BigTV English

Mohan babu: విదేశాలలో ఉన్నాను.. గురుచరణ్ చివరి చూపు దక్కించుకోలేకపోతున్నాను.. మోహన్ బాబు

Mohan babu: విదేశాలలో ఉన్నాను.. గురుచరణ్ చివరి చూపు దక్కించుకోలేకపోతున్నాను.. మోహన్ బాబు

Manchu Mohan babu tribute to lyricist Gurucharan : దాదాపు రెండు వందలకు పైగా పాటలు రాసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పది కాలాలపాటు గుర్తుండిపోయే పాటలు రాసిన గీత రచయిత గురుచరణ్ గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రముఖ గీత రచయిత ఆచార్య అత్రేయ వద్ద శిష్యరికం చేసిన గురుచరణ్ అంటే విలక్షణ నటుడు మోహన్ బాబుకు ఎంతో అభిమాన లిరికిస్ట్. ఎందుకంటే ఆయన సినిమాలకు అద్భుతమైన లిరిక్స్ అందించారు గురుచరణ్.


కనీసం ఒక్క పాటైనా..

మోహన్ బాబు తన సినిమాలో కనీసం ఒక పాటైనా గురుచరణ్ గీతం ఉండేలా చూసుకునేవారు. గురుచరణ్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ మోహన్ బాబు మీద అభిమానంతో ఒప్పుకునేవారు. అల్లుడుగారు మూవీలో రమ్యకృష్ణతో కలిసి మోహన్ బాబుపై చిత్రీకరించిన ముద్ద బంతి పువ్వులో మూగ బాసలు పాట ఎంతటి పాపులార్ అయిందో తెలిసిందే. మరో ఇరవై ఏళ్లయినా ఈ పాట జనం గుండెల్లో మార్మోగుతునే ఉంటుంది. మెలోడీ అంటే ఇలాగే ఉండాలని ప్రేక్షకులు ఈ పాటకు ఫిదా అయ్యారు. ఆ సాంగ్ ని జేసుదాస్ ఎంతో రాగయుక్తంతో పాడారు. అలాగే రౌడీగారి పెళ్లాం మూవీలో కుంతీ కుమారి తన కాలు జారి అనే పాటను కూడా గురుచరణ్ లిరిక్స్ తో జేసుదాస్ గానాలాపనతో ఆ సినిమా హిట్ కావడానికి ఈ పాట కూడా కారణమయింది.


సెంటిమెంట్ రైటర్

గురుచరణ్ అసలు పేరు రాజేంద్ర ప్రసాద్. ఒకప్పటి ప్రముఖ నటి ఎం.ఆర్.తిలకం, దర్శకుడు అప్పారావుల కుమారుడే ఈ గురుచరణ్. అయినా వారసత్వాన్ని ఏనాడూ ఉపయోగించుకోని గురుచరణ్ తన ఓన్ ట్యాలెంట్ తో సినీ రంగంలో నిలదొక్కుకున్నారు. మోహన్ బాబు తన ప్రతి సినిమాలోనూ జేసుదాసు స్వరం, గురుచరణ్ లిరిక్ తప్పకుండా ఉండేలా చూసుకునేవారు. అదే ఆయనకు హిట్ సెంటిమెంట్ గా మారింది. మోహన్ బాబు తన లక్ష్మీ ప్రసన్న బ్యానర్ పై నిర్మించిన దాదాపు పది సినిమాలకు పైగా గురుచరణ్ బాణీలు కట్టారు. బ్రహ్మ, రౌడీగారి పెళ్లాం, అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు ప్రత్యేకంగా గురుచరణ్ తో పాటలు రాయించుకున్నారు మోహన్ బాబు. తన కు అత్యంత పేరు తెచ్చిపెట్టిన..అత్యంత ఆప్తుడైన గురుచరణ్ మరణం మోహన్ బాబును కలచివేసింది. ఈ సందర్భంగా తాను విదేశాలలో ఉన్నందున తన ఆప్తమిత్రుడు గురుచరణ్ చివరి చూపు దక్కించుకోలేకపోయానని మోహన్ బాబు తన ఆవేదన వ్యక్తం చేశారు. తనని క్షమించాలని..ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి కలిగిన వేదనకు చింతిస్తున్నానని అని ట్విట్టర్ లో స్పందించారు మోహన్ బాబు. గురుచరణ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

ఆచార్య ఆత్రేయ షేడ్స్..

తెలుగు సినీ రంగంలో దాదాపు అన్ని జోనర్స్ లో పాటలు రాశారు గురుచరణ్. ఎంతో మందికి ఇష్టుడుగా..ఎప్పుడూ ఏ వివాదంలోనూ ఉండని గురుచరణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ప్రత్యేకంగా ఆయన గీతాలతో సమకూర్చిన క్యాసెట్స్ కూడా చేయించుకునేవారు సంగీత ప్రియులు. ఇక ఆయన లిరిక్స్ కి పర్ఫెక్ట్ న్యాయం చేసే గాయకుడు జేసుదాస్ అనే చెప్పాలి. భావయుక్తంగా పాటలు రాయడంలో గురుచరణ్ తన గురువు ఆచార్య ఆత్రేయనే ఎక్కువగా ఫాలో అయ్యేవారు. ఆత్రేయ కూడా మనసు కు సంబంధించిన పాటలు రాయడంలో పాపులర్. గురుచరణ్ గీతాలలో కూడా మనకు ఆ ఛాయలు కనిపిస్తాయి. మర్మగర్భంగా ఆయన విషాధ గీతాలు అచ్చంగా ఆచార్య ఆత్రేయనే తలపిస్తాయి. ఇలాంటి లిరికిస్ట్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికిన ఆణిముత్యం అని చాలా సందర్భాలలో మోహన్ బాబు పబ్లిక్ ఫంక్షన్లలో గురుచరణ్ గురించి చాలా గొప్పగా చెప్పడం విశేషం.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×