BigTV English

Rajendra Prasad:నేను ఇలానే మాట్లాడుతా… ఏం చేసుకుంటారో చేసుకోండి… మరోసారి రెచ్చిపోయిన రాజేంద్రప్రసాద్!

Rajendra Prasad:నేను ఇలానే మాట్లాడుతా… ఏం చేసుకుంటారో చేసుకోండి… మరోసారి రెచ్చిపోయిన రాజేంద్రప్రసాద్!

Rajendra Prasad:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నట కిరీటిగా పేరు సొంతం చేసుకున్న రాజేంద్రప్రసాద్ (Rajendraprasad) ఒకప్పుడు పలు సినిమాలలో హీరోగా నటించి, ఆ తర్వాత కమెడియన్ గా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ప్రముఖ స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన తాజాగా ‘షష్టిపూర్తి’ అనే సినిమాలో నటించారు. ఇందులో సీనియర్ నటి అర్చన (Archana ) యువహీరో రూపేష్, హీరోయిన్ ఆకాంక్ష ప్రధాన పాత్రల్లో నటించగా.. సాయి క్రియేషన్స్ బ్యానర్ పై రూపేష్ నిర్మించారు. ఈ చిత్రానికి యువ దర్శకుడు పవన్ దర్శకత్వం వహించారు. తల్లిదండ్రులు, పిల్లల ప్రేమానురాగాలని చాటి చెప్పే విధంగా రూపొందించిన ఈ సినిమా మే 30వ తేదీన విడుదల అయింది. ప్రస్తుతం ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తూ ఉండగా అటు థియేటర్లలో కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుండడంతో బ్లాక్ బాస్టర్ ఈవెంట్ ను సోమవారం రోజున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ ప్రముఖ కమెడియన్ ఆలీని గతంలో అసభ్యకర పదజాలంతో తిట్టారు. దీంతో ఆయనపై పూర్తిస్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది.


అలీపై అసభ్యకర కామెంట్స్ చేసిన రాజేంద్రప్రసాద్..

అసలేం జరిగిందనే విషయానికొస్తే..నిన్న (జూన్ 1) ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి (SV Krishna Reddy) జన్మదిన వేడుకలను చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజేంద్రప్రసాద్ తో పాటు శ్రీకాంత్, ఆలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఆలీని ఉద్దేశించి అసభ్యకర పదజాలంతో మాట్లాడారు. ఆ మాటకు ఆలీ నవ్వుతూ ఏం చెప్పాలో తెలియక అదోరకమైన ఎక్స్ప్రెషన్ తో కనిపించారు. అయితే ఈ విషయంపై రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు అటు ఇండస్ట్రీలోనూ ఇటు సోషల్ మీడియాలో కూడా నెగిటివిటీగా స్ప్రెడ్ అయ్యాయి. దీంతో అలీ పై చేసిన వ్యాఖ్యలను రాజేంద్రప్రసాద్ సమర్ధించుకున్నారు. ఆలీపై ఉన్న ప్రేమ అలాంటిది అంటూ తెలిపారు. అయినా సరే ఇప్పుడు ఆయనపై విమర్శలు వస్తున్న వేళ తాజాగా మరో కామెంట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు రాజేంద్రప్రసాద్.


నేను మారను.. ఏం చేసుకుంటారో చేసుకోండి – రాజేంద్ర ప్రసాద్

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. “ఈమధ్య కాలంలో నేను స్టేజ్ మీద ఏదైనా ప్రేమతో మాట్లాడినా.. పెడ అర్థాలు తీస్తున్నారు. అది మీ కర్మ.. నేను ఇలాగే ఉంటాను. మీరు మరోలా అర్థం చేసుకుంటే, అది మీ సంస్కారం. ఈ సినిమాని మీడియా భుజాల మీద వేసుకొని, ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లారు. అందుకే మీడియాను నేను ఎప్పుడూ ఒక మీడియా లాగా చూడలేదు. నా ఫ్యామిలీ గానే చూసాను. ఆ విషయం అందరికీ తెలుసు అందరూ నన్ను అన్నయ్య అని పిలవడం నా జన్మకు ధన్యం నా నిజమైన సక్సెస్ను ఎంజాయ్ చేసేందుకు నేను ఎక్కువ సేపు మాట్లాడేందుకు అనుమతి కూడా తీసుకున్నాను. నిజానికి నేను ఏదైనా మాట్లాడితే నేను ఒక రకంగా అర్థం చేసుకుంటే మిగతా వాళ్ళు దాన్ని వేరొకరకంగా అర్థం చేసుకుంటున్నారు. అది వారి కర్మ నేను ఇలాగే ఉంటాను ఎవరేమనుకున్నా నాకు ఏమాత్రం పర్వాలేదు.. ఆలీని నేను తిట్టిన విషయం గురించి మీరు ఆలోచిస్తున్నారు. కానీ వాడి పై నాకు చాలా ప్రేమ ఉంది. ఆ ప్రేమ కారణంగానే అలాంటి మాటలు వచ్చాయి. చిన్నప్పటి నుంచి నేను వాడిని చూసాను. కాబట్టి అలా సరదాగా మాట్లాడాను. ఎవరితో కూడా నేను తప్పుగా బిహేవ్ చేయలేదు” అంటూ తెలిపారు రాజేంద్రప్రసాద్.

ఎట్టకేలకు స్పందించిన అలీ..

ఇకపోతే రూమర్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యంలో తాజాగా ఆలీ స్పందిస్తూ.. “నిన్న కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలలో రాజేంద్రప్రసాద్ గారికి మాట తుళ్లింది. ఆయన సరదాగానే ఈ మాటలు మాట్లాడారు. కానీ కొంతమంది మీడియా మిత్రులు కావాలని తప్పుదోవ పట్టిస్తూ నెగిటివ్గా వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు. ఆయన మంచి ఆర్టిస్టు. ప్రస్తుతం పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. ఇటీవలే తల్లి లాంటి కూతుర్ని కోల్పోయిన దుఃఖం నుండి ఆయన ఇంకా బయటపడలేదు. ఆయన ఒక గొప్ప ఆర్టిస్టు. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయండి” అంటూ మీడియా మిత్రులను అలీ వేడుకున్నారు.

ALSO READ:Shiva Rajkumar: పాపం.. సొంత గడ్డపైనే వ్యతిరేకత.. శివన్నకెందుకీ కష్టాలు!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×