Virat Kohli: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లకి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం తెలిసిందే. వారి ప్రేమ క్రికెట్ మైదానంలో స్పష్టంగా కనిపిస్తుంది. కోహ్లీ- అనుష్క శర్మ అత్యంత పాపులర్ జంటలలో ఒకరు. అనుష్క శర్మ ఓ బాలీవుడ్ స్టార్ నటి అన్న విషయం అందరికీ తెలిసిందే. 2017 డిసెంబరులో బాలీవుడ్ నటి అనుష్క శర్మను కోహ్లీ {Virat Kohli} వివాహం చేసుకున్నాడు. ఈ జంటకి వామిక అనే కూతురు, అకాయ్ అనే కొడుకు ఉన్నారు. ఇక విరాట్ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతోను తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు.
Also Read: Imran Khan – Jasprit Bumrah: బుమ్రా బౌలింగ్ లో ఇప్పటి వరకు..ఏ ప్లేయర్ కూడా సిక్సు కొట్టలేదు ?
కోహ్లీకి లండన్ అంటే చాలా ఇష్టం. తరచూ విరుష్క జంట లండన్ కి వెళుతుంటారు. లండన్ లో వీరు ఓ ఇల్లు కూడా కొనుక్కున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా కోహ్లీ {Virat Kohli} చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కోహ్లీ భారత్ ని విడిచి వెళ్ళనున్నారట. భార్యా పిల్లలతో కలిసి త్వరలోనే లండన్ లో స్థిరపడతాడని, రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తన మిగిలిన జీవితాన్ని లండన్ లో గడపాలనుకుంటున్నాడని విరాట్ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ వెల్లడించారు.
కోహ్లీ {Virat Kohli} కుమారుడు అకాయ్ 2024 ఫిబ్రవరి 15న లండన్ లోనే జన్మించాడు. విరుష్క జంట కూడా ఈ ఏడాదిలో ఎక్కువగా లండన్ లోనే గడిపింది. అంతేకాదు లండన్ లో కోహ్లీకి ఆస్తులు కూడా ఉన్నాయట. ఈ నేపథ్యంలోనే రిటైర్మెంట్ అనంతరం తన పిల్లలతో కలిసి లండన్ లో సెటిల్ కావాలని కోహ్లీ భావిస్తున్నాడని రాజకుమార్ శర్మ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం విరాట్ చాలా ఫీట్ గా ఉన్నాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతని రిటైర్మెంట్ గురించి ఆలోచించే అవసరం లేదని.. అతను 2027 ప్రపంచ కప్ వరకు ఆడతాడని తెలిపాడు.
Also Read: Imam Ul Haq: ఇండియాలో నరకం చూశాం…బెడ్ రూం నుంచి బయటకు పంపలేదు !
ఆస్ట్రేలియా తో జరిగిన తొలి టెస్ట్ లో సెంచరీ చేశాడని.. మిగిలిన రెండు మ్యాచ్ లలో {Virat Kohli} మరో రెండు సెంచరీలు చేస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. విరాట్ లో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని పేర్కొన్నాడు. విరాట్ క్లిష్ట పరిస్థితులలో కూడా అద్భుతంగా రాణించి జట్టుని విజయ పదంలో నడిపించగలడని అన్నాడు. కోహ్లీతో తనకు 26 ఏళ్లకు పైగా అనుబంధం ఉందని చెప్పుకొచ్చాడు. పదేళ్ల వయసు నుంచే కోహ్లీ తనకు తెలుసని పేర్కొన్నాడు రాజ్ కుమార్ శర్మ. దీంతో రాజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే తన కోచ్ చేసిన వ్యాఖ్యల పట్ల కోహ్లీ ఏ విధంగా స్పందిస్తాడన్నది వేచి చూడాలి.