BigTV English

Manchu Vishnu: మెగా కుటుంబంతో విభేదాలపై స్పందించిన విష్ణు.. ఏమన్నారంటే..?

Manchu Vishnu: మెగా కుటుంబంతో విభేదాలపై స్పందించిన విష్ణు.. ఏమన్నారంటే..?

Manchu Vishnu..టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలుగా మెగా కుటుంబం వర్సెస్ మంచు కుటుంబం అన్నట్టుగా వ్యవహారాలు నడుస్తూ ఉంటాయని ఇప్పటికే ఎంతో మంది నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi ), మోహన్ బాబు(Mohan babu) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం లోపల ఉందని, కానీ బయటకు మాత్రం వెన్న పూసినట్టు కలిసి పోతారని ఇంకొంతమంది నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు. అయితే నిజంగానే ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయా? ఉంటే ఎందుకు ఉన్నాయి? అనే విషయాలు మాత్రం ఎప్పటికప్పుడు వైరల్ గానే మారుతూ ఉంటాయి. అయితే ఈ విషయాలపై ఎట్టకేలకు స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు మంచు మోహన్ బాబు నట వారసుడు మంచు విష్ణు (Manchu Vishnu).


హిట్ కోసం ఆరాటపడుతున్న మంచు విష్ణు..

మంచు విష్ణు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తండ్రి వారసత్వాన్ని ఉనికి పుచ్చుకొని ఇండస్ట్రీలో నటుడిగా మారిన ఈయన ‘ఢీ’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక చివరిగా ‘దూసుకెళ్తా’ సినిమాతో హిట్ అందుకున్న మంచు విష్ణు.. చాలా కాలంగా ఒక హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే పలు విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఇటీవల మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన ‘ఓం నమః శివాయ’ గ్లింప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఇది కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదని సమాచారం.


మెగా ఫ్యామిలీ విభేదాలపై క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు..

ఇదిలా ఉండగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో కన్నప్ప ప్రమోషన్స్ లో పాల్గొన్న మంచు విష్ణు.. ఈ విషయంపై స్పందించారు. “మా ఇరు కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవు” అని ఆయన స్పష్టం చేశారు. “ముఖ్యంగా అవన్నీ మీడియా తన లాభం కోసం కల్పించిన కథలే”అంటూ కూడా చెప్పారు. మా అధ్యక్ష ఎన్నిక సమయంలో కూడా ప్రకాష్ రాజ్ (Prakash Raj) కు వ్యతిరేకంగా పనిచేశాము. అయితే అది అక్కడితో ఆగిపోయింది. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తే ఆయనతో మేము మాట్లాడతాము. ఎప్పుడైనా కూడా ఆయన మాకు మెసేజ్ చేస్తూ ఉంటారు అంటూ విభేదాల గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు విష్ణు. మొత్తానికైతే సత్సంబంధాలు కొనసాగాలని చూసే మంచు విష్ణు ఇప్పుడు కూడా తమ మధ్య ఏమి లేదని క్లారిటీ ఇచ్చారు.ఇక ప్రస్తుతం మంచు విష్ణు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

కన్నప్ప మూవీ విశేషాలు..

కన్నప్ప మూవీ విషయానికి వస్తే..అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై డాక్టర్ మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. మంచు విష్ణు , మోహన్ లాల్ , అక్షయ్ కుమార్ , ప్రభాస్, కాజల్ అగర్వాల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×