Bigg Boss 8 Analysis: బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా వచ్చి తానేంటో అందరికీ తెలిసేలా చేశాడు గౌతమ్ కృష్ణ. అప్పట్లో తను ఒక సినిమాలో హీరోగా నటించినా కూడా తనెవరో చాలామంది ప్రేక్షకులకు తెలియదు. కానీ బిగ్ బాస్ 7 తర్వాత కంటెస్టెంట్‌గానే అందరికీ గుర్తుండిపోయాడు. ఆ సీజన్‌తో అంత పాపులారిటీ సంపాదించుకున్నా కూడా బిగ్ బాస్ 8లోకి మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టాడు. ఆ సీజన్‌లో ఏ స్ట్రాటజీ అయితే ఉపయోగించాడో ఈ సీజన్‌లో కూడా అదే స్ట్రాటజీతో ఆడడం మొదలుపెట్టాడు. మరి తన సత్తాతో టాప్ 5కు చేరుకున్న గౌతమ్.. విన్నర్ అవ్వగలడా? తనకు ఎంత ఛాన్స్ ఉంది?
పట్టువదలని విక్రమార్కుడు
ఏ టాస్క్ అయినా పట్టు వదలని విక్రమార్కుడిగా ఆడి చూపిస్తాడు గౌతమ్. గెలిచినా ఓడినా తన ఆటతీరు మాత్రం అందరూ గుర్తుపెట్టుకునేలా చేస్తాడు. అదే తనలో పెద్ద ప్లస్. బిగ్ బాస్‌లో చాలామంది కంటెస్టెంట్స్ తాము ఓడిపోతే అస్సలు తట్టుకోలేరు. దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. కానీ గౌతమ్ అలా కాదు. తనకు వచ్చే ప్రతీ అవకాశాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని అనుకుంటాడు. చాలావరకు తను కూల్‌గానే ఉండడానికి ప్రయత్నిస్తాడు. ఫ్రెండ్‌షిప్స్ పెట్టుకొని, దాని వల్ల తన గేమ్ ఎఫెక్ట్ అవ్వకుండా చివరి వరకు కాపాడుకుంటూ వచ్చాడు గౌతమ్. ఇప్పటికీ తనకు బిగ్ బాస్ హౌస్‌లో క్లోజ్ ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరు. తన గెలుపుకు అయినా, ఓటమికి అయినా తనే కారణం అనుకుంటాడు.
Also Read: నబీల్‌కు గెలుపు శాతం ఎంతంటే.?
సోలో బాయ్
తాను సోలో బాయ్ అని చెప్పుకుంటూ ప్రేక్షకుల దగ్గర గౌతమ్ సింపథీ గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా అని చాలాసార్లు అనుమానం వచ్చేలా గౌతమ్ ప్రవర్తన ఉంటుంది. ఫ్రెండ్‌షిప్స్ పెట్టుకుంటే గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అనే ఆలోచన తనను చాలాసార్లు వెనక్కి లాగేసింది. తనకు ఫ్రెండ్స్ లేకపోయినా.. వేరే కంటెస్టెంట్స్‌కు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, వారికి సపోర్ట్ దక్కినప్పుడు గౌతమ్ తట్టుకోలేకపోయాడు. దానివల్లే పలువురు కంటెస్టెంట్స్‌తో తనకు గొడవలు కూడా అయ్యాయి. ఎవ్వరితో కలవలేకపోవడమే గౌతమ్‌కు పెద్ద మైనస్‌గా మారింది. అంతే కాకుండా కొన్ని సందర్భాల్లో కోపంలో గౌతమ్ వదిలేసిన మాటలు పెద్ద కాంట్రవర్సీని కూడా క్రియేట్ చేశాయి.
ఆ టాస్కులో విశ్వరూపం
టాస్కుల విషయంలో గౌతమ్ చాలావరకు తన బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నించాడు. ముఖ్యంగా తను ఆడిన ఆటల్లో చాలామందికి గుర్తుండిపోయేది మెగా చీఫ్ టాస్క్. తను మెగా చీఫ్ అయిన టాస్క్‌ను చాలామంది బిగ్ బాస్ ప్రేక్షకులు మర్చిపోలేరు. ఆరోజు కంటెస్టెంట్స్ అందరినీ క్లీన్ స్వీప్ చేసి మెగా చీఫ్ స్థానాన్ని గెలుచుకున్నాడు గౌతమ్. ఇటీవల ఓటు అప్పీల్ కోసం జరిగిన కలర్స్ టాస్క్‌లో కూడా తను బాగానే ఆడినా నిఖిల్‌తో జరిగిన గొడవ మాత్రమే అక్కడ హైలెట్ అయ్యింది. గౌతమ్ కంటెస్టెంట్స్ అందరితో మాత్రమే కాకుండా ప్రేక్షకులతో కూడా ఫ్రెండ్లీగా ఉంటూ ఎంటర్‌టైన్ చేసుంటే తను కచ్చితంగా విన్నర్ అయ్యేవాడు. కానీ అలా జరగలేదు కాబట్టి తను బిగ్ బాస్ సీజన్ 8లో టాప్ 3 స్థానాన్ని గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.