Intinti Ramayanam Today Episode june 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. సుదర్శన్ కంపెనీ నుంచి ఇద్దరు వ్యక్తులు వస్తారు. అవని రాజేంద్రప్రసాద్ కి ఫోన్ చేసి ఆ కంపెనీ గురించి వివరాలను అడిగి తెలుసుకుంటుంది. ఈ డీల్ గురించి నేను చూస్తాను.. సైన్ చేస్తాను నువ్వు ఇంటికి తీసుకురా అనేసి రాజేంద్రప్రసాద్ అంటాడు.. దానికి అవని సరే మామయ్య నీ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకుంటుంది. అవని ఇంటికి వెళ్తుంటే మధ్యలో మెడికల్ షాప్ దగ్గర మందులు తీసుకోవాలని ఆగుతుంది. పల్లవి అవనిని ఇరికించేందుకు మాస్టర్ ప్లాన్ చేస్తుంది. ఆ ఫైల్స్ ని మార్చేందుకు అవనిని ఫాలో అవుతుంది. అవని కారు దిగడం చూసి పల్లవి తన ప్లాన్ ని వర్కౌట్ చేస్తుంది. ఆ డ్రైవర్ దగ్గరికి ఒక మనిషిని రమ్మని చెప్పి అడ్రస్ అడిగినట్లు అడిగి ఆ ఫైల్ ని మార్చేస్తుంది.. అవనినీ ఎలాగైనా ఇంట్లో అవమానించాలని పల్లవి ప్లాన్ చేస్తుంది.. రాజేంద్రప్రసాద్ సైన్ చేసాడో లేదో తెలుసుకోవాలని పల్లవి అవనీని ఫాలో అవుతుంది.. అది గమనించిన అవని పల్లవిని పట్టుకొని అక్షయ్ దగ్గరకు తీసుకొని వెళ్తుంది. ఇదంతా చేసింది పల్లవి అని అక్షయతో చెబుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి ప్లాన్ ఇదంతా అని అక్షయ్కి చెప్పగానే అక్షయ్ ఎందుకు ఇదంతా చేసావని పల్లవి పై సీరియస్ అవుతాడు. నేను చెప్తే మీరు నమ్మరు కదా పల్లవిది ఎంత క్రిమినల్ బ్రెయిన్ డ్రైవర్ చెప్తాడు అని డ్రైవర్ ని పిలుస్తుంది. డ్రైవర్ చెప్పగానే అక్షయ్ అది నిజమే అని నమ్ముతాడు.. నిజంగానే ఇదంతా పల్లవినే చేసిందని అక్షయ్ నమ్మేస్తాడు. పల్లవిని ఇదంతా ఎందుకు చేస్తావ్ నిజం చెప్పు లేదా పోలీసులను పిలవమంటావా అని అక్షయ్ సీరియస్ అవుతాడు.. పల్లవి అడ్డంగా దొరికిపోయానని టెన్షన్ పడుతూ ఉంటుంది.
అప్పుడే చక్రధర్ అక్కడికొచ్చి నేను చెప్తాను.. ఫైల్స్ మార్చింది వీరిద్దరే నిజం చెప్పండిరా అని చక్రధర్ వాళ్ళిద్దర్నీ తీసుకొస్తాడు.. ఆ ఫైల్స్ మేమే మార్చింది. మా కంపెనీ షేర్స్ వాటాను తీసుకోవాలని అలా చేసాము. అవని మేడం ఫైల్ ని చదివిన తర్వాత మేము ఈ ఫైల్ ని కూడా అందులో మార్చేసాము అని వాళ్ళు చెప్తారు. కానీ అవని మాత్రం వీళ్ళు చెప్పేదంతా నిజం కాదు అబద్ధం అని అరుస్తుంది. వీళ్లు వీళ్లతో కుమ్మక్కయి అబద్దం చెబుతున్నారు పోలీసులను పిలవండి. అసలు నిజం ఏంటో కనిపెడతారు అని అవని అంటుంది..
నా కూతురు ఏ తప్పు చేయలేదు ఊరికే నిందలు వేస్తున్నారు అని చక్రధర్ అంటాడు. వీళ్ళ గురించి తెలుసుకున్న నేను ఆ ఫైల్ లోని పేపర్స్ ని తీసేయాలని అనుకున్నాను బావగారు. అందుకే అవని అక్క దగ్గరికి వెళ్ళాను… అప్పటికే మావయ్య గారు ఆ ఫైల్స్ మీద సైన్ చేశారు. అది చెప్పాలనుకున్న టైం కూడా నాకు అవని అక్క ఇవ్వలేదు నన్ను వెంటబెట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చింది. నేను మా డాడీకి ఫోన్ చేసి ఈ ఫ్లవర్స్ గురించి చెప్పాను.. అందుకే వాళ్ళని పట్టుకుని తీసుకొచ్చాడు అని పల్లవి అంటుంది. మొత్తానికి పల్లవి అనుకున్న ప్లాను గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అక్షయ్ అవనీల మధ్య మరోసారి దూరం పెంచేస్తుంది.
అవని ఎంత చెప్తున్నా కూడా అక్షయ్ వినకుండా పల్లవిని తీసుకొని అవని ఎంత చెప్తున్నా కూడా అక్షయ్ వినకుండా వెళ్ళిపోతాడు.. అక్షయ్ పల్లవి ఇద్దరు కలిసి రావడం చూసి ఇంట్లోని వాళ్ళందరూ ఏంటి మీరిద్దరూ కలిసి వస్తున్నారు ఆఫీస్ కి వెళ్లలేదా అని అడుగుతారు. ఆఫీసులో పెద్ద ఘనకార్యం జరిగింది అది తలుచుకుంటే నాకు ఒళ్ళు మండిపోతుందని అక్షయ్ అంటాడు. ఈరోజు అవని అక్క చేసిన పనికి నన్ను అందరూ తప్పుగా అనుకునే వాళ్ళు అని పల్లవి డ్రామాలు మొదలు పెడుతుంది. కమల్ శ్రీకర్ ఒకవైపు మా వదిన మంచిదని ఎంత చెప్తున్నా కూడా అక్షయ్ పార్వతి ఇద్దరూ కూడా వారిని అరుస్తారు.
అటు పల్లవి అవని అక్కని మామయ్య గారు కావాలని బావగారి పక్కన కూర్చోబెట్టారు.. కనీసం ఆఫీసులో ఎటువంటి ఫైల్స్ మీద సంతకాలు పెట్టే అధికారం కూడా బావగారికి లేకుండా అవనికే ఇచ్చారు అని అంటుంది.. అంతేకాదు బావగారికి అధికారం రాకుండా కంపెనీని లాగేసుకునే ప్రయత్నం ఇది అని పల్లవి చెప్పగానే పార్వతి సీరియస్ అవుతుంది. ఈ విషయం గురించి ఆయన దగ్గరే నేను తేల్చుకుంటాను పదండి అని పార్వతి అందరూ కలిసి రాజేంద్రప్రసాద్ దగ్గరికి వెళ్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..