BigTV English

Mohan Babu : అజ్ఞాతంలోకి మోహన్ బాబు.. సేమ్ సీన్ రిపీట్..

Mohan Babu : అజ్ఞాతంలోకి మోహన్ బాబు.. సేమ్ సీన్ రిపీట్..

Mohan Babu : గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య ఆస్తి ఫైట్ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు కాపాడుకుంటూ వస్తున్న గౌరవ మర్యాదలు ఈ గొడవలతో పోయాయి. మోహన్ బాబు పై మనోజ్ కేసు పెట్టడమే కాదు. గొడవలు కూడా జరిగిన విషయం తెలిసిందే. ఈ గొడవలను కవరేజ్ చెయ్యడానికి ఇంటికి వచ్చిన మీడియా పై మోహన్ బాబు దాడి చెయ్యడంతో ఆయన అడ్డంగా ఇరుకున్నాడు. ఆ జర్నలిస్ట్ ఆసుపత్రి బెడ్ పై ఉన్నాడు. ఇక మోహన్ బాబు జర్నలిస్ట్ లపై దాడి చేయడంతో ఆయనపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదైంది.. పోలీసులు ఈ నెల 24 వరకు టైం ఇచ్చారు. అయితే మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం కోర్టు మెట్లేక్కాడు. అక్కడ నిరాశ ఎదురైంది. దాంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలియడం లేదనే వార్త ప్రచారంలో ఉంది.


జర్నలిస్ట్ పై జరిగిన దాడిని నిరసిస్తూ జర్నలిస్ట్ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఆవేశంలో కొట్టానని మోహన్ బాబు మీడియాను క్షమాపణలు అడిగారు. అంతేకాదు గాయపడిన జర్నలిస్ట్ ను హాస్పిటల్ వెళ్లి కలిశారు. కానీ జర్నలిస్ట్ సంఘాలు మాత్రం పోలీస్ కేసు వాపసు తీసుకోలేదు. దీంతో ఆయన కేసు కోసం ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. మోహన్ బాబు ఇటీవలే ముందస్తు బెయిల్ కోసం ట్రై చేయగా, కోర్టు నిరాకరించింది. అయితే తాజాగా మరోసారి విచారణ జరగగా, కోర్టులో బాధితుల తరపు న్యాయవాది అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టడంతోనే మోహన్ బాబు జర్నలిస్ట్ హాస్పిటల్ లో కలిశారని అన్నారు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగల వ్యక్తి కాబట్టి మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని వాదించినట్టుగా తెలుస్తోంది.. దాంతో కోర్టు ఆయన ఫిటిషన్ ను కొట్టిపడేసింది. దాంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై మోహన్ బాబు స్పందించారు. నేను నా ఇంట్లోనే ఉన్నానని ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది.

మళ్లీ అజ్ఞాతంలోకి మోహన్ బాబు..


మోహన్ బాబు మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లారు… 

నిన్న హైకోర్టు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ జరిగింది. సోమవారం వరకు అరెస్టు చేయొద్దంటూ మోహన్ బాబు తరపు న్యాయవాది వాధించారు. అయితే ఏ క్షణమైనా మోహన్ బాబును అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దీంతో మోహన్ బాబు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. తనపై నమోదైన కేసు దృష్ట్యా బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించిన మోహన్ బాబు.. ఏ క్షణమైనా పోలీసులు అరెస్ట్‌ చేస్తారనే భయంతో అజ్ఞాతంలోకి వెళ్లారు.. డిసెంబర్ 16 మంగళవారం న హైదరాబాద్ నుంచి చంద్రగిరికి మోహన్ బాబు చేరుకున్నారు. బుధవారం సాయంత్రం శ్రీ విద్యానికేతన్ నుంచి ఆయన వెళ్లిపోయారు. కలెక్షన్ కింగ్ బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.. దీనిపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు తన దగ్గర ఉన్న రెండు గన్ లను ఇప్పటికే పోలీసులకు అప్పగించారు. ఇక అరెస్ట్ అవుతాననే భయంతో మోహన్ బాబు పరారీలో ఉన్నారు. మరి నిజంగా మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్ళారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. పోలీసులు ప్రస్తుతం ఆయన కోసం గాలిస్తున్నట్లు సమాచారం..

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×