Manchu Vishnu:ప్రస్తుతం మంచు విష్ణు (Manchu Vishnu) ‘మా'(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) కి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. త్వరలో ఆయన నటిస్తున్న కన్నప్ప సినిమా విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్న విష్ణు.. పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే మా అసోసియేషన్ తరఫున చేస్తున్న కొత్త అగ్రిమెంట్ గురించి కూడా తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిజానికీ ఈ మధ్యకాలంలో హీరోలు లేకుండానే బాడీ డబుల్స్, డూప్స్, AI వంటి కొత్త టెక్నాలజీలు ఉపయోగించి సినిమాలు చేస్తున్నారు. ఇందులో తప్పేమీ లేదు. ముఖ్యంగా హీరో ఫేస్ కరెక్ట్ గా స్క్రీన్ మీద కనిపించేంతవరకు కూడా ఇది తప్పు కాదు. పైగా బాడీ డబుల్స్, డూప్స్ ఉంటే చాలు షూటింగ్స్ కూడా త్వరగా అయిపోతున్నాయి.
‘మా’లో కొత్త రూల్స్..
ఇప్పుడు ఈ విషయంపైనే మంచు విష్ణు మాట్లాడుతూ.. “టెక్నాలజీ పెరిగిపోతోంది. అటు భవిష్యత్తులో ఈ టెక్నాలజీ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. హీరో లేకుండానే కేవలం ఆయన ఫేస్ వాడుకొని సినిమాలు చేసే స్థాయికి చేరుకుంటున్నారు. గతంలో చేసిన సినిమాల సీక్వెల్స్ ప్లాన్ చేస్తే.. ఆ హీరోల పర్మిషన్ లేకుండానే వాళ్ళ పేస్ లను కామియోగా కూడా వాడుకోవచ్చు. అలాంటి రోజులు కూడా వస్తాయి.”
“అందుకే నేను మా అసోసియేషన్ తరఫున నిర్మాతలకు, నటీనటులకు మధ్య ఒక కొత్త అగ్రిమెంట్ జరిగేలా ప్లాన్ చేస్తున్నాను. ఇకపై హీరోలు, నటీనటుల ప్రమేయం, పర్మిషన్ లేకుండా తమ ఫేస్ వాడడం, సీక్వెల్స్ చేయడం లాంటివి ఇకపై చేయకూడదు అని ఒక అగ్రిమెంట్ ను తీసుకురాబోతున్నాను. దీనివల్ల భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకూడదనే, ఈ అగ్రిమెంట్ చేయిస్తున్నాము” అంటూ మంచు విష్ణు తెలిపారు. మొత్తానికైతే మా అధ్యక్షుడు మంచు విష్ణు ‘మా’ లో తీసుకొస్తున్న ఈ కండిషన్ కాస్త లాభదాయకంగానే ఉండనుంది అని చెప్పవచ్చు.
కన్నప్ప మూవీ విశేషాలు..
ఇక మంచు విష్ణు కన్నప్ప మూవీ విషయానికి వస్తే.. జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మోహన్ బాబు(Mohan Babu), మంచు విష్ణు (Manchu Vishnu), మోహన్ లాల్(Mohan Lal), కాజల్ అగర్వాల్(Kajal Agarwal), అక్షయ్ కుమార్(Akshay Kumar), ప్రభాస్ (Prabhas) లాంటి భారీ తారాగణంతో తెరకెక్కబోతోంది ఈ సినిమా. అంతేకాదు మంచు విష్ణు ఇద్దరి కూతుర్లు అరియానా, వివియానాతో పాటు ఆయన కొడుకు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్, ఏవీఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మహాభారతం సీరియల్ ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ (Mukhesh kumar singh) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, జి నాగేశ్వర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, తోట ప్రసాద్ కథ అందించగా.. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అటు టీజర్ విషయంలో కూడా భారీ ట్రోల్స్ ఎదుర్కొంది ఈ సినిమా. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ALSO READ:Jayam Ravi – Kenisha: రెండో పెళ్లి చేసుకున్న జయం రవి.. సంచలనం సృష్టిస్తున్న ఫోటోలు!