BigTV English

Manchu Vishnu: ఐదేళ్లుగా నాకు సెటప్ ఉంది… ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు… ప్రభాస్ కి కూడా తెలుసా?

Manchu Vishnu: ఐదేళ్లుగా నాకు సెటప్ ఉంది… ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు… ప్రభాస్ కి కూడా తెలుసా?

Manchu Vishnu: మంచు విష్ణు (Manchu Vishnu)ప్రస్తుతం కన్నప్ప సినిమా(Kannappa) ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా అదే స్థాయిలో నిర్వహిస్తూ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తున్నారు. ఇక కన్నప్ప సినిమా చేయడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని విష్ణు తెలియజేస్తూ వచ్చారు. ఈ సినిమా కోసం దాదాపు పది సంవత్సరాల నుంచి తాను కష్టపడుతున్నానని విష్ణు తెలిపారు. ఎట్టకేలకు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైంది.


భోజన ప్రియుడు…

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్న మంచు విష్ణు తాజాగా ఒక విషయాన్ని బయట పెట్టారు. ఈ సినిమాలో ప్రభాస్ కూడా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇక ప్రభాస్ సినిమా షూటింగ్ లొకేషన్లో ఉన్నారు అంటే ఆయన అక్కడ ఉన్న వారందరికీ ఎలాంటి ఫుడ్ పెట్టిస్తారో అందరికీ తెలిసిందే. ప్రభాస్ మంచి భోజన ప్రియుడు మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న వారికి కూడా వివిధ రకాల ఆహార పదార్థాలను ప్రత్యేకంగా తయారు చేయించి తిన పెడుతూ ఉంటారు. ఇలా ప్రభాస్ పెట్టే ఫుడ్డు గురించి ఇప్పటికే ఎంతోమంది చాలా గొప్పగా చెప్పారు.


నాకు చెడు అలవాట్లు లేవు…

ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మంచు విష్ణుకు ఇదే ప్రశ్న ఎదురయింది. ప్రభాస్ గారు మంచి ఫుడ్ లవర్ మీరు ప్రభాస్ గారి కోసం విదేశాలలో ఎలాంటి వెరైటీస్ పెట్టించారా అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు విష్ణు సమాధానం చెబుతూ నిజానికి ప్రభాస్ కి సంబంధించిన సన్నివేశాలు అన్నీ కూడా ఇండియాలోనే చేసామని, విదేశాలలో షూటింగ్ చేయలేదని తెలిపారు. ఇక ప్రభాస్ షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెడితే తనకు ఏం కావాలో అక్కడే ఫ్రెష్ గా తయారు చేయించే వాళ్ళం. నేను గత ఐదు సంవత్సరాలుగా నాకంటూ ప్రత్యేకంగా కొంతమంది వంట వాళ్లను సెటప్ చేసుకున్నానని వాళ్ళు ఎక్కడికి వెళ్లినా నాతో పాటే ఉంటూ నాకు ఏమి కావాలో అవి వండి పెడతారని విష్ణు తెలిపారు. నాకు ఇతర చెడు అలవాట్లు ఏమీ లేవు కానీ ఫుడ్ అంటే చాలా ఇష్టంగా తింటానని అందుకే ఇలాంటి ఏర్పాట్లు చేసుకున్నానని తెలిపారు..

ఇక ప్రభాస్ షూటింగ్ లొకేషన్లో ఉన్నన్ని రోజులన్నీ ఆయనకు కావలసిన ఫుడ్ మొత్తం అక్కడే తయారు చేయించే వాళ్ళమని విష్ణు తెలిపారు. ఇక ప్రభాస్ ఈ సినిమాలో నటించడం గురించి కూడా విష్ణు మాట్లాడారు. ప్రభాస్ ఈ సినిమాలో నటించడం ఎంతో గొప్ప విషయం. ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ లాంటి గొప్ప నటుడు ఇతర సినిమాలలో నటించడం అంటే మామూలు విషయం కాదని తెలిపారు. అయితే ఈ సినిమా ప్రభాస్ నాకోసం అసలు నటించలేదు, నాన్న కోసమే ఈ సినిమాలో నటించారని విష్ణు తెలిపారు. ఇకపోతే నాన్నకు నాకంటే కూడా ప్రభాస్ అంటేనే చాలా ఇష్టం. ఈ విషయం ప్రభాస్ కి కూడా తెలుసు.. ఇక ప్రభాస్ కూడా నాన్ననే బాగా ఇష్టపడతారని విష్ణు ఈ సందర్భంగా తెలియజేశారు.. ఇక ప్రభాస్ మోహన్ బాబు ఇద్దరూ కూడా బుజ్జిగాడు సినిమాలో నటించారు. ఈ సినిమాలో మోహన్ బాబు త్రిషకు అన్నయ్యగా నటించగా ప్రభాస్ బావ బావ అంటూ పిలుస్తూ కనిపిస్తారు. ఇక ఈ సినిమా సమయం నుంచి మోహన్ బాబుని ఎక్కడ కలిసిన బావ అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×