏసీబీ మరోసారి కేటీఆర్ విచారించనున్నట్లు తెలుస్తోంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ విషయంలో ఏసీబీ, ఈడీలు కేటీఆర్‌ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.