BigTV English
Advertisement

Lakshmi Narasimha Re Release: రీ రిలీజ్ కోసం స్పెషల్ సాంగ్ ఏంటీ భయ్యా…. ఇలా కూడా ప్రమోట్ చేస్తున్నారా?

Lakshmi Narasimha Re Release: రీ రిలీజ్ కోసం స్పెషల్ సాంగ్ ఏంటీ భయ్యా…. ఇలా కూడా ప్రమోట్ చేస్తున్నారా?

Lakshmi Narasimha Re Release: టాలీవుడ్ ఇండస్ట్రీలో గత రెండు సంవత్సరాలుగా ఒక ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల కాలంలో టాలీవుడ్ హీరోలు తమ పుట్టినరోజు సందర్భంగా వారి కెరియర్ లో బ్లాక్ బస్టర్ సినిమాలను తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అందరి హీరోల సినిమాలు కూడా విడుదలవుతూ మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. తాజాగా బాలకృష్ణ (Balakrishna)సినిమా మరొకటి తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన లక్ష్మీనరసింహ(Lakshmi Narasimha) సినిమాని తిరిగి విడుదల చేయబోతున్నారు.


రీ రిలీజ్ కోసం సాంగ్…

నందమూరి బాలకృష్ణ జూన్ పదో తేదీ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇలా జూన్ 10వ తేదీ తన పుట్టిన రోజు(Birthday) కావడంతో రెండు రోజుల ముందు అంటే జూన్ 8వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతోంది. డైరెక్టర్ జయంత్ సీ పర్జానీ దర్శకత్వంలో బాలకృష్ణ ఆసిన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 2004వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళ చిత్రం సామి సినిమాకు రీమేక్ చిత్రంగా తెలుగులో లక్ష్మీనరసింహ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిందీలో కూడా ఐపీఎస్ పేరుతో రీమేక్ అయింది.


మందు తాగినోడు ఘనుడు…

ఇలా 21 సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మరోసారి 4k వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.. అయితే ఈ సినిమాలో ఎవరు ఊహించని విధంగా సరికొత్త పాటను జోడిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం. ఇలా రీ రిలీజ్ కోసమే ప్రత్యేకంగా పాటను విడుదల చేయబోతున్నడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఈ పాటను కూడా యూట్యూబ్ లో విడుదల చేయడంతో భారీ స్పందన లభిస్తుంది.

మంచినీళ్లు తాగినోడు మామూలోడు… మందు తాగినోడు ఘనుడు.. మరి మాన్షన్ హౌస్ తాగినోడు మహానుభావుడు అంటూ సాగిపోయే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది . ఈ పాటకు బీమ్స్ సంగీతం కుదుర్చుగా చంద్రబోస్ అద్భుతమైన లిరిక్ అందించారు. ఇక ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ పాట పై స్పందిస్తూ… బాలకృష్ణ ఇలా రీ రిలీజ్ సినిమాల ద్వారా కూడా తన బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇటీవల బాలయ్య మాన్షన్ హౌస్ డ్రింకింగ్ వాటర్ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ బ్రాండ్ ప్రమోట్ చేస్తూ పలు వీడియోలను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరోసారి తన సినిమా రీ రిలీజ్ సమయంలో మాన్షన్ హౌస్ తాగినోడు మహానుభావుడు అంటూ పాటను జోడించడంతో నేటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక బాలయ్య కెరియర్ విషయానికొస్తే ప్రస్తుతం ఈయన అఖండ 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×