BigTV English
Advertisement

KTR Padayatra : కేటీఆర్ పాదయాత్ర ప్రకటన – దొరగారికి తొందరెక్కువ అంటున్న పార్టీ పెద్దలు

KTR Padayatra : కేటీఆర్ పాదయాత్ర ప్రకటన – దొరగారికి తొందరెక్కువ అంటున్న పార్టీ పెద్దలు

KTR Padayatra : కొన్ని నెలల క్రితం విలేకరులతో మాట్లాడుతూ.. పాదయాత్రలు చేసిన వాళ్లంతా హీరోలు కాదు, అలా చేస్తే అధికారం వస్తుందని, సీఎంలు అవుతారని భావించడం ముర్ఖత్వం అన్నారు.. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు. అవును, నిజమేగా.. పాదయాత్రలతో సీఎం సీటు వస్తుందని తెలిస్తే.. ఓపిక లేని నాయకులు కూడా తీరిగ్గా పాదయాత్రలు పెట్టుకోరూ అంతా ఏకీభవించారు. మరి ఇంతలోనే ఏమైందో ఏమో కానీ.. తాను ఇక రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు పయనం అవుతున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ప్రతీ జిల్లాలో తిరిగి, అధికారాన్ని పట్టేసుకోవాలని, సీఎం సీటులో దర్జా ఒలకబోయాలని ప్లానింగ్ చేసేస్తున్నారు. కానీ.. అదేంటి సారు.. మొన్నే కదా, పాదయాత్రకు అధికారానికి సంబంధం లేదన్నావ్ అంటూ సెటైర్లు మెగుతూనే ఉన్నాయి.


తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రలకు మంచి క్రేజ్ ఉంది. ఎందుకో తెలియదు కానీ, మొదటి నుంచి పాదయాత్రలు చేసిన కీలక నాయకులు.. ఆ తర్వాతి ఎన్నికల్లో అధికారాన్ని అందిపుచ్చుకున్నారు. తొలుత వైఎస్సార్ ప్రారంభించిన ఈ ఒరవడి.. నేటి వరకు కొనసాగుతూనే ఉంది. 2004లో పాదయాత్ర ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని సాధించిన రాజశేఖర్ రెడ్డి.. ఆ తర్వాతా అధికారాన్ని నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన సమయంలోనూ ఈ పాదయాత్రలకు మంచి డిమాండ్ ఉంది. ఏపీలో అధికారం.. చంద్రబాబు సొంతమైతే జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా పూర్తిగా పాదయాత్ర చేస్తూ.. ప్రజల్లోనే తీరుగుతూ గడిపేశారు. ఏమైందో ఏమో కానీ 151 సీట్లతో అఖండ మెజార్టీ సాధించి… సీఎం పీఠం ఎక్కేశారు. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ తరఫున నారా లోకేష్ యువగళం పాదయాత్రను చేపట్టారు. అదేంటో కానీ.. 151 సీట్ల జగన్ 11 సీట్లకు పడిపోయారు.

తెలంగాణలోనూ ఇదే ఒరవడి కొనసాగింది. కేసీఆర్ పాలనా వైఫల్యాలపై పూర్తి స్థాయి అవగాహన కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ వైపు మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తే, మరోవైపు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసి.. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. రేవంత్ రెడ్డి అధికారం చేపట్టి… గట్టిగా ఏడాదిన్నర కూడా కాకముందే కేటీఆర్ కు అధికారం వైపు ఆశ మళ్లింది. పాదయాత్ర చేస్తే తానే నెక్స్ట్ ముఖ్యమంత్రి అనుకుంటూ.. మంచి షూ తెప్పించుకుంటున్నారు అంటూ కాంగ్రెస్ శ్రేణులు సెటైర్లు పేలుస్తున్నారు.


అయితే.. రాజకీయాల్లో నిర్ణయాలే తీసుకోవడం ముఖ్యం కాదు… వాటిని అమలు చేసే చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. కేసీఆర్ పాలన మీద, బీఆర్ఎస్ వైఫల్యాలపై అసహనంతోనే అధికారాన్ని కాంగ్రెస్ కు అప్పగిస్తే.. వారికి కనీస సమయం కూడా ఇవ్వకుండానే పాదయాత్ర అంటూ కేటీఆర్ హడావిడి మొదలు పెట్టేశారు. దాంతో.. తొందరెందుకు సుందరవదనా.. కాస్త ఆగు అంటూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సలహాలు ఇస్తున్నారు అంట. అయినా.. కేటీఆర్, కేసీఆర్..ఒకరి మాట వినే వారైతేగా.. రాష్ట్రం మొత్తం తిరగనివ్వండి. అప్పుడు కానీ.. వాళ్లు చెబుతున్న అభివృద్ధి ఏంటో.. ఆయనే స్వయంగా చూస్తారుగా అంటూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అంటున్నారు.

Also Read : KTR: హరీశ్‌ దెబ్బకు రోడ్డు మీద పడ్డ కేటీఆర్!?

అసలే సంక్షేమ పథకాలతో దూకుడుగా ఉన్న రేవంత్ సర్కార్.. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీపై చెరిగిపోని నెగిటివిటీని దృష్టిలో పెట్టుకుని పాదయాత్రతో మనకే నష్టం దొరవారు అని సలహాలు ఇస్తున్నారంట. రానున్న కాలంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు మొదలవ్వనున్న తరుణంలో.. గ్రామగ్రామన కేటీఆర్ ఇందిరమ్మ ఇళ్లను చూస్తూ వెళ్లొచ్చు అంటున్నారు. అదే సమయంలో.. గ్రామగ్రామన రేపు, ఎల్లుండి అంటూ వాయిదా వేస్తూ వచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సంగతీ తెలుస్తుందని అంటున్నారు.

Related News

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. ప్రచారంలో కనిపించని కేసీఆర్, కేడర్‌లో అనుమానాలు, నెక్ట్స్ ఏంటి?

KTR: బీఆర్ఎస్ కొత్త ప్లాన్.. ‘కారు’తో సీఎం చంద్రబాబు.. కేటీఆర్ కామెంట్స్ వెనుక

Maganti Gopinath Mother: నా కొడుకును చంపింది వాళ్లే.. పోలీస్ స్టేషన్‌కు మాగంటి గోపీనాథ్ తల్లి

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీలో పోస్టర్ల కలకలం

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ.. బిగ్ టీవీ సర్వేలో సంచలన ఫలితాలు

Big Stories

×