Hyderabad News: జాబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాసేపటి క్రితమే కుటుంబ సభ్యులు ఆయనను గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర కీలక నేతలు, పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
గత కొన్ని రోజుల నుంచి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ మధ్యనే ఆయనకు ఒక కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత తరువాత ఆయన ఇన్ఫెక్షన్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ఆయన అనుచరులు భారీ చేరుకున్నారు.
కాగా.. ఇటీవల జరిగి బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా తెలంగాణ భవన్ ముందు భారీ కేసీఆర్ కటౌట్ ను ఎమ్మెల్యే గోపినాథ్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఆయన కటౌట్ ఓపెన్ చేయించారు.
ALSO READ: Konda Surekha : కొండా సురేఖకు అస్వస్థత.. కింద పడిపోయి..